బిగ్‌బాస్ తెలుగు 4 గ్రాండ్ ఫినాలే రేసులోకి కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇవ్వనున్న తరుణంలో అందరిలో టెన్షన్ మొదలైంది. ఒకవారం అఖిల్ సీక్రెట్ రూముకు వెళ్లేసరికి కాస్త తగ్గినట్లు కనిపించాడు. ఆపై టాప్ 5 కంటెస్టెంట్ అభిజిత్ ఇప్పటికీ టాస్కులు సరిగా ఆడటం లేదని బిగ్‌బాస్ తెలుగు 4 హోస్ట్ నాగార్జున ఏకంగా గేట్లు ఓపెన్ చేసి ఇంటికి వెళ్లమని సూచించారు. ఇదే క్రమంలో స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా కనిపించిన కమెడియన్ అవినాష్ బిగ్‌బాస్ 4 గ్రాఫ్ తగ్గుతూ వస్తోంది.
గత వారం బిగ్‌బాస్ తెలుగు 4 ఎలిమినేషన్ నుంచి ఎవిక్షన్ పాస్ ద్వారా తప్పించుకున్నాడు అవినాష్. కానీ ఈవారం అతడు మళ్లీ డేంజర్ జోన్ లోకి వెళ్లే అవకాశాలు చాలా ఉన్నాయి. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్ అవినాస్ గ్రాఫ్ ఇటీవల తగ్గుతూ వస్తోంది. అందుకు పలు కారణాలు ఉన్నాయని బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 (Bigg Boss Telugu 4) ప్రేక్షకులు, నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. సీజన్ ఆరంభంలో తన కామెడీ టైమింగ్‌తో అవినాష్ ఆకట్టుకున్నాడు. కానీ రోజులు పెరిగేకొద్దీ రేస్ టు ఫినాలేకి దగ్గర అవుతారు. ఆ సమయంలో కామెడీ మైనస్ అయ్యే అవకాశాలు లేకపోలేదు.
తొలుత కొన్ని వారాలు సేఫ్ గేమ్ ఆడినట్లు కనిపించిన అవినాష్.. ఆ తర్వాత వారాల్లో నామినేషన్‌లోకి తన పేరు రావడంతో భయం మొదలైనట్లు కనిపించాడు. తనను ఓ కామెడీ షో నుంచి తీసేశారని, తనకు బతుకుదెరువు పోయిందంటూ పలుమార్లు నామినేషన్ సందర్భాలల్లోనూ ప్రస్తావించాడు. అయితే జబర్దస్త్ కమెడియన్ సోదరులు మాత్రం మీడియాతో మాట్లాడుతూ అన్నయ్య కచ్చితంగా ఆ కామెడీ షోలో చేస్తారు, మళ్లీ నిరూపించుకుంటారని చెప్పడంతో అవినాష్ చేస్తున్నది డ్రామా అని కొందరు ప్రేక్షకులు ఓ నిర్ణయానికి వచ్చేశారు.
మోనాల్, అరియానా నామినేషన్‌లో ఉన్నప్పటికీ కంటెస్టెంట్ అవినాష్‌కే తక్కువ ఓట్లు రావడం బిగ్‌బాస్ తెలుగు 4 (Bigg Boss Telugu 4) ప్రేక్షకులకు అతడిపై ఉన్న నమ్మకం, అభిమానాన్ని తెలుపుతుంది. తన కామెడీని పక్కనపెట్టి భయానికి గురవడం, సింపథికి సంబంధించేలా తనను సో నుంచి తీసేశారు. ఇక అవకాశం లేదంటూ నామినేషన్ల సమయంలో చెబితే ప్రేక్షకులు వినిపించుకునే స్టేజ్ దాటిపోయింది. ప్రతి ఒక్క ఆటగాడు తమ ట్రిక్స్ వాడుతూ టాప్ 5కి దారులు వేసుకుంటున్నారు. మెహబుబ్ లాంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్ కేవలం హౌస్‌లోకి వచ్చిన తర్వాతే ప్రేక్షకులు చాలా మందికి తెలియడంతో అతడికి ఓట్లు అంతగా పడక ఎలిమినేట్ అయ్యాడు. కానీ కామెడీతో మెప్పించిన అవినాష్ మాత్రం బిగ్ బాస్ రేస్‌లో నిలవాలంటే గేర్ మార్చాల్సిందేనని అర్థమవుతోంది.
Also Read : Best LIC Policies: 5 బెస్ట్ ఎల్ఐసీ పాలసీలు ఇవే.. మీరూ ఓ లుక్కేయండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe