Bigg Boss 5 Telugu: షన్నూ ఫ్యాన్స్ ఫోన్ చేసి మరీ తిడుతున్నారు: సరయు

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ రియాలిటీ షో నుంచి తొలి వారం ఎలిమినేట్ అయిన సరయు..షణ్ముఖ్ జస్వంత్ పై సంచలన ఆరోపణలు చేసింది. తన 7 ఆర్ట్స్ యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఆ విషయాలను బయటపెట్టింది. 

Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 15, 2021, 04:22 PM IST
Bigg Boss 5 Telugu: షన్నూ ఫ్యాన్స్ ఫోన్ చేసి మరీ తిడుతున్నారు: సరయు

Bigg Boss 5 Telugu:తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 రియాలిటీ రోజురోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. బిగ్ బాస్ షో అంటేనే రచ్చ. కంటెస్టంట్స్ అప్పటికప్పుడే తిట్టుకుంటారు..కాసేపటికే కలిసిపోతారు..నా అనుకున్న వాళ్లనే ఎలిమినేట్ చేస్తారు.. ఇవన్నీ బిగ్ బాస్ గేమ్ లో భాగం. అయితే స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన సరయు (sarayu)...తొలి వారమే ఎలిమినేట్ అయ్యింది. దీంతో ఆమె అభిమానులు ఒక్కసారిగా షాక్ గురయ్యారు.

అయితే సరయు ఎలిమినేషన్(Elimination) విషయంలో మాత్రం అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. ఓటింగ్ ప్రకారమే సరయు ఎలిమినేట్ అయ్యిందా ? లేక కావాలనే తప్పించారా అనే దానిపై నెట్టింట్లో ఇప్పటికీ చర్చ జరుగుతుంది. ఎలిమినేట్ తర్వాత ఎక్కడా ఇంటర్వ్యూస్ ఇవ్వని సరయు.. తాజాగా తన 7 ఆర్ట్స్ యూట్యూబ్ ఛానల్(7 Arts Youtube Channel) ద్వారా షాకింగ్ కామెంట్స్ చేసింది.

Also read: Saidabad Girl Case: సైదాబాద్‌ బాలిక కేసులో కీలక నిర్ణయం, నిందితుడిని పట్టించిన వారికి పెద్ద మొత్తంలో రివార్డ్

సరయు ఎలిమినేట్ అయిన తర్వాత నాగ్ ఎదురుగానే ఒక్కొక్కరిని కడిగిపారేసింది. ఫేక్ ఆడుతున్నారని.. ముఖ్యంగా షణ్ముఖ్, సిరి కలిసి ఆడుతున్నారని.. ముందుగానే మాట్లాడుకుని వచ్చారని షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆ తర్వాత బిగ్ బాస్ బజ్‏లోనూ షణ్ముఖ్(shanmukh jashwanth) పై తీవ్ర ఆరోపణలు చేసింది సరయూ. షణ్ముఖ్‏కి దమ్ముంటే మగాడిలా ఆడాలని.. లేదంటే గాజులేసుకుని కూర్చోవాలని తెలిపింది. అలాగే సిరి మగాళ్లను అడ్డుపెట్టుకుని గేమ్ ఆడుతుందంటూ తెలిపింది. 

హౌస్ నుంచి బయటకు వచ్చిన తనని షన్నూ ఫ్యాన్స్(Shanmukh Fans) అసభ్య  పదజాలంతో దూషిస్తున్నారని..దారుణంగా తిడుతున్నారని చెప్పుకొచ్చింది సరయూ. ఇంట్లో జరిగిన అన్ని విషయాలను టెలికాస్ట్ చేయలేదని.. అక్కడ జరిగిన అన్ని గొడవలకు సంబంధించిన పూర్తి ఆధారాలు తన దగ్గర ఉన్నాయని తెలిపింది. అంతేకాకుండా.. ఫోన్స్ చేసి మరీ తనను తిడుతున్నారని వీడియోలో చెప్పుకొచ్చింది సరయు.

ఎన్ని ఇబ్బందులు పడుంటే ఆ మాట అంటాను..
ఇక హైదరాబాద్‏లోని సింగరేణి కాలనీలో ఆరేళ్ల పాప పై జరిగిన ఘటన గురించి గానీ.. ఆ పాప పేరెంట్స్‏ కోసం గానీ.. తనను అటాక్ చేసిన దాంట్లో సగం కూడా కేటాయించలేదని.. తను ఈరోజు వాళ్ల పేరెంట్స్‏కు సపోర్ట్ చేయడానికి వెళ్తున్నానని.. దమ్ముంటే అక్కడకు వచ్చి వాళ్లకు సపోర్ట్ చేయాలని సవాల్ విసిరింది. ఆ తర్వాత నన్ను అటాక్ చేయండి… అప్పుడు నాకు సమాధానం ఇవ్వండి అంటూ చెప్పుకొచ్చింది సరయు. షణ్ముఖ్‏ను మూలన కూర్చో అన్నందుకు నన్ను టార్గెట్ చేస్తున్నారు.. కానీ లోపల ఎన్ని ఇబ్బందులు పడుంటే ఆ మాట అంటాను.. నాకు సపోర్ట్ ఇస్తారనుకున్నా.. కానీ నన్ను అటాక్ చేస్తున్నారు. లోపల జరిగినవి ఏవి టెలికాస్ట్ కాలేదు. అయినా నా దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

More Stories

Trending News