Siri and Srihan: సిరి-శ్రీహన్ బ్రేకప్ కధకు బ్రేక్, యాంకర్ రవి ఇంట్లో కలయిక

Siri and Srihan: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5 రెండు జంటల్ని విడదీసింది. దీప్తి..షణ్ముఖ్‌కు బ్రేకప్ చెబితే..శ్రీహాన్..సిరికి గుడ్ బై చెప్పేశాడు. అయితే ఇప్పుడిందులో ఓ జంట తిరిగి ఒక్కటైందని తెలుస్తోంది. ఆ ఫోటోలిప్పుడు వైరల్ అవుతున్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 5, 2022, 08:59 AM IST
Siri and Srihan: సిరి-శ్రీహన్ బ్రేకప్ కధకు బ్రేక్, యాంకర్ రవి ఇంట్లో కలయిక

Siri and Srihan: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5 రెండు జంటల్ని విడదీసింది. దీప్తి..షణ్ముఖ్‌కు బ్రేకప్ చెబితే..శ్రీహాన్..సిరికి గుడ్ బై చెప్పేశాడు. అయితే ఇప్పుడిందులో ఓ జంట తిరిగి ఒక్కటైందని తెలుస్తోంది. ఆ ఫోటోలిప్పుడు వైరల్ అవుతున్నాయి.

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5 రేపిన అలజడి అంతా ఇంతా కాదు. హౌస్‌లో ఎప్పుడూ ఉండే వివాదాలే కాకుండా రెండు కీలకమైన ఆసక్తికరమైన పరిణామానికి, భారీ ట్రోలింగ్‌కు కారణమైంది ఈ వేదిక. బిగ్‌బాస్ హౌస్‌లో ఎంట్రీ ఇచ్చేటప్పటికే సిరికి శ్రీహాన్‌తో, షణ్ముఖ్‌కు దీప్తి సునయనతో లవ్ ఎఫైర్ నడుస్తోంది. త్వరలో పెళ్లి చేసుకోవల్సిన పరిస్థితి. బిగ్‌బాస్ లేకుంటే ఈ పాటికి పెళ్లి కూడా జరిగుండేది. అయితే బిగ్‌బాస్ ప్రారంభమయ్యాక...ఈ రెండు జంటల మధ్య వివాదం, అగాధం ఏర్పడింది. జంటలు విడిపోయాయి. దీనికి కారణం బిగ్‌బాస్‌లో సిరి-షణ్ముఖ్‌ల మధ్య నడిచిన లవ్ ఎఫైర్, హగ్‌లతో రెచ్చిపోవడమే. బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5 పూర్తయిన వెంటనే దీప్తి సునయన..షణ్ముఖ్‌కు బ్రేకప్ చెప్పగా, శ్రీహాన్ ..సిరి ఫోటోల్ని డిలీట్ చేశాడు. 

అయితే చాలాకాలం తరువాత మళ్లీ సిరి - శ్రీహాన్‌లు కలిసిపోయారు. ఇటీవల ఈ ఇద్దరూ హైదరాబాద్‌లో యాంకర్ రవి ఇంట్లో కలిశారు. యాంకర్ రవి (Anchor Ravi) కుటుంబసభ్యులతో కలిసి ఫోటోలు దిగారు. ఈ ఫోటోల్ని స్వయంగా యాంకర్ రవి భార్య నిత్య సక్సేనా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఇద్దరూ తిరిగి కలవడం సంతోషంగా ఉందని పోస్ట్ చేసింది. ఈ పోస్ట్‌తో సిరి-శ్రీహాన్ బ్రేకప్ కధ ముగిసింది. తిరిగి కలుసుకున్నారు. మరి దీప్తి సునయన-షణ్ముఖ్ పరిస్థితి ఏంటనేది ఆసక్తిగా మారింది.

Also read: Samantha Struggle Life: డబ్బుల్లేక ఒక్క పూట భోజనం చేసేదాన్ని.. రూ. 500 కోసం ఆ పనులు చేశానన్న సమంత!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News