Kaushal Manda: హాస్పిటల్ బెడ్‌పై బిగ్ బాస్ కౌశల్ తండ్రి.. ఎమోషనల్ వీడియో

Kaushal Manda Father Hospitalized: తన తండ్రి ఆసుపత్రి బెడ్‌పై ఉన్న వీడియోను షేర్ చేశాడు నటుడు కౌశల్. తల్లిదండ్రులను మంచిగా చూసుకోవాలంటూ క్యాప్షన్ ఇచ్చాడు. త్వరగా కోలుకోవాలంటూ నెటిజన్లు కోరుకుంటున్నారు.    

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 29, 2023, 12:56 PM IST
Kaushal Manda: హాస్పిటల్ బెడ్‌పై బిగ్ బాస్ కౌశల్ తండ్రి.. ఎమోషనల్ వీడియో

 Kaushal Manda Father Hospitalized: బిగ్‌బాస్ సీజన్-2 విన్నర్ కౌశల్ తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్నారు. తన తండ్రి ఆసుపత్రి బెడ్‌పై ఉన్న వీడియోను షేర్ చేశాడు. తండ్రిని ఆసుపత్రిలో చేర్పించి.. సేవ చేస్తున్నట్లు వీడియోలో ఉంది. అయితే ఏం జరిగిందని కౌశల్ వెల్లడించలేదు. తన తండ్రి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. మీ తల్లిదండ్రులను మిమ్మల్ని చూసుకున్న దానికంటే ఎక్కువగా చూసుకోవాలని కోరాడు. కౌశల్ తండ్రి త్వరగా రికవరీ కావాలంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. బీ స్ట్రాంగ్ అంటూ కౌశల్‌కు చెబుతున్నారు.

కౌశల్ తండ్రి సుందరయ్య బుల్లితెరపై ఎన్నో సీరియల్స్‌లో నటించి పేరు సంపాదించారు. భిన్నమైన పాత్రల్లో అభిమానులను మెప్పించారు. కౌశల్ కూడా సీరియల్‌ నటుడిగా అలరించాడు. మోడలింగ్‌తోపాటు పలు సినిమాల్లో కౌశల్ నటించాడు. బిగ్ బాస్‌ షోలోకి ఎంట్రీ ఇచ్చిన తరువాత భారీ క్రేజ్ సంపాదించాడు. ఏ మాత్రం అంచనాలు లేకుండా వెళ్లి.. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌తో బయటకు వచ్చాడు. కౌశల్ హౌస్‌లో ఉన్నప్పుడు కౌశల్ ఆర్మీ పేరుతో బయట ఏకంగా స్పెషల్ క్యాంపెయిన్స్ నిర్వహించారు అభిమానులు. 

 

 
 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Kaushal Manda (@kaushalmanda)

అయితే బిగ్‌హౌస్ నుంచి బయటకు వచ్చిన తరువాత అదేస్థాయిలో నెగెటివిటీని తెచ్చుకున్నారు. సినిమా హీరో ఆఫర్లు వచ్చినా.. కెరీర్‌కు ఏ మాత్రం ఉపయోగపడలేదు. ఆ సినిమాలు విడుదలైనట్లు కూడా చాలామందికి తెలియదు. కౌశల్ ఆర్మీ ఫౌండేషన్, ఆర్గనైజేషన్ అంటూ సేవా కార్యక్రమాలు, ఫండ్స్ పెద్ద ఎత్తున గతంలో కాంట్రవర్సీలను క్రియేట్ చేశాయి. అప్పడప్పుడు బుల్లితెరపై స్పెషల్ షోలు, ఈవెంట్స్‌ చేస్తున్నాడు కౌశల్. 

Also Read: Asia Cup 2023: సచిన్ రికార్డుపై రోహిత్ శర్మ కన్ను.. టాప్ ప్లేస్‌కు చేరవలో..! 

Also Read: Cultural Sarathi Employees: కళాకారులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్.. భారీగా వేతనాలు పెంపు  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

  

Trending News