Bigg Boss Telugu 4: ‘నా ఫిగర్‌ను కూడా వదల్లేదు.. దమ్ముంటే ఆమెతో ట్రై చెయ్’

Bigg Boss Telugu 4 | హౌస్‌లో కండలవీరుడిగా ఉన్న కంటెస్టెంట్ మెహబూబ్‌పై అమ్మ రాజశేఖర్ చేసిన కామెంట్లు (Amma Rajashekar comments on Mehaboob), ఆయన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. కంటెస్టెంట్స్ అప్పుడే పులిహోర కలపడం మొదలుపెట్టేశారు. తొలి వీకెండ్‌లో బిగ్ బాస్ తెలుగు 4 హోస్ట్ నాగార్జున సైతం ఈ విషయాన్ని ప్రస్తావించడం తెలిసిందే.

Last Updated : Sep 16, 2020, 04:57 PM IST
  • కుమార్ సాయి సహా 9 మంది కంటెస్టెంట్స్ నామినేట్
  • కంటెస్టెంట్స్ అప్పుడే పులిహోర కలపడం మొదలుపెట్టేశారు
  • మెహబూబ్‌పై అమ్మ రాజశేఖర్ చేసిన కామెంట్లు, వ్యాఖ్యలు వైరల్
Bigg Boss Telugu 4: ‘నా ఫిగర్‌ను కూడా వదల్లేదు.. దమ్ముంటే ఆమెతో ట్రై చెయ్’

తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4 (Bigg Boss Telugu 4) జోరుగా సాగుతోంది. కంటెస్టెంట్స్ అప్పుడే పులిహోర కలపడం మొదలుపెట్టేశారు. తొలి వీకెండ్‌లో బిగ్ బాస్ తెలుగు 4 హోస్ట్ నాగార్జున సైతం ఈ విషయాన్ని ప్రస్తావించడం తెలిసిందే. నటి దివిని.. నీకు వంటచేసే అబ్బాయిలు కాదు అంకుల్స్ అంటే చాలా ఇష్టమనుకుంటా అని నాగ్ తనదైన మార్కు ప్రశ్న వేశారు. కొరియోగ్రాఫర్ అమ్మ రాజశేఖర్ బిగ్ బాస్ హౌస్ కిచెన్‌లో ఆట పట్టించడం.. ఆమెను ఇంప్రెస్ చేయడానికి చేసే పనులతో నాగార్జున అడిగారు. మంగళవారం రాత్రి ఎపిసోడ్ మరో రేంజ్‌కు వెళ్లిపోయింది. Bigg Boss 4 Voting Numbers: మీ ఫెవరెట్ కంటెస్టెంట్స్‌ ఓటింగ్ నెంబర్స్ ఇవే...

మరో కంటెస్టెంట్ మెహబూబ్‌పై అమ్మ రాజశేఖర్ చేసిన కామెంట్లు (Amma Rajashekar comments on Mehaboob), ఆయన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. హౌస్‌లో కండలవీరుడిగా ఉన్న మెహబూబ్ (Bigg Boss 4 Contestant Mehaboob).. మరో సభ్యురాలు దివిని అమాంతం అలా చేతుల్లోకి తీసుకుని ఎత్తుకెళ్లిపోయాడు. ఈ సీన్ చూడగానే అమ్మ రాజశేఖర్.. అందరు అమ్మాయిని తీసుకెళ్లిపోతున్నావ్. అయ్యో మెహబూబ్ నువ్వు నా ఫిగర్ (దివి)ని కూడా ఎత్తుకెళ్లిపోతున్నావ్. ఇది నాకు పరువుపోయినట్లు అనిపిస్తుంది. హౌస్‌లో అందర్నీ నువ్వు తీసుకెళ్లిపోతున్నావ్ ఏంట్రా బాబు అని కుళ్లుకున్నాడు. అమ్మరాజశేఖర్ మాటలకు హౌస్ సభ్యులు భలే నవ్వుకున్నారు. Bigg Boss Telugu 4: రెండో వారం నామినేషన్‌లో గంగవ్వ సహా 9 మంది సభ్యులు

దివిని అలా కిందకి దించిన తర్వాత.. అసలు బరువే లేవు అని మెహబూబ్ అన్నాడు. ఇది విన్న రాజశేఖర్ ‘వాళ్లను వీళ్లను .. తక్కువ బరువున్న వాళ్లను ఎత్తడం కాదు. దమ్ముంటే కళ్యాణిని ఎత్తుకుని చూపించమని’ మెహబూబ్‌కు సవావ్ విసిరాడు. కళ్యాణి అక్క ఇక్కడకు రమ్మని మెహబూబ్ పిలవగానే ఆమె వెళ్లింది. మెహబూబ్ ఒక్కసారి కరాటే కళ్యాణిని అలా చేతుల్లోకి ఎత్తుకుని దింపాడు.. బిగ్ బాస్ 4 హౌస్ సభ్యులు చప్పట్లు కొట్టారు. సరదాతో పాటు హౌస్‌లో ఎక్కువగా పులిహోర కలపడం అనే టాపిక్ కూడా మాట్లాడుకుంటున్నారు. Actress Sravani Suicide Case: లొంగిపోయిన RX 100 నిర్మాత అశోక్ రెడ్డి 

ఫొటో గ్యాలరీలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYeR

Trending News