Monal Gajjar: బిగ్‌బాస్ కంటెస్టెంట్ మోనాల్ డిమాండ్ మామూలుగా లేదుగా

Monal Gajjar: బిగ్‌బాస్‌తో బాగా పాపులర్ అయినట్టుంది మోనాల్ గజ్జర్. అందుకే దీపముండగానే ఇళ్లు చక్కదిద్దుకోవాలనుకుంటోంది. బిగ్‌బాస్ తెచ్చిపెట్టిన క్రేజ్‌తో తెగ డిమాండ్ చేస్తోంది. 

Last Updated : Dec 29, 2020, 05:58 PM IST
Monal Gajjar: బిగ్‌బాస్ కంటెస్టెంట్ మోనాల్ డిమాండ్ మామూలుగా లేదుగా

Monal Gajjar: బిగ్‌బాస్‌తో బాగా పాపులర్ అయినట్టుంది మోనాల్ గజ్జర్. అందుకే దీపముండగానే ఇళ్లు చక్కదిద్దుకోవాలనుకుంటోంది. బిగ్‌బాస్ తెచ్చిపెట్టిన క్రేజ్‌తో తెగ డిమాండ్ చేస్తోంది. 

బిగ్‌బాస్ ( Bigg Boss ) దత్తపుత్రికగా పేరు తెచ్చుకున్న బిగ్‌బాస్ 4 తెలుగు కంటెస్టెంట్ మోనాల్ గజ్జర్  ( Bigg Boss Telugu Contestant Monal Gajjar ) అందరికీ సుపరిచితమే ఇప్పుడు. సుడిగాడు సినిమాతో తెలుగు సినిమాకు పరిచయమైనా..పలు సినిమాల్లో నటించినా రాని క్రేజ్ అంతా బిగ్‌బాస్ షో ( Bigg Boss Show ) ‌తో వచ్చేసింది. అందుకే ఆ క్రేజ్‌ను పూర్తిగా వాడుకోవాలని డిసైడ్ అయిపోయిందట. దీపముండగానే ఇళ్లు చక్కదిద్దుకునేందుకు ప్రయత్నిస్తోంది.

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 4 ( Bigg Boss Telugu Season 4 ) తో వచ్చిన క్రేజ్ ఆధారంగా డిమాండ్ పెంచేసింది ఈ గుజరాతీ భామ. బెల్లంకొండ సాయి శ్రీనినాస్ హీరోగా నటిస్తున్న అల్లుడు అదుర్స్ సినిమాలో ఓ ఐటెం సాంగ్ ఆఫర్ వస్తే భారీగా డిమాండ్ చేసిందట. 3 నిమిషాల పాటకు 15 లక్షలు అడిగిందట. అంటే నిమిషానికి 5 లక్షలన్నమాట. 

నిర్మాత కూడా ఆమె అడిగినంత ఇవ్వడానికి ఒప్పుకున్నారు. ఇంకేం ఫిక్స్ అయిపోయింది. ఇక రానున్న సినిమా ఆఫర్లకు కూడా సిట్యువేషన్‌కు తగ్గ డిమాండ్ చేసి..క్రేజ్‌ను వాడుకోవాలనుకుని డిసైడ్ అయింది మోనాల్ గజ్జర్ ( Monal Gajjar ).

Also read: Tollywood నటుడు వరుణ్ తేజ్‌కు కరోనా పాజిటివ్.. షాకింగ్ ట్వీట్

Trending News