తెలంగాణ పల్లె నేపథ్యంతో.. బిలాల్‌పూర్ పోలీస్ స్టేషన్ మూవీ ట్రైలర్

బిలాల్‌పూర్ పోలీస్ స్టేషన్ మూవీ ట్రైలర్

Last Updated : Sep 4, 2018, 09:24 PM IST
తెలంగాణ పల్లె నేపథ్యంతో.. బిలాల్‌పూర్ పోలీస్ స్టేషన్ మూవీ ట్రైలర్

తెలంగాణ నేపథ్యంతో ఓ సస్పెన్స్ డ్రామా కథనంతో తెరకెక్కిన బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్ మూవీ ట్రైలర్ రిలీజైంది. ఇటీవలే ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల చేతుల మీదుగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజైన సంగతి తెలిసిందే. మాగంటి శ్రీనాథ్, శాన్వి మేఘన జంటగా నటించిన ఈ సినిమాలో ప్రముఖ ప్రజాకవి, గాయకుడు గోరెటి వెంకన్న మరో ప్రధాన పాత్రలో నటించారు. తనదైన స్టైల్లో షార్ట్ ఫిలింస్ రూపొందించి, వాటిలో నటించి పేరు తెచ్చుకున్న ఆర్.ఎస్. నంద ఈ సినిమాలో మరో ముఖ్య పాత్ర పోషిస్తున్నట్టు యూనిట్ వర్గాలు తెలిపాయి. ఎం.ఎస్. క్రియేషన్స్ బ్యానర్‌పై మహంకాళి శ్రీనివాసులు నిర్మి్స్తున్న ఈ సినిమాను నాగసాయి మకం డైరెక్ట్ చేస్తున్నాడు.

Trending News