Devara Update: ఈ ఏడాది ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ ఆత్రుతగా ఎదురుచూస్తున్న సినిమా దేవర. రెండు భాగాలుగా విడుదల కాబోతున్న ఈ సినిమాలోని మొదటి భాగం ఈ ఏడాది సెప్టెంబర్ 27 న విడుదల కాబోతోంది. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. జనతా గ్యారేజ్ వంటి…సూపర్ హిట్ సినిమా తరువాత మళ్ళీ ఎన్టీఆర్, కొరటాల కాంబో లో రాబోతున్న రెండవ సినిమా ఇది. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం ప్రముఖ బాలీవుడ్ నటుడు.. బాబీ డియోల్ ను రంగంలోకి దింపుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే బాలీవుడ్ నటుడు.. సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమాలో విలన్ పాత్ర పోషిస్తున్నట్లు తెలిసిందే. ఇప్పుడు బాబి డియోల్ పేరు బయటకి రావడంతో సైఫ్ అలీఖాన్ స్థానంలో బాబీ డియోల్ ను దింపుతున్నారా అని కూడా కామెంట్స్ వినిపించాయి.
కానీ తాజా సమాచారం ప్రకారం బాబీ డియోల్ ఈ సినిమాలో సెకండ్ విలన్ పాత్రలో కనిపించబోతున్నారు. బాబీ డియోల్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. ఈ మధ్యనే సందీప్ వంగా దర్శకత్వంలో తెరకెక్కిన యానిమల్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఆ సినిమాలో బాబీ డియోల్ మెయిన్ విలన్ గా కనిపించారు. ఆ సినిమా తెలుగులో కూడా మంచి హిట్ అయ్యింది. ఈ సినిమా సూపర్ హిట్ తర్వాత బాబీ డియోల్ కి బోలెడు తెలుగు ఆఫర్లు కూడా వచ్చి పడ్డాయి.
ప్రస్తుతం దేవర బృందం బాబీ డియోల్ తో సినిమాకి సంబంధించిన చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ల పై నందమూరి కళ్యాణ్ రామ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న #NBK109లో కూడా బాబీ డియోల్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. పవన్ కళ్యాణ్ హరి హర వీర మల్లు సినిమాలో బాబీ డియోల్ నటిస్తున్నారని టాక్ ఉంది కానీ ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.
ఇదీ చదవండి: ఆ తరంలో NTR, కృష్ణంరాజు.. ఈ జనరేషన్ లో రాజశేఖర్, ప్రభాస్ లకే ఆ క్రెడిట్ దక్కింది..
ఇదీ చదవండి: ‘కల్కి ’ సినిమాలో నాగ్ అశ్విన్ చేసిన ఈ బ్లండర్ మిస్టేక్ ను గుర్తించారా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter