Salaar Part 2: సలార్ పార్ట్ 2 పై బిగ్ అప్డేట్.. అఫీషియల్ గా చెప్పేసిన నటుడు..

Salaar Update: సలార్ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో మనందరికీ తెలిసిన విషయమే. ప్రభాస్ కి బాహుబలి తర్వాత మరోసారి సూపర్ సక్సెస్ అందించింది ఈ చిత్రం. అందుకే ఈ చిత్రం సీక్వెల్ పై మొదటి నుంచి అంచనాలు భారీగా ఏర్పడ్డాయి

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 4, 2024, 05:01 PM IST
Salaar Part 2: సలార్ పార్ట్ 2 పై బిగ్ అప్డేట్.. అఫీషియల్ గా చెప్పేసిన నటుడు..

Prabhas Salaar 2: కేజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన పాన్ ఇండియా సినిమా సలార్ పార్ట్ 1. దాదాపు బాహుబలి తర్వాత మరోసారి ప్రభాస్ కి అంతటి విజయం అందించింది ఈ చిత్రం. వరుస ప్లాపులతో సతమతమవుతున్న ప్రభాస్ కి సూపర్ హిట్ ఇచ్చి  డార్లింగ్ అభిమానులకు పెద్ద ఊరట ఇచ్చింది. గత సంవత్సరం డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకి వచ్చిన సలార్ దాదాపు 700 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. 

ప్రస్తుతం ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. కాగా ఈ సినిమా మొదటి పార్ట్ సగంలో ముగిసి రెండో పార్ట్ పైన అంచనాలను భారీగా పెంచింది. దీంతో ప్రభాస్ అభిమానులు ఈ సినిమా రెండో భాగం గురించి తెగ ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు షూటింగులు చేస్తూ చాలా బిజీగా ఉన్నారు. ఈ మధ్యనే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రాబోతున్న కల్కి 2898AD మూవీ షూట్ పూర్తిచేసాడు. త్వరలో మారుతి డైరెక్షన్ లో రాబోతున్న రాజాసాబ్ షూటింగ్ నెక్స్ట్ షెడ్యూల్స్ కూడా మొదలు పెట్టనున్నారు. కాగా ఆ తర్వాత సలార్ పార్ట్ 2 షూటింగ్ మొదలుపెట్టనున్నాడట ప్రభాస్. 

అయితే యానిమల్ సినిమాకి సూపర్ సక్సెస్ అందుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి ప్రభాస్ తో తాను చేయబోతున్న స్పిరిట్ సినిమా షూట్ 2025 లో మొదలవుతుందని ఈ మధ్యనే ప్రకటించాడు. అందుకే అంతలోపు సలార్ 2 పూర్తిచేద్దామని ప్రభాస్ ఫిక్స్ అయ్యాడట.

తాజా సలార్ 2 గురించి ఒక  అఫీషియల్ అప్డేట్ బయటపెట్టారు ఈ చిత్ర నటుడు బాబీ సింహ. ఓ ఇంటర్వ్యూలో బాబీ సింహ మాట్లాడుతూ.. సలార్ రెండో భాగం షూటింగ్ ఏప్రిల్ నుంచి ఉండొచ్చని, ఆ సినిమా షూట్ కోసం ఎదురుచూస్తున్నాను అని తెలిపాడు. కాగా బాబీ సింహ సలార్ ఫస్ట్ పార్ట్ క్లైమాక్స్ పెద్ద ఇచ్చిన సంగతి తెలిసిందే. మరి ఆ ట్విస్ట్ తర్వాత ఏమవుతుంది అనేది రెండో భాగం శౌర్యంగాపర్వంలో చూడాలి.  ఈ నేపథ్యంలో బాబీ సింహ రెండో భాగం షూటింగ్ గురించి ఇచ్చిన అప్డేట్ ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.

Read More: Grapes Fruit Benefits: ద్రాక్ష పండు రుచికరం మాత్రమే కాదు ఆరోగ్యకరమైనది కూడా..!

Read More: Rashmika: చిన్నప్పటి కళ ఇప్పటికి నెరవేరింది.. రష్మిక ఎమోషనల్ పోస్ట్..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News