బాలీవుడ్ ప్రముఖ యాక్షన్ డైరెక్టర్ పర్వేజ్ ఖాన్(55) గుండెపోటుతో మృతిచెందారు. శనివారం రాత్రి ఛాతీలో నొప్పి రావడంతో కుటుంబసభ్యులు పర్వేజ్ ఖాన్ (Parvez Khan)ను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. కానీ వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. రూబీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూనే సోమవారం పర్వేజ్ ఖాన్ (Parvez Khan Died) తుదిశ్వాస విడిచారు. COVID19: హాస్పిటల్ నుంచి ఐశ్వర్యరాయ్, ఆరాధ్య డిశ్ఛార్జ్
యాక్షన్ డైరెక్టర్ పర్వేజ్ ఖాన్ ఇకలేరన్న విషయాన్ని ఫిల్మ్ మేకర్ హన్సల్ మెహతా తెలిపారు. తాను, పర్వేజ్ కలిసి జాతీయ అవార్డు సాధించిన షహిద్(2013) సినిమాకు పనిచేశామని గుర్తుచేసుకున్నారు. కేవలం సింగిల్ టేక్‌లో యాక్షన్ సీన్లు పూర్తి చేశామన్నారు. నీ గొంతు ఇప్పటికీ నా చెవిలో మార్మోగుతుంది. టాలెంటెడ్, మంచి వ్యక్తి. మీ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ హన్సల్ మెహతా ట్వీట్ చేశారు. నితిన్, షాలిని పెళ్లి వేడుక ఫొటోలు
1992లో వచ్చిన అక్షయ్ కుమార్ సినిమా ఖిలాడిలో యాక్షన్ డైరెక్టర్ అక్బర్ భక్షికి అసిస్టెంట్‌గా పర్వేజ్ ఖాన్ తన కెరీర్ ప్రారంభించారు. రామ్ గోపాల్ వర్మ తీసిన అబ్ తక్ ఛప్పన్ సినిమాతో సొంతంగా స్టంట్స్, ఫైట్ మాస్టర్‌గా మారారు. పర్వేజ్ ఖాన్‌కు భార్య, కుమారుడు, కోడలు, మనవరాలు ఉన్నారు. బికినీలో టైటిల్ నెగ్గిన నటి హాట్ హాట్‌గా..
వర్మ సెక్సీ హీరోయిన్ Apsara Rani Hot Stills వైరల్