Alia Bhatt Ram Mandir: ఆలియా భట్‌ చీర కొంగులో 'రామాయణం'.. చీర విశేషాలు ఏమిటో తెలుసా..?

Alia Bhatt Ramayan Saree: అయోధ్య రామమందిరంలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా దేశ, విదేశాల నుంచి వివిధ రంగాల ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వారిలో బాలీవుడ్‌ ఆలియా భట్‌, రణ్‌బీర్‌ దంపతులు కూడా ఉన్నారు. అయితే ఈ వేడుకలో ఆమె ధరించిన చీర అందరినీ ఆకట్టుకుంటోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 22, 2024, 05:12 PM IST
Alia Bhatt Ram Mandir: ఆలియా భట్‌ చీర కొంగులో 'రామాయణం'.. చీర విశేషాలు ఏమిటో తెలుసా..?

Alia Bhatt Ramayan Saree: అయోధ్య బాల రాముడి ప్రాణ ప్రతిష్ట కోసం దేశంలోని ప్రముఖులకు శ్రీరామ జన్మభూమి క్షేత్ర ట్రస్ట్‌ ఆహ్వానాలు పంపించింది. వీరిలో సినీ రంగానికి చెందినవారికి కూడా ఆహ్వానం పంపించింది. అయితే ఈ ఆహ్వానాన్ని స్వీకరించిన ప్రముఖులు సోమవారం అయోధ్యలో జరిగిన వేడుకకు హాజరయ్యారు. హాజరైన వారిలో బాలీవుడ్ జంట ఆలియా భట్, రణ్‌బీర్ కపూర్ కూడా ఉంది. భర్తతో కలిసి ఆలియా భట్‌ ఆలయానికి వచ్చారు. ఆలయంలో ఆమె ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా ఆమె ధరించిన చీర ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ఆమె చీరపై సోషల్‌ మీడియాలో చర్చ జరుగుతోంది.

ఆలియా చీరపై రామాయణం:

అయోధ్య కార్యక్రమానికి ఆలియా భట్‌, రణ్‌బీర్‌ కపూర్‌ దంపతులు ప్రత్యేక విమానంలో వచ్చారు. ప్రాణ ప్రతిష్ట అనంతరం రాముడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ప్రతిష్టాత్మక అయోధ్య కార్యక్రమానికి హాజరైన సందర్భంగా ఆలియా భట్‌ తన వస్త్రధారణలో కూడా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ సందర్భంగా రామాయణం ఇతివృతం ఆధారంగా ఆమె చీర ఉందని తెలుస్తోంది. దీంతో ఫొటోగ్రాఫర్లు ఆమె చీరపైనే కెమెరాలు ఉంచారు. ఆమె ధరించిన చీర కొంగుపై రామాయణాన్ని వివరించే అంశాలు ఉన్నాయి. దీంతో ఆ చీర ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

సంప్రదాయ వస్త్రధారణలో మెరిసిన తార:

సింపుల్ నీలి రంగు చీరలో ఆలియా మెరిశారు. అయితే చీర కొంగు అంచుపై రామాయణాన్ని కళ్లకు కట్టే చిత్రాలు, అక్షరాలు ఉన్నాయి. అంతేకాదు దానిపై రామసేతు, హనుమాన్ చిత్రాలు కూడా ఉన్నట్లు కొందరు గుర్తించారు. ఆలియా ఏ కార్యక్రమానికి వెళ్లినా తన వస్త్రధారణలో ప్రత్యేకత చాటుతారు. ఈ క్రమంలోనే అయోధ్య పర్యటనలో కూడా ప్రత్యేక శ్రద్ధతో చీరను రూపొందించుకున్నారని ఫ్యాషన్‌ప్రియులు చెబుతున్నారు. కాగా రామాయణంతో ఆలియాకు కొంత అనుబంధం ఉంది. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలో ఆలియా భట్‌ నటించారు. అందులో ఆమె పాత్ర పేరు సీత అని ఉండడం విశేషం. కాగా, రామాయణం ఇతివృత్తంతో కూడిన చీరను ధరించిన ఆలియా భట్‌పై సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Also Read: Ramam Raghavam: "రామం రాఘవం" ఫస్ట్ లుక్ విడుదల… ధనరాజ్ నటిస్తూ దర్శకత్వం లో రానున్న సముద్రఖని

ఇక కొందరైతే ఆలియా ధరించిన చీర ఎక్కడ లభిస్తుందోనని ఆన్‌లైన్‌లో వెతకడం ప్రారంభించారు. కాగా, గతేడాది 'హార్ట్‌ ఆఫ్‌ స్టోన్‌' అనే సినిమాతో హాలీవుడ్‌లో అరంగేట్రం చేశారు. అంతేకాకుండా సంజయ్ లీలా భన్సాలీతో 'బైజూ బావ్రా', 'జీ లే జరా'లాంటి సినిమాలు చేస్తోంది. మరోవైపు ఆలియా భర్త రణ్‌బీర్‌ కపూర్‌ 'యానిమల్‌' సినిమా సక్సెస్‌ను ఎంజాయ్‌ చేస్తున్నాడు. నితేష్‌ తివారీ తీస్తున్న ' రామాయణం' మూవీలో రణ్‌బీర్‌ రాముడి పాత్రను పోషిస్తుండడం గమనార్హం. ఈ సినిమాలో సీతగా సాయి పల్లవి నటిస్తోందని తెలిసిందే.

అయోధ్యలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు బాలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులతోపాటు పలువురు మాజీ క్రికెటర్లు కూడా హాజరయ్యారు. టాలీవుడ్ నుంచి చిరంజీవి, రామ్ చరణ్, పవన్ కల్యాణ్ లాంటి వాళ్లు అయోధ్య హాజరయ్యారు.

Also Read: Keerthy Suresh: చిరునవ్వులు చిందిస్తున్న కీర్తి సురేష్.. అందానికి మురిసిపోతున్న అభిమానులు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News