Aishwarya Rai - Abhishek Bachchan: ఆ హీరోయిన్ వల్లే ఇద్దరి మధ్య విడాకులా..?

Aishwarya Rai - Abhishek Bachchan Divorce: అమితాబ్ బచ్చన్ కుటుంబానికి రేఖతో విభేదాలు ఉన్నాయని,  అలాంటి రేఖతో అంబానీ ఇంట పెళ్లిలో ఐశ్వర్యారాయ్ మాట్లాడేసరికి అభిషేక్ - ఐశ్వర్య మధ్య విడాకులు ఖాయమయ్యాయి అంటూ నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు.

Written by - Vishnupriya | Last Updated : Jul 21, 2024, 12:52 PM IST
Aishwarya Rai - Abhishek Bachchan: ఆ హీరోయిన్ వల్లే ఇద్దరి మధ్య విడాకులా..?

Aishwarya Rai - Abhishek Bachchan: బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో క్యూట్ జోడీగా గుర్తింపు తెచ్చుకున్న జంటలలో ఐశ్వర్యరాయ్ - అభిషేక్ బచ్చన్ కూడా ఒకరు. ఎవరికివారు.. కెరియర్ పరంగా వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉండగా..  ఇలాంటి వీరి మధ్య గత కొన్ని సంవత్సరాల నుంచి విడాకుల రూమర్స్ సంచలనం సృష్టిస్తున్నాయి. ఎక్కడికి వెళ్ళినా ఐశ్వర్యారాయ్ తన కూతురు ఆరాధ్యతో మాత్రమే కలిసి వెళ్తోందని , అభిషేక్ బచ్చన్ ఎక్కడ కూడా వీరితో కలిసి కనిపించడం లేదని, ఇక నిజంగానే వీరిద్దరు విడాకులు తీసుకోబోతున్నారేమో అంటూ వార్తలు తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. 

Add Zee News as a Preferred Source

మరోవైపు ఈమధ్య గ్రే డివోర్స్ ఇంస్టాగ్రామ్ పోస్ట్ కు.. కి అభిషేక్ బచ్చన్ లైక్ చేయడంతో విడాకులు తీసుకుంటున్నారు అనే వార్తలకు ఆజ్యం పోసింది. పైగా అనంత్ అంబానీ - రాధిక మర్చంట్ వివాహ వేడుకలలో బాలీవుడ్ స్టార్స్ అందరూ జంటలుగా వచ్చి ఫోటోలు దిగుతుంటే.. ఐశ్వర్య మాత్రం తన భర్తను దూరం పెట్టి తన కూతురు ఆరాధ్యతో.. మాత్రమే ఫోటోలకు ఫోజులిచ్చింది. దీంతో ఇక్కడ కూడా భర్తను దూరం పెట్టేసింది అనే వార్తలు వినిపించాయి. దీనికి తోడు అంబానీ పెళ్లిలో జరిగిన ఒక సంఘటన ఈ విడాకుల రూమర్స్ కు మరింత ఆజ్యం పోసిందని చెప్పవచ్చు.

ప్రముఖ సీనియర్ హీరోయిన్ రేఖ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అద్భుతమైన నటనతో,  గ్లామర్ తో ఇప్పటికీ యువతను ఆకట్టుకుంటూనే ఉంటుంది. పైగా గతంలో ఈమె.. అమితాబ్ బచ్చన్ తో ఎఫైర్ పెట్టుకున్న విషయం తెలిసిందే.ఇద్దరూ వివాహం చేసుకుంటారని అందరూ అనుకున్నారు. కానీ మధ్యలోకి జయా బచ్చన్.. రావడంతో వీరిద్దరూ విడిపోయారు. అప్పటినుంచి అటు అమితాబ్ ఫ్యామిలీకి రేఖ అన్న, రేఖకు అమితాబ్ ఫ్యామిలీ అన్నా అసలు గిట్టేది కాదు.. అలాంటి రేఖతో ఇప్పుడు అంబానీ ఇంట పెళ్లిలో ఐశ్వర్యరాయ్ మాట్లాడడంతో.. ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్ విడాకుల రూమర్స్ మరింత బలపడ్డాయి. అమితాబ్ బచ్చన్ కుటుంబానికి రేఖ అంటే అసలు పడదు.. ఇప్పుడు ఐశ్వర్య కి కూడా ఆ కుటుంబంతో విభేదాలు వచ్చాయేమో.. అందుకే అమితాబ్ బచ్చన్ కుటుంబాన్ని కాదని రేఖతో మాట్లాడింది. నిజంగానే అభిషేక్ బచ్చన్ తో  ఈమె విడిపోతుందేమో అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.. మరి నిజానిజాలు తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే

Also Readఆ తరంలో NTR, కృష్ణంరాజు.. ఈ జనరేషన్ లో రాజశేఖర్, ప్రభాస్ లకే ఆ క్రెడిట్ దక్కింది..

Also Read: ‘కల్కి ’ సినిమాలో నాగ్ అశ్విన్ చేసిన ఈ బ్లండర్ మిస్టేక్ ను గుర్తించారా..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

About the Author

Vishnupriya

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.

...Read More

Trending News