చిన్నారి ధైర్యానికి ఆశ్చర్యపోయిన అమితాబ్..!

బాలీవుడ్‌ సూపర్ స్టార్ అమితాబ్‌ బచ్చన్‌‌కు ఉన్నా ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. 

Last Updated : Mar 6, 2018, 04:43 PM IST
చిన్నారి ధైర్యానికి ఆశ్చర్యపోయిన అమితాబ్..!

బాలీవుడ్‌ సూపర్ స్టార్ అమితాబ్‌ బచ్చన్‌‌కు ఉన్నా ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ప్రతి ఆదివారం ఆయనను చూడడానికి అనేకమంది ఫ్యాన్స్ వేరు వేరు ప్రాంతాల నుండి వస్తుంటారు.  అలా వచ్చే ఫ్యాన్స్‌‌ను అమితాబ్ ఇంటి లోపల నుండే పలకరిస్తారు. అక్కడి నుండే మైక్ ద్వారా వారి ప్రశ్నలకు బదులిస్తూ ఉంటారు. అప్పుడప్పుడు ఫోటోలు, ఆటోగ్రాఫులు కూడా ఇస్తుంటారు. ఇటీవలి కాలంలో అలాగే అమితాబ్‌ను కలవడానికి ఆయన ఫ్యాన్స్ తన ఇంటికి చేరుకోగా.. ఆ గుంపులో నుండి ఓ చిన్నారి ధైర్యంగా అమితాబ్ ఇంటి గేట్ దాటి లోపలికి వచ్చేసింది. ఆమె ధైర్యానికి ఆశ్చర్యపోయిన అమితాబ్ ఆ పాపను ముద్దు చేశారు. ఆమెతో కలిసి ఫోటోలు దిగి ట్విట్టర్‌లో పోస్టు చేశారు కూడా. ప్రస్తుతం అమితాబ్ థగ్స్‌ ఆఫ్‌ హిందుస్థాన్‌, బ్రహ్మాస్త్రా, 102 నాటౌట్ మొదలైన సినిమాల్లో నటిస్తు్న్నారు.

Trending News