BB3 heroines: బాలయ్య బాబు కోసం ఇద్దరు హీరోయిన్స్ ఫైనల్

Two heroines for BB3: నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో మరో సినిమా తెరకెక్కనుంది. సింహ, లెజెండ్ సినిమాలతో హిట్ అందుకున్న ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ఇప్పుడు హ్యాట్రిక్ కోసం మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నారు. సినీవర్గాల్లో టాక్ వినిపించినట్టుగానే ఈ చిత్రంలో బాలకృష్ణ ( Balakrishna ) సరసన ఇద్దరు హీరోయిన్స్ కనిపించనున్నారు.

Last Updated : Nov 5, 2020, 01:17 AM IST
BB3 heroines: బాలయ్య బాబు కోసం ఇద్దరు హీరోయిన్స్ ఫైనల్

Two heroines for BB3: నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో మరో సినిమా తెరకెక్కనుంది. సింహ, లెజెండ్ సినిమాలతో హిట్ అందుకున్న ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ఇప్పుడు హ్యాట్రిక్ కోసం మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నారు. సినీవర్గాల్లో టాక్ వినిపించినట్టుగానే ఈ చిత్రంలో బాలకృష్ణ ( Balakrishna ) సరసన ఇద్దరు హీరోయిన్స్ కనిపించనున్నారు. తాత్కాలికంగా 'బిబి 3' అని పిలుచుకుంటున్న ఈ సినిమాను మిరియాల రవీందర్ రెడ్డి ( Miriyala Ravinder Reddy ) నిర్మిస్తున్నారు. బాలయ్య బాబు బర్త్ డే కానుకగా విడుదల చేసిన ఈ సినిమా టీజర్‌కి సైతం అభిమానుల నుంచి భారీ స్పందన కనిపించింది. Also read : Niharika's wedding venue: ఉదయ్‌పూర్‌లో నిహారిక పెళ్లి.. తేదీ, వేదిక ఫిక్స్ !

 

ఈ సినిమాలో బాలకృష్ణ సరసన నటించడానికి పలువురు హీరోయిన్స్‌తో పాటు కొత్త వారితో కూడా చాలా చర్చలు జరిపిన బోయపాటి శ్రీను చివరికి పూర్ణ ( Actress Poorna ), ప్రయాగ మార్టిన్‌ ( Actress Prayaga Martin )లను హీరోయిన్లుగా ఎంపిక చేసుకున్నారు.

పూర్ణ అకా షామ్నా ఖాసిమ్‌కు పరిచయం అవసరం లేదు. 'సీమ టపాకాయ్', అవును, అవును 2, సిల్లీ ఫెలోస్ వంటి చిత్రాల్లో నటించింది. అంతే కాకుండా ప్రస్తుతం పూర్ణ టెలివిజన్ షో అయిన ఢీ షోలో జడ్జిగా కూడా వ్యవహరిస్తోంది. పూర్ణకి టాలీవుడ్‌లో బాలయ్య లాంటి అగ్ర హీరోల సరసన నటించే అవకాశం రావడం ఇదే మొదటిది అని చెప్పొచ్చు. 

Also read : Pawan Kalyan's new look: పవన్ కల్యాణ్ న్యూ లుక్ చూశారా ?

పిసాసు అనే తమిళ చిత్రంతో పేరుతెచ్చుకున్న మలయాళ నటి ప్రయాగ మార్టిన్ ఈ సినిమాలో ఐఏఎస్ ఆఫీసర్ పాత్రలో నటించనుంది అని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. సింహ, లెజెండ్ చిత్రాల్లో బాలయ్యను ఎంతో పవర్‌ఫుల్ క్యారెక్టర్స్‌లో చూపించిన దర్శకుడి చిత్రం కావడంతో BB3పై సైతం బాలయ్య బాబు అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

Also read : Jr Ntr on video call: వీడియో కాల్ చేసిన ఎన్టీఆర్‌ని అభిమాని ఏం అడిగాడో తెలుసా ?

Trending News