'పద్మావతి'కి సెన్సార్ బోర్డ్ గ్రీన్ సిగ్నల్.. కండిషన్స్ అప్లై!

ఇటీవల కాలంలో విడుదల కాకుండానే వివాదాలకి కేంద్రబిందువైన చిత్రాల్లో బాలీవుడ్ సినిమా 'పద్మావతి' ఒకటి. ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ఈ సినిమా

Last Updated : Dec 31, 2017, 11:35 AM IST
'పద్మావతి'కి సెన్సార్ బోర్డ్ గ్రీన్ సిగ్నల్.. కండిషన్స్ అప్లై!

ఇటీవల కాలంలో విడుదల కాకుండానే వివాదాలకి కేంద్రబిందువైన చిత్రాల్లో బాలీవుడ్ సినిమా 'పద్మావతి' ఒకటి. ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ఈ సినిమా తమ మనోభావాలని కించపర్చే విధంగా వుందంటూ రాజస్థాన్‌లోని రాజ్‌పుత్ వర్గాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశాయి. కర్ణిసేన నేతలు ఈ చిత్రం విడుదల కాకుండా అడ్డుకుంటామని ప్రకటించగా కొంతమంది బీజేపీ నేతలు సైతం దీనికి వంతపాడారు. 

అంతటితో ఆగని నిరసనలు ఆ సినిమాలో టైటిల్ రోల్ పోషించిన దీపికా పదుకునేతోపాటు దర్శకుడు భన్సాలీపై దాడులకి పాల్పడతామని హెచ్చరించే వరకు వెళ్లాయి. ఈ వరుస వివాదాల నేపథ్యంలో డిసెంబర్ 1వ తేదీనే విడుదల కావాల్సి వున్న ఈ సినిమాకు సెన్సార్ నుంచి క్లియరెన్స్ లభించడంలో ఆలస్యమైంది. 

ఇదిలావుంటే, తాజాగా ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన  సెన్సార్ బోర్డ్.. సినిమాకు U/A సర్టిఫికెట్ మంజూరు చేసింది. అయితే, సినిమాను 'పద్మావతి' అనే టైటిల్‌తో కాకుండా 'పద్మావత్' టైటిల్‌తో రిలీజ్ చేయాలని ఆ సినిమా నిర్మాతలకి స్పష్టంచేసింది. అంతేకాకుండా సినిమా పేర్లలో పలు వివరణలతో కూడిన బోర్డులు ప్రదర్శించడంతోపాటు 'ఘూమర్' అనే పాటలోనూ పలు మార్పులు చేయాల్సిందిగా సీబీఎఫ్‌సీ పద్మావతి చిత్ర నిర్మాతలకి సూచించింది. ఈ సినిమాలో మహారావల్ రతన్ సింగ్ అనే రాజ్‌పుత్ యోధుని పాత్రను షాహీద్ కపూర్ పోషించగా అల్లా ఉద్దీన్ ఖిల్జీ అనే విలన్ పాత్రలో రణ్‌వీర్ సింగ్ నటించాడు. 

Trending News