Chandini Chowdary Photoshoot : కిల్లింగ్ లుక్స్..పిచ్చెక్కించేలా చాందినీ చౌదరి అందాలు.. పిక్స్ వైరల్

Chandini Chowdary Latest Photoshoot చాందినీ చౌదరి ప్రస్తుతం తన అందాలను ఆరబోస్తోంది. మోడ్రన్ లుక్కులో కనిపించిడంతో అంతా ఫిదా అవుతున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 16, 2022, 02:26 PM IST
  • నెట్టింట్లో చాందినీ చౌదరి సందడి
  • అందాల ఆరబోతతో కలర్ ఫోటో హీరోయిన్ హల్చల్
  • మోడ్రన్ లుక్కులో అదరగొట్టేసిన చాందినీ
Chandini Chowdary Photoshoot : కిల్లింగ్ లుక్స్..పిచ్చెక్కించేలా చాందినీ చౌదరి అందాలు.. పిక్స్ వైరల్

Chandini Chowdary Latest Photoshoot : చాందినీ చౌదరి తెలుగమ్మాయి అనే సంగతి అందరికీ తెలిసిందే. షార్ట్ ఫిల్మ్స్‌తో చాందినీ చౌదరి మంచి క్రేజ్ దక్కించుకుంది. మధురం అనే షార్ట్ ఫిల్మ్ అందరినీ ఆకట్టుకుంది. అందులో ఆమె అందాలకు అందరూ ఫిదా అయ్యారు. ఆ తరువాత మెల్లిమెల్లిగా చాందినీకి సినిమా అవకాశాలు రావడం ప్రారంభించాయి. అయితే ఆమెకు మాత్రం స్టార్ హీరోల సినిమాల్లో చాన్స్ రాలేదు. ఆమె ఖాతాలో ఓ బ్లాక్ బస్టర్ హిట్ పడలేదు.

కుందనపు బొమ్మ అనే సినిమాలో చాందినీ చౌదరి హీరోయిన్‌గా నటించింది.కానీ ఆ సినిమా అంతగా ఆడలేదు. మహేష్‌ బాబు హీరోగా వచ్చిన బ్రహ్మోత్సవం సినిమాలో చాందనీ చౌదరి ఓ ముఖ్య పాత్రలో కనిపించింది. కానీ అంతగా గుర్తింపు అయితే రాలేదు.

ఆ తరువాత బ్రహ్మానందం కొడుకు గౌతమ్ హీరోగా వచ్చిన ఓ చిత్రంలో చాందినీ నటించింది. అదొక ప్రయోగంగా మాత్రమే మిగిలింది. చాందినికీ అయితే గుర్తింపు రాలేదు. ఆమె ఖాతాలో మొదటి హిట్టుగా కలర్ ఫోటో సినిమా నిలిచింది. జాతీయ స్థాయిలో అవార్డులు రావడంతో కలర్ ఫోటో హీరోయిన్‌గా చాందినీకి మంచి క్రేజ్ వచ్చింది.

సమ్మతమే అనే సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది చాందినీ చౌదరి. కిరణ్ అబ్బవరం హీరోగా వచ్చిన ఈ చిత్రంలో చాందినీ నటించింది. ఇందులో చాందినీ లుక్స్, నటనకు జనాల పడిపోయారు. కానీ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది.

చాందినీ చౌదరికి తన కెరీర్ ప్రారంబంలో ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయట. ఓ ప్రొడ్యూసర్ రెండేళ్ల పాటుగా తన డేట్స్ అన్నీ లాక్ చేసి పెట్టుకున్నాడట. కానీ ఒక్క సినిమాలో ఆఫర్ కూడా ఇవ్వలేదని వాపోయింది. అలా రెండేళ్లు తన జీవితంలో వృథా అయిందంటూ ఎమోషనల్ అయింది.

చాందినీ చౌదరి ఎక్కువగా అందాల ఆరబోతకు సై అనదు. పద్దతిగానే ఉండేందుకు ప్రయత్నిస్తుంటుంది. ఆమె నిండైన వస్త్రధారణలో కనిపించే ఫోటోలే ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. తాజాగా ఆమె మోడ్రన్ లుక్కులో కనిపించిన తీరుకు అందరూ ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.

Also Read : Balakrishna - Rashmika : బాలయ్యను పడగొట్టేసిన రష్మిక మందన

Also Read : Theatres Seating Capacity : హైద్రాబాద్‌లోనే హయ్యస్ట్ సీటింగ్ కెపాసిటీ.. లిస్ట్ ఇదే

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News