Che: సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న చేగువేరా బయోపిక్ “చే”

Che Guevara: ప్రస్తుతం బయోపిక్ల ట్రెండ్ బాగా నడుస్తోంది. ముఖ్యంగా గత కొద్ది సంవత్సరాల క్రితం విడుదలైన మహానటి సినిమా దగ్గర నుంచి ప్రేక్షకులు బయోపిక్స్ కోసం మరింత ఆత్రుతగా ఎదురు చూడటం మొదలుపెట్టారు. ఇక ఇప్పుడు చేగువేరా బయోపిక్ తో చే అనే సినిమా వస్తోంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 18, 2023, 03:25 PM IST
Che: సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న చేగువేరా బయోపిక్ “చే”

Che Guevara biopic: క్యూబా పోరాటయోధుడు చేగువేరా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన పేరు చాలామంది విన్నా కానీ ఆయన గురించి పూర్తిగా తెలిసినవారు మాత్రం చాలా తక్కువ మంది. కాగా ఇప్పుడు ఆయన గురించి అందరికీ మరిన్ని వివరాలు తెలియజేయడం కోసం చేగువేరా జీవిత చరిత్ర ఆధారంగా తెలుగులో రూపొందుతున్న మూవీ “చే”. లాంగ్ లైవ్ అనేది ట్యాగ్ లైన్. నవ ఉదయం సమర్పణలో నేచర్ ఆర్ట్స్ బ్యానర్‌పై బీఆర్ సభావత్ నాయక్ టైటిల్ రోల్ పోషిస్తూ, దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది..ఈ చిత్రాన్ని వీక్షించిన సెన్సార్ సభ్యులు యు/ ఎ సర్టిఫికెట్ జారీ చేశారు.. .  

కాగా చేగువేరా పైన ఇంతకుముందు కూడా ఒక బయోపిక్ వచ్చింది. ఆ సినిమా పేరే క్యూబా. ఇక క్యూబా తరువాత ప్రపంచంలోనే తొలిసారి భారతీయ చిత్ర పరిశ్రమలో రూపొందుతున్న చేగువేరా బయోపిక్ ఇది. సూర్య, బాబు, దేవేంద్ర సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీలో లావణ్య సమీరా,పూల సిద్దేశ్వర్, కార్తీక్ నూనె, వినోద్, పసల ఉమా మహేశ్వర్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. రవిశంకర్ సంగీతం అందిస్తున్నారు. 

ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సినిమా దర్శకుడు బి.ఆర్ సభావత్ నాయక్ మాట్లాడుతూ.. చేగువేరా బ‌యోపిక్ తీయాల‌న్న‌ది త‌న ఇర‌వై ఏళ్ల క‌ల అని అన్నారు. ఈ సినిమాలో ఆయన గురించి ఎన్నో అరుదైన విష‌యాలు త‌మ సినిమాలో చూపించిన‌ట్టు తెలిపారు. ‘తాజాగా  మా సినిమా ను వీక్షించిన సెన్సార్ సభ్యులు యు/ ఎ సర్టిఫికెట్ జారీ చేశారు. డిసెంబ‌ర్ ఫ‌స్ట్ వీక్‌ థియేట‌ర్‌ల‌లో గ్రాండ్‌గా విడుద‌ల చేస్తున్నాం’ అని తెలిపారు.

మరి మహానటి సంజు లాంటి బయోపిక్ లు సూపర్ హిట్ అయిన తరువాత ఇప్పుడు వస్తున్న ఈ చేగువేరా బయోపిక్ మన ప్రేక్షకులను ఎలా ఆకట్టుకొని ఎంతలా చేరువవుతుందో చూడాలి.

Also Read: Sumanth: విశాఖ శారదాపీఠాన్ని సందర్శించిన హీరో సుమంత్.. కొత్త సినిమా నామకరణం

Also Read: Infinix Zero Ultra Price: 200MP కెమెరా Infinix Zero Ultra మొబైల్ కేవలం రూ. 8,599కే పొందండి..మళ్లీ మళ్లీ రాని డీల్!  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

Trending News