Chiranjeevi Bholaa Shankar: పవన్ ఫ్యాన్ గా చిరు.. ఇదేదో మాములుగా లేదే!

Chiranjeevi as Powerstar Pawan kalyan Fan: భోలా శంకర్ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది.  

Written by - Chaganti Bhargav | Last Updated : Feb 20, 2023, 08:22 PM IST
Chiranjeevi Bholaa Shankar: పవన్ ఫ్యాన్ గా చిరు.. ఇదేదో మాములుగా లేదే!

Chiranjeevi as Powerstar Pawan kalyan Fan In Bholaa Shankar: మెగాస్టార్ చిరంజీవి చివరిగా వాల్తేరు వీరయ్య అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అందుకున్నాడు. సంక్రాంతి సందర్భంగా జనవరి 12వ తేదీ విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడమే కాదు కలెక్షన్ల వర్షం కురిపించి మెగాస్టార్ కెరియర్ లో ఒక భారీ బ్లాక్ బస్టర్ సినిమాగా నిలిచింది. ఇక ఈ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి భోలా శంకర్ సినిమాతో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాడు.

అయితే ఈ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన ప్రచారం అయితే జరుగుతోంది. అదేమిటంటే ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. అంతేగాక ఈ సినిమా కోసం సినిమా యూనిట్ ఒక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ సాంగ్ ని కూడా రీమిక్స్ చేయబోతున్నట్లుగా చెబుతున్నారు. వాస్తవానికి ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్గా నిలిచిన వేదలమ్ అనే సినిమాకి రీమేక్.

అజిత్ హీరోగా నటించిన సదరు సినిమాని ఇప్పుడు తెలుగులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా రీమేక్ చేస్తున్నారు. తమన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ మెగాస్టార్ చిరంజీవి సోదరి పాత్రలో నటిస్తోంది. అయితే రీమేక్ కథకు కొత్త టచ్ ఇచ్చేందుకే ఇలా పవన్ కళ్యాణ్ అభిమానిగా మెగాస్టార్ చిరంజీవిని చూపించబోతున్నానని టాక్ వినిపిస్తోంది. ఏకే  ఎంటర్టైన్మెంట్స్ మేనేజర్ మీద భారీ ఎత్తున ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

షాడో సినిమా తర్వాత చాలా రోజుల పాటు సినీ పరిశ్రమకు దూరమైపోయిన మెహర్ రమేష్ ఈ సినిమాతో మరోసారి దర్శకుడిగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మెహర్ రమేష్ విషయంలో మెగా అభిమానులకు కొంత టెన్షన్ ఉన్నా వాల్తేరు వీరయ్య హిట్టుతో మాత్రం వారు జోష్ లోనే ఉన్నారు. ఆ రేంజ్ లో ఉన్నా సినిమా సూపర్ హిట్ అయిపోతుంది అని వారంతా నమ్ముతున్నారు. మరి చూడాలి పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ ఈ సినిమాకి ప్లస్ అవుతుందో లేక మైనస్ అవుతుందో.

Also Read: Raveena Tandon Photos: ముదురు వయసులో రవీనా హాట్ ట్రీట్.. జాకెట్ కూడా లేకుండా!

Also Read: Taraka Ratna Death: తారక రత్న మోకిల నివాసానికి రాని తల్లితండ్రులు, ఫిలిం ఛాంబర్ కు ఎందుకు వచ్చారంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

 
 

Trending News