Chiranjeevi Counter : ఆపవయ్యా మీ నాన్న సుత్తి.. బాలకృష్ణకు చిరంజీవి పరోక్ష కౌంటర్?

Chiranjeevi Indirect Counter: మాట్లాడితే మా నాన్నగారు మా నాన్నగారు అని నేను, పది సార్లు చెప్పుకొని చరణ్ బాబు మా నాన్నగారు మా నాన్న చిరంజీవి  ఎంతో గొప్ప వాళ్ళు అని చెప్పుకుంటే వినే వాళ్ళకి బోర్ కొడుతుందని అంటూ కామెంట్లు చేశారు చిరంజీవి. ఆ వివరాలు  

Written by - Chaganti Bhargav | Last Updated : Jan 11, 2023, 11:47 PM IST
Chiranjeevi Counter : ఆపవయ్యా మీ నాన్న సుత్తి.. బాలకృష్ణకు చిరంజీవి పరోక్ష కౌంటర్?

Chiranjeevi Indirect Counter to Balakrishna : చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య సినిమా విడుదలకు సిద్ధమైంది. జనవరి 13వ తేదీ అంటే మరికొద్ది గంటల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రేక్షకుల ముందు రాబోతోంది. అయితే ఈ నేపద్యంలోనే సినిమాను పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తున్నారు మెగాస్టార్ సహా సినిమా యూనిట్ అంతా. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా నిర్వహించగా ప్రస్తుతం చిరంజీవి అనేక మీడియా ఛానళ్లకు ఇంటర్వ్యూ ఇస్తున్నారు.

అయితే తాజాగా చిరంజీవి చేసిన కొన్ని కామెంట్లు పరోక్షంగా బాలకృష్ణను ఎద్దేవా చేసినట్లుగా ఉన్నాయనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అసలు విషయం ఏమిటంటే తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతున్న సమయంలో అల్లు అర్జున్, రామ్ చరణ్ ల ప్రస్తావన వచ్చింది. ఈ మధ్యకాలంలో అల్లు అర్జున్ ఎందుకో మెగాస్టార్ అయిన మీ పేరు గురించి గానీ మెగా ఫ్యామిలీ గురించి గానీ మాట్లాడడం లేదని, చరణ్ కూడా ఎక్కువగా మీ ప్రస్తావన తేవడం లేదని ఇంటర్వ్యూ చేస్తున్న యాంకర్ అంటే దానికి మెగాస్టార్ స్పందించారు. 

 ప్రతి చోట నా ప్రస్తావన తేవాల్సిన అవసరం లేదని అన్నారు. మాట్లాడితే మా నాన్నగారు మా నాన్నగారు అని నేను, పది సార్లు చెప్పుకొని చరణ్ బాబు మా నాన్నగారు మా నాన్న చిరంజీవి అదని ఇదని, మా నాన్న ఎంతో గొప్ప వాళ్ళు అని చెప్పుకుంటే వినే వాళ్ళకి బోర్ కొడుతుంది ఎహే ఆపవయ్య మీ నాన్న మీ నాన్న అని మీ నాన్న సుత్తి వేస్తావు అని చరణ్ ని తిడతారు అంటూ ఆయన కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు. ఈ వ్యాఖ్యలు బాలకృష్ణను ఉద్దేశించి మాట్లాడినవే అంటూ పలు కామెంట్లు వినిపిస్తున్నాయి.

అంతేకాక వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్లో సైతం మెగాస్టార్ చిరంజీవి శృతిహాసన్ రాకపోవడానికి గల కారణాలు ఏమిటో ఒంగోలులో ఏం జరిగిందో తెలియదు? ఆమెను ఎవరైనా బెదిరించారేమో అంటూ సెటైర్లు వేయడం కూడా ఇప్పుడు వారిద్దరి మధ్య సఖ్యత లేదేమో అనే కామెంట్లకు ఊతమిస్తున్నాయి. అయితే వీరసింహారెడ్డి ఇప్పుడు వాల్తేరు వేరే సినిమాకి పోటాపోటీగా రిలీజ్ అవుతున్న సమయంలో అదే హీరోని పరోక్షంగా ప్రస్తావిస్తూ చిరంజీవి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ అంశం మీద మీ ఉద్దేశం ఏంటో కామెంట్ చేయండి. 

Also Read: Chiranjeevi on Allu Arjun: అల్లు అర్జున్ మెగా టాగ్ మీద చిరు కామెంట్స్.. అవసరమే లేదంటూ!

Also Read: Chiranjeevi Vs Balakrishna: 9 సార్లు సంక్రాంతికి బాలయ్య-చిరు పోటీ.. ఎవరెన్ని హిట్లు కొట్టారంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News