Chiranjeevi: దివ్యాంగ అభిమాని సాహసం.. చిరంజీవి కోసం సుమారు 726 కిలోమీటర్లు నడిచి..

మెగాస్టార్ చిరంజీవిపై తన అభిమానాన్ని చాటుకున్నాడు ఓ దివ్యాంగుడు. సుమారు 726 కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేసి హైదరాబాద్‌కు వచ్చి  మెగాస్టార్ చిరంజీవిని కలిశాడు.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 26, 2021, 09:19 PM IST
Chiranjeevi: దివ్యాంగ అభిమాని సాహసం.. చిరంజీవి కోసం సుమారు 726 కిలోమీటర్లు నడిచి..

Megastar Chiranjeevi: తమ అభిమాన నటీనటుల కోసం పాదయాత్రలు చేయడం ఈ మధ్య సర్వసాధారణం అయిపోయింది. తమకు నచ్చిన హీరోని ఒక్కసారైనా ప్రత్యక్షంగా కలవాలనుకుంటారు. అందుకోసం ఎంతటి రిస్క్ అయిన చేయడానికి సిద్దపడుతున్నారు. తాజాగా ఓ దివ్యాంగ అభిమాని సుమారు 726 కిలోమీటర్ల దూరం పాదయాత్ర(padayatra) చేసి హైదరాబాద్‌కు వచ్చి  మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi)ని కలిశాడు.

వివరాల్లోకి వెళితే.. 
తూర్పు గోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలం కిత్తనచెరువుకు చెందిన డెక్కల గంగాధర్‌ చిరంజీవికి పెద్ద అభిమాని. మెగాస్టార్ చిరంజీవి నటించిన 'మాస్టర్‌'(Master Movie) సినిమా విడుదలై 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పాదయాత్ర చేయాలనుకున్నాడు. అక్టోబర్ 3వ  అమలాపురం నుంచి పాదయాత్రను ప్రారంభించి, 23 రోజులు 726 కి. మీ నడిచి సోమవారం చిరంజీవి బ్లడ్ బ్యాంక్(Chiranjeevi Blood Bank) దగ్గరకి చేరుకున్నాడు.

Also Read: chiranjeevi: మెగాస్టార్ పెద్ద మనసు..అభిమాని కోసం ఫ్లైట్ టికెట్స్ పంపి మరీ....

ఈ వార్త తెలిసి చలించిపోయిన చిరంజీవి.. గంగాధర్‌(Gangadhar)ని ఇంటికి పిలిపించుకొని ముచ్చటించారు. అనంతరం గంగాధర్ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. అతని కుటుంబ నేపథ్యం, ఇతర విషయాలు అడిగి తెలుసుకున్న చిరంజీవి ఇలాంటి సాహసాలు మళ్లీ చేయవద్దని సున్నితంగా హెచ్చరించారు. అయితే తమ అభిమాన హీరోను చూస్తే చాలనుకున్న గంగాధర్ చిరంజీవి ఆతిధ్యానికి పులకించిపోయారు. చిరును కలవడంతో గంగాధర్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. తాను జీవితాంతం రుణపడి ఉంటాను అని ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

 

Trending News