Kiladi Kurrollu: స్టార్ కమెడియన్ తనయుడు హీరోగా కొత్త సినిమా.. ‘కిలాడీ కుర్రోళ్ళు’ అంటూ సై..!

Comedian Goutham Raju: స్టార్ కమెడియన్ గౌతం రాజు తనయుడు కృష్ణ హీరోగా కొత్త సినిమా రాబోతుంది. కిలాడీ కుర్రోళ్ళు అంటూ అలరించేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ మూవీ.. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.  

Written by - Ashok Krindinti | Last Updated : Sep 24, 2024, 06:16 AM IST
Kiladi Kurrollu: స్టార్ కమెడియన్ తనయుడు హీరోగా కొత్త సినిమా.. ‘కిలాడీ కుర్రోళ్ళు’ అంటూ సై..!

Comedian Goutham Raju: ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్ నడుస్తోంది. కొత్త దర్శకులు, హీరోహీరోయిన్స్ సరికొత్త కంటెంట్‌తో ఆడియన్స్‌ను అలరిస్తున్నారు. కంటెంట్ ఉంటే మూవీ ఎక్కడ రిలీజ్ అయినా ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. దీంతో యంగ్ జనరేషన్ డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో ఆడియన్స్‌ను అలరించేందుకు వచ్చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కమెడియన్ గౌతం రాజు తనయుడు కృష్ణ మరోకొత్త మూవీతో ఎంట్రీ ఇవ్వనున్నాడు. కరోనా సమయంలో కృష్ణ హీరోగా తెరకెక్కిన మూవీ ఓటీటీలో సందడి చేసింది. కృష్ణారావు సూపర్ మార్కెట్ అంటూ ఓటీటీ ప్రేక్షకులు అలరించాడు. తొలి మూవీతో క్రేజీ హీరోగా పేరు తెచ్చుకున్నారు.

Also Read: Viral news: వామ్మో.. నిద్రపోయి ఏకంగా 9 లక్షలు గెల్చుకుంది.. స్టోరీ తెలిస్తే మాత్రం మైండ్ బ్లాక్ అయిపోద్ది..

ఇక త్వరలో ‘కిలాడీ కుర్రోళ్ళు’ అనే మూవీ వచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తయినట్లు సమాచారం. ఈ మూవీతోపాటు మరో నాలుగు సినిమాల్లో హీరోగా అలరించేందుకు కృష్ణ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇవేకాకుండా ఓ పెద్ద హీరో మూవీలో స్పెషల్ రోల్ పోషిస్తున్నట్లు టాక్. కిలాడి కుర్రోళ్ళు మూవీ సాంగ్స్ రిలీజ్ చేసి త్వరలోనే విడుదల తేదీని ప్రకటించేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. 

ఇక కమెడియన్ గౌతంరాజు 1984లో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. అక్కినేని నాగేశ్వరరావు  'వసంత గీతం'తో వెండితెరపైకి అడుగుపెట్టారు. తెలుగులో 300 కి పైగా చిత్రాలలో అనేక పాత్రలు పోషించారు. రెండు నంది అవార్డులు, రాజబాబు ప్రత్యేక గౌరవం అందుకున్నారు. అంతేకాకుండా ఎంతోమండి కమెడియన్లకు ఆయన అండగా నిలిచారు. సునీల్ వంటి అనేక మంది ఔత్సాహిక నటులకు సహాయం చేశారు. వందల సినిమాల్లో తన కామెడీ టైమింగ్‌తో ఆడియన్స్‌ను అలరించారు. ప్రస్తుతం ఇటు బుల్లితెరపై సీరియల్స్‌లో నటిస్తూ.. అటు వెండితెరపై సినిమాల్లో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.  

Also Read: Rhea singha: గుజరాత్ భామను వరించిన మిస్ యూనివర్స్ ఇండియా కిరీటం.. ఆమె గురించి ఈ విషయాలు తెలుసా..?  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News