Dhamki Collections: 'ధమ్కీ'కి దుమ్మురేపుతున్న కలెక్షన్స్..కేరేర్ బెస్ట్ ఖాయమే?

Das Ka Dhamki Box Office Collections: విశ్వక్సేన్ హీరోగా నటిస్తూనే దర్శకత్వం వహించిన తాజా చిత్రం దాస్ కా ధమ్కీ కలెక్షన్స్ మాత్రం ఒక రేంజ్ లో వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

Written by - Chaganti Bhargav | Last Updated : Mar 22, 2023, 10:13 PM IST
Dhamki Collections: 'ధమ్కీ'కి దుమ్మురేపుతున్న కలెక్షన్స్..కేరేర్ బెస్ట్ ఖాయమే?

Das Ka Dhamki Box Office Collection Day 1: విశ్వక్సేన్ హీరోగా నటిస్తూనే దర్శకత్వం వహించిన తాజా చిత్రం దాస్ కా ధమ్కీ. విశ్వక్సేన్ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో నివేదా పేతురాజ్, రావు రమేష్, అజయ్, హైపర్ ఆది, జబర్దస్త్ మహేష్ వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటించారు. పూర్తిస్థాయి యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా మార్చ్ 22వ తేదీన విడుదలైంది. ఇతర భాషల్లో మరికొద్ది రోజుల్లో విడుదల చేయబోతున్నారు. ఇక ఈ సినిమా విడుదలైన మొదటి రోజు నుంచి మిక్స్డ్ టాక్ తో దూసుకు వెళుతోంది.

సినిమా రొటీన్ గా ఉందని కొందరు అంటుంటే రొటీన్ గా ఉన్నా ఎంటర్టైన్ చేస్తోందని మరికొందరు అంటున్నారు. అయితే ఈ సినిమా కలెక్షన్స్ మాత్రం ఒక రేంజ్ లో వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇప్పటివరకు విశ్వక్సేన్ కెరియర్ లోనే అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాగా ఇది నిలిచే అవకాశం ఉందని అంటున్నారు. ఈ సినిమా బడ్జెట్ విషయానికి వస్తే సొంత ప్రొడక్షన్ కావడంతో విశ్వక్సేన్ ఎక్కడా తగ్గలేదు. విశ్వక్సేన్ సినిమాస్ అనే బ్యానర్ తో పాటు తన తండ్రికి చెందిన వన్మయి క్రియేషన్స్ బ్యానర్ మీద దాదాపు 20 కోట్ల ఖర్చుతో ఈ సినిమాని నిర్మించారు.

విశ్వక్సేన్ కెరియర్ లోనే అత్యధిక బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా బిజినెస్ కూడా ఒక మాదిరిగా జరిగింది. నైజాం ప్రాంతంలో మూడు కోట్లు సీడెడ్ ప్రాంతంలో కోటి ఆంధ్ర ప్రాంతంలో మూడు కోట్లుగా బిజినెస్ జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏడు కోట్ల మీద అమ్ముడుపోగా మిగతా ఓవరాల్ గా చూసుకుంటే 10 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. ఈ సినిమాని సగానికి సగమే థియేటర్ బిజినెస్ చేసినా మిగతాది ఓటిటి, శాటిలైట్ బిజినెస్ తో కవర్ చేసుకున్నట్లు తెలుస్తోంది.  

ఇక ఈ సినిమా తెలంగాణలో 250 స్క్రీన్లు, ఆంధ్రాలో 220 స్క్రీన్లు ఇండియాలోని ఇతర రాష్ట్రాల్లో 210 స్క్రీన్లు మొత్తం సహా ఓవర్సీస్ లో కూడా కలుపుకుని 650 స్క్రీన్ లలో విడుదలైంది.  ఇక ఈ సినిమా బుధవారం నాడు విడుదలైన 40 శాతం ఆక్యుపెన్సీ కనిపించింది. ఉదయం షోలకు కాస్త జనాలు తక్కువగానే ఉన్నా మధ్యాహ్నం ఫస్ట్ షోలకు బాగా డిమాండ్ పెరిగి హౌస్ ఫుల్ అయినట్లు తెలుస్తోంది. ట్రేడ్ వర్గాల అంచనా మేరకు ఈ సినిమా మొదటిరోజు రెండున్నర కోట్ల నుంచి మూడున్నర కోట్ల వరకు షేర్ వసూళ్లు 4:30 కోట్ల నుంచి 6:30 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లు రాబట్టే అవకాశం ఉందని అంటున్నారు.
Also Read: Modi Htao Desh Bachao : కలకలం రేపుతున్న మోదీ హఠావో దేశ్ బచావో పోస్టర్లు.. ఆరుగురు అరెస్ట్!

Also Read: Samyukta Menon Serious: ఆ బాధ్యత లేదా.. సినిమా యూనిట్ మీద 'సార్' హీరోయిన్ ఫైర్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  TwitterFacebook

 
 

Trending News