Deepthi Sunaina gets emotional : షణ్ముఖ్‌కు బ్రేకప్‌ చెప్పడానికి కారణం చెప్పిన దీప్తి సునయన

Deepthi Sunaina gets emotional on breakup: బ్రేకప్‌ తర్వాత దీప్తి సునయన మొదటిసారి సోషల్ మీడియాలో లైవ్‌లోకి వచ్చింది. ఈ సందర్భంగా భావోద్వేగంతో మాట్లాడింది.  బ్రేకప్‌ గురించి ఒక నెటిజెన్ అడిగిన ప్రశ్నకు దీప్తి సమాధానం ఇచ్చింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 3, 2022, 04:57 PM IST
  • న్యూ ఇయర్‌ సందర్భంగా బ్రేకప్ చెప్పుకున్న దీప్తి సునయన, షణ్ముఖ్‌
  • బ్రేకప్‌ తర్వాత మొదటిసారి సోషల్ మీడియాలో లైవ్‌లోకి వచ్చిన దీప్తి
  • భావోద్వేగానికి గురైన దీప్తి సునయన
Deepthi Sunaina gets emotional : షణ్ముఖ్‌కు బ్రేకప్‌ చెప్పడానికి కారణం చెప్పిన దీప్తి సునయన

Deepthi Sunaina gets emotional while talking  talking about her breakup with Bigg boss 5 telugu fame Shanmukh: బిగ్‌ బాస్‌ షో పూర్తయి.. హౌస్‌ నుంచి షణ్ముఖ్‌ జశ్వంత్‌ (Shanmukh) బయటికి వచ్చాక.. దీప్తి సునయనతో మళ్లీ వరుసగా సాంగ్స్ తీస్తారని, షార్ట్ ఫిల్మ్స్ తీస్తారనుకున్నారు అందరూ. ఇద్దరూ త్వరలో పెళ్లి కూడా చేసుకుంటారని భావించారు. కానీ న్యూ ఇయర్‌ సందర్భంగా దీప్తి సునయన తమ రిలేషన్ షిప్‌కు ఎండ్ కార్డ్ వేస్తున్నామంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. తర్వాత షణ్ముఖ్‌ కూడా తాము విడిపోతున్నట్లు క్లారిటీ ఇచ్చాడు.

తామిద్దరరం తమ పర్సనల్ ప్రాబ్లెమ్స్ వల్ల రిలేషన్‌షిప్‌నకు (Relationship) ఫుల్ స్టాప్‌ పెడుతున్నట్లు దీప్తి సునయన బ్రేకప్ పోస్ట్‌లో పేర్కొంది. తాము ఇద్దరం ఎంతో ఆలోచించాక.. ఈ నిర్ణయం తీసుకుంటున్నామని దీప్తి సునయన చెప్పిన విషయం తెలిసిందే. తమ దారులు తాము చూసుకోవాలని నిర్ణయించుకున్నామంటూ దీప్తి పేర్కొంది. అంతేకాదు తమ మధ్య బ్రేకప్‌ (Breakup) విషయం చాలా రోజుల నుంచి నడుస్తోందని... ఈ క్రమంలో తుది నిర్ణయం తీసుకున్నామంటూ దీప్తి ఇది వరకే చెప్పింది.

ఇలాంటి పరిస్థితుల్లో మీ అందరి అండ అవసరమని దీప్తి చెప్పుకొచ్చింది. తమ ప్రైవసీకి ఆటంకం కలిగించవద్దని కూడా కోరింది దీప్తి. బ్రేకప్ పోస్ట్ (Breakup post) పెట్టాకా తన ఇన్‌స్టాగ్రామ్‌లో (Instagram) కామెంట్‌ సెక్షన్‌ ఆఫ్‌ చేసింది దీపూ.

Also Read : Attempt to destroy NTR statue: దుర్గిలో ఎన్​టీఆర్​ విగ్రహం ధ్వంసానికి యత్నం!

ఇక బ్రేకప్‌ తర్వాత దీప్తి సునయన మొదటిసారి సోషల్ మీడియాలో లైవ్‌లోకి వచ్చింది. ఈ సందర్భంగా భావోద్వేగంతో మాట్లాడింది. బ్రేకప్‌ గురించి ఒక నెటిజెన్ అడిగిన ప్రశ్నకు దీప్తి సమాధానం ఇచ్చింది. తాను లైఫ్‌లో ముందుకు వెళ్లాలనుకుంటున్నానని చెప్పుకొచ్చిది దీప్తి. తాను ఇన్ని సంవత్సరాలు తన లైఫ్‌ గురించిగానీ, తన కెరీర్‌ గురించిగానీ ఎప్పుడూ ఆలోచించలేదని పేర్కొంది దీప్తి.

అయితే ఇక నుంచి తాను తన కెరీర్‌‌పై కేర్ తీసుకుంటానని చెప్పింది దీప్తి. ఇకపై తన గురించి ఆలోచిద్దామని అనుకుంటున్నానని దీప్తి చెప్పుకొచ్చింది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాని చెప్పింది దీప్తి. ఈ క్రమంలో దీప్తి సునయన (Deepthi Sunaina) తీవ్ర భావోద్వేగానికి లోనైంది. ఏడ్చేసింది. తన కన్నీళ్లను ఆపుకునే ప్రయత్నం చేసింది.

 

Also Read : Diabetes: మధుమేహానికి చెక్ పెట్టే సులభమైన ఆరోగ్య చిట్కాలు ఇవే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News