Shanmukh : దీప్తి సంతోషంగా, ప్రశాంతంగా ఉంటే చాలు.. తన వల్లే ఎదిగా.. బ్రేకప్‌పై షణ్ముఖ్‌ ఎమోషనల్ పోస్ట్!

Shanmukh Emotional post : షణ్ముఖ్‌ ఒక ఎమోషనల్ పోస్ట్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ నిర్ణయం తీసుకునే హక్కు ఆమెకు ఉందంటూ దీప్తిని ఉద్దేశించి పోస్ట్‌లో చెప్పుకొచ్చారు షణ్ముఖ్‌. దీప్తి.. సంతోషంగా, ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నానన్నారు. తమ దారులు వేరు అయినా ఒకరికొకరం సపోర్ట్‌గా ఉంటామన్నారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 1, 2022, 04:59 PM IST
  • హాట్ టాపిక్‌గా షణ్ముఖ్‌ జశ్వంత్‌.. దీప్తి సునయన బ్రేకప్
  • బ్రేకప్‌ చెప్తూ షాక్ ఇచ్చిన దీప్తి సునయన..
  • ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసిన షణ్ముఖ్‌
Shanmukh : దీప్తి సంతోషంగా, ప్రశాంతంగా ఉంటే చాలు.. తన వల్లే ఎదిగా.. బ్రేకప్‌పై షణ్ముఖ్‌ ఎమోషనల్ పోస్ట్!

Shanmukh Emotional post on Deepthi Sunaina Breakup :షణ్ముఖ్‌ జశ్వంత్‌.. దీప్తి సునయన బ్రేకప్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. బిగ్‌బాస్‌లో సిరితో ఫ్రెండ్‌షిప్‌ వల్ల షణ్ముఖ్‌ జశ్వంత్‌ లవ్‌ స్టోరీ బ్రేకప్ వరకు వెళ్లిందంటూ సోషల్‌ మీడియాలో టాక్ నడుస్తోంది. షణ్ను.. దీప్తి సునయన ఎన్నో ఏళ్లుగా ప్రేమలో ఉన్నారు. అలాగే సిరికి శ్రీహాన్‌తో ఎంగేజ్‌మెంట్ అయింది. బిగ్‌బాస్‌ హౌస్‌లో షణ్ముఖ్‌.. సిరి చాలా క్లోజ్‌గా మూవ్ అయ్యాడు. ఎమోషనల్‌గా (Emotional‌) కనెక్ట్‌ అయ్యారు. షణ్ముఖ్‌.. సిరి బాండింగ్‌పై సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్‌ (Trolling‌) జరిగింది. వారిద్దరూ హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారంటూ నెటిజెన్స్ మండిపడ్డారు. షో ముగిసి షణ్ముఖ్‌ బయటకు వచ్చిన తర్వాత అతడికి బ్రేకప్‌ (Breakup) చెప్తూ షాక్ ఇచ్చింది దీప్తి సునయన. ఇద్దరం బాగా ఆలోచించి విడిపోదామని నిర్ణయించుకున్నామంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. న్యూ ఇయర్‌‌కు లవ్‌ బ్రేకప్‌తో (Love breakup) వెల్‌కమ్ చెప్పింది దీప్తి. దీంతో వీరి బ్రేకప్ న్యూస్ (Breakup News) హాట్ టాపిక్‌గా మారింది. 

తాము ఎంతో ఆలోచించి.. ఇద్దరం మాట్లాడుకున్న తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నామని దీప్తి పోస్ట్‌లో (Deepti Post‌) పేర్కొంది. తాను షణ్ముఖ్‌, పరస్పర అంగీకారంతోనే విడిపోయి ఎవరి దారి వారు చూసుకోవాలని నిర్ణయించుకున్నామంటూ పేర్కొంది. గత ఐదేళ్లలో తాము ఎంతో సంతోషంగా ఉన్నామని చెప్పుకొచ్చింది దీప్తి. ఇద్దరమూ కలిసి ఉండేందుకు ప్రయత్నించాం.. కానీ మా ఇద్దరి దారులు వేరని తెలుసుకున్నామంటూ దీప్తి పోస్ట్‌లో పేర్కొంది.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by D E E P T H I R E D D Y 🇮🇳 (@deepthi_sunaina)

 

ఈ నేపథ్యంలో షణ్ముఖ్‌ ఒక ఎమోషనల్ పోస్ట్ (Shanmukh Emotional Post) సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ నిర్ణయం తీసుకునే హక్కు ఆమెకు ఉందంటూ దీప్తిని ఉద్దేశించి పోస్ట్‌లో చెప్పుకొచ్చారు షణ్ముఖ్‌. దీప్తి.. సంతోషంగా, ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నానన్నారు. తమ దారులు వేరు అయినా ఒకరికొకరం సపోర్ట్‌గా ఉంటామన్నారు.

Also Read : Radhe Shyam Release Date: రాధేశ్యామ్ మూవీ రిలీజ్ వాయిదాపై మేకర్స్ క్లారిటీ!

తమ బంధం ఐదేళ్లుగా ఎంతో అందంగా గడిచిందంటూ చెప్పాడు. తాను హ్యాపీగా ఉండటమే కావాలి అంటూ ఎమోషనల్‌గా రాసుకొచ్చాడు షణ్ముఖ్‌. ఈ ఐదేళ్లలో దీప్తి (Deepti) సపోర్ట్‌తో చాలా నేర్చుకున్నానని.. మంచి వ్యక్తిగా ఎదిగాను అంటూ ఎమోషనల్ అయ్యాడు షణ్ముఖ్‌. టేక్ కేర్... ఆల్ ది బెస్ట్ దీప్‌ అంటూ ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేశాడు షణ్ముఖ్‌. (Shanmukh)

Also Read : Sivakarthikeyan: 'జాతిరత్నాలు' డైరెక్టర్​తో శివ కార్తికేయన్ తెలుగు సినిమా!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News