Attempt to destroy NTR statue: గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గం పరిధిలోని దుర్గి గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామ ప్రధాన రహదారి పక్కనే ఉన్న టీడీపీ వ్యవస్థాపకుడు, స్వర్గీయ ఎన్న్టీఆర్ విగ్రహాన్ని ఓ వ్యక్తి సుత్తితో ధ్వంసం చేసేందుకు ప్రయత్నించాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. దీనితో టీడీపీ కార్యకర్తలు స్థానికంగా ఆందోళనకు దిగారు.
దుర్గిలో 144 సెక్షన్..
స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు అక్కడకు చేరుకుని విగ్రహ ధ్వంసానికి యత్నించిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. విగ్రహ ధ్వంసానికి పాల్పడిన వ్యక్తి మాజీ మార్కెట్ యార్డు ఛైర్మన్ యలమంద కుమారుడు కోటేశ్వర్ రావుగా గుర్తించారు పోలీసులు. పోలీసులు చేరుకునే లోపే.. విగ్రహం స్వల్పంగా ధ్వంసమైంది. దీనితో స్థానికంగా ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. సమీప ప్రాంతాల నుంచి టీడీపీ శ్రేణులు దుర్గికి చేరుకుంటున్నారు.
ఆందోళనలను అదుపు చేసేందుకు పోలీసులు దుర్గిలో 144 సెక్షన్ విధిచారు. జిల్లా వ్యాప్తంగా పలువురు కీలక నేతలను హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. అయినప్పటికీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు.
ఘనటపై లోకేశ్ ఆగ్రహం..
ఈ ఘనటపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. శెట్టిపల్లి కోటేశ్వరరావుపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
వైసీపీ నాయకులు రెచ్చిపోతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దోపిడీలు, దందాలు, దాడులతో ప్రజలపై తెగబడటమే కాకుండా.. ఇప్పుడు ఏకంగా మహానియుల విగ్రహాలు పగలగొడుతున్నారని విమర్శించారు.
అచ్చోసిన ఆంబోతుల్లా రెచ్చిపోతున్నారు వైసీపీ నాయకులు. దోపిడీలు, దందాలు, దాడులతో ప్రజలపై తెగబడటమే కాకుండా ఇప్పుడు ఏకంగా మహనీయుల విగ్రహాలు పగలగొడుతున్నారు.(1/2) pic.twitter.com/fC8NFmjwxP
— Lokesh Nara (@naralokesh) January 2, 2022
Also read: Andhra Pradesh News: ఏపీలో ముందస్తు ఎన్నికలకు సిద్ధమన్న ప్రతిపక్ష నేత చంద్రబాబు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook