Dhanush SIR Movie : ధనుష్‌కి ఉన్న బుద్ది మిగతా తమిళ హీరోలకు లేదా?.. విజయ్, అజిత్‌లు నేర్చుకోవాల్సిందిదే

Dhanush SIR Movie ధనుష్‌ సార్ మూవీ ప్రమోషన్స్ కోసం రేపు హైద్రాబాద్‌కు రాబోతోన్నాడు. ఈ క్రమంలో తమిళ హీరోలందరిలోనూ ధనుష్ బెటర్ అని తెలుగు ఆడియెన్స్ అభిప్రాయపడుతున్నారు. అజిత్, విజయ్‌లు అయితే తెలుగు ఈవెంట్లలో కనిపించరు అని అంటున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 7, 2023, 07:07 PM IST
  • ఫిబ్రవరి 17న రాబోతోన్న సార్
  • ట్రైలర్‌ ఈవెంట్‌ కోసం ధనుష్‌
  • విజయ్, అజిత్‌లు నేర్చుకుంటారా?
Dhanush SIR Movie : ధనుష్‌కి ఉన్న బుద్ది మిగతా తమిళ హీరోలకు లేదా?.. విజయ్, అజిత్‌లు నేర్చుకోవాల్సిందిదే

Dhanush SIR Movie తమిళ హీరోలకు తెలుగు మార్కెట్‌ కావాలి. కానీ తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు మాత్రం రారు. తెలుగు ఆడియెన్స్ కోసం ఈవెంట్లు పెట్టరు.. పెట్టినా హీరోలు రారు. ఈ విషయంలో రజినీ, కమల్ హాసన్‌ బెటర్. వాళ్లు తెలుగు ప్రేక్షకులను ప్రత్యేకంగా చూస్తారు. తెలుగు మీడియాతో, ప్రేక్షకులతో ఇంటరాక్ట్ అవుతారు. ఆ తరువాత సూర్య, కార్తీలు కూడా తెలుగు వారితో ముచ్చటిస్తుంటారు.

కానీ విజయ్, అజిత్ వంటి హీరోలు మాత్రం ఇంత వరకు తెలుగు ప్రేక్షకుల ముందుకు సరిగ్గా రాలేదు. వారి సినిమాలకు తమిళంలోనే సరిగ్గా ప్రమోట్ చేసుకోరు. ఇక తెలుగు రాష్ట్రాలకు వస్తారని అనుకోవడం అత్యాశే. విజయ్ అయితే సినిమా మొత్తానికి కలిసి ఒక ఈవెంట్‌లో పాల్గొంటాడు. అజిత్ అయితే అది కూడా చేయడు.

తెగింపు సినిమాకు అజిత్ ప్రమోషన్స్ చేయలేదు. విజయ్ తన వారిసు కోసం ఆడియో లాంచ్ ఈవెంట్ పెట్టాడు. వారసుడు అంటూ తెలుగులో కాస్త ఆలస్యంగా వచ్చింది. విజయ్‌ని ప్రమోషన్స్ కోసం హైద్రాబాద్‌కు తీసుకొస్తాను అంటూ దిల్ రాజు చెప్పాడు. కానీ చేయలేకపోయాడు. విజయ్‌ రాడని అందరికీ తెలిసినా.. దిల్ రాజు చెప్పాడు కాబట్టి కాస్త నమ్మారు. మన తెలుగు దర్శకుడు, తెలుగు నిర్మాత తీసిన సినిమాను తెలుగులో ప్రమోట్ చేసేందుకు విజయ్ రాలేదు.

కానీ ధనుష్‌ మాత్రం తన సినిమాను తెలుగులో చక్కగా ప్రమోట్ చేసుకుంటున్నాడు. సితార నిర్మిస్తున్న సార్ (వాతి) మూవీని వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాను ఫిబ్రవరి 17న రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో రేపు ట్రైలర్‌ను రిలీజ్ చేయబోతోన్నారు. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ధనుష్‌ సందడి చేయబోతోన్నాడు.

ఇలా తెలుగు రాష్ట్రాల్లో తన సినిమాను ప్రమోట్ చేసుకునేందుకు స్వయంగా రంగంలోకి దిగుతున్నాడు ధనుష్‌ అంటూ తెలుగు సినీ ప్రేమికులు సంబరపడుతున్నారు. అదే సమయంలో విజయ్, అజిత్‌లను తిట్టేసుకుంటున్నారు. మరి విజయ్, అజిత్‌లు ఇకనైనా మారుతారా? ప్రమోషన్ల కోసం హైద్రాబాద్‌కు వస్తారా? అన్నది చూడాలి.

Also Read:  Anasuya Bharadwaj Photoshoot : పొద్దు తిరుగుడు పువ్వులా అనసూయ.. పూలతోటలో సోయగాల పరిమళం

Also Read: Prabhas Health : ప్రభాస్‌కు అనారోగ్యం.. షూటింగ్‌లు క్యాన్సిల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

More Stories

Trending News