Dhanush Movie: అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కు వచ్చిన ధనుష్ 'తిరు'.. కారణం ఇదే!

Dhanush Movie: కోలీవుడ్ స్టార్ ధనుష్ గతేడాది నటించిన తిరు ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీని సన్ నెక్స్ట్‌లో స్ట్రీమింగ్  చేస్తున్నారు. అందులో అంతగా ఆదరణ లేకపోవడంతో మరో ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో అందుబాటులోకి తీసుకొచ్చారు.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 6, 2023, 08:49 PM IST
Dhanush Movie: అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కు వచ్చిన ధనుష్ 'తిరు'.. కారణం ఇదే!

Thiru Movie on OTT: తమిళ్ స్టార్ హీరో ధనుష్‌ (Dhanush)కు కోలీవుడ్ తో సమానంగా టాలీవుడ్ లోనూ మంచి మార్కెట్ ఉంది. రఘువరన్ బీటెక్ తో ధనుష్ అదరించడం మెుదలుపెట్టారు తెలుగు ప్రజలు. అక్కడి నుంచి ధనుష్ సినిమాలన్నీ నేరుగా తెలుగులోకి రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఈ ఏడాది 'సార్' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు ధనుష్. వెంకీ అట్లూరీ (Venky Atluri) దర్శకత్వం వహించిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.

అయితే గతేడాది ధనుష్ నటించిన 'తిరుచిత్రంబలం' (Thiruchitrambalam) మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. ఈ మూవీని తెలుగులో 'తిరు' పేరుతో విడుదల చేశారు.  ధనుష్‌కు వంద కోట్ల కలెక్షన్లను సాధించిన మొదటి సినిమాగా ఈ మూవీ నిలిచింది. అయితే ఈ మూవీ ఓటీటీలో ఆశించినంతగా ఆడలేదు. దానికి కారణం.. ఈ మూవీని ఓటీటీ ప్లాట్‌ఫామ్ సన్ నెక్స్ట్‌లో  రిలీజ్ చేయడమే. దీనిని సన్ నెక్స్ట్‌లో విడుదల చేయడంతో యూజర్లు ఎవరూ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. దీంతో తాజాగా ఈ మూవీ మరో ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్‌ వేదికగా స్ట్రీమింగ్ చేస్తున్నారు. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం అందుబాటులో ఉంది. 

రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీలో ధనుష్ సరసన రాశీఖన్నా, నిత్యామీనన్‌, ప్రియా భవాని శంకర్‌లు హీరోయిన్‌లుగా నటించారు. ప్రముఖ దర్శకుడు భారతీరాజా కీలకపాత్రలో నటించాడు. లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేష‌న్ అనురుధ్ ర‌విచంద్ర‌న్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు. ఈ మూవీని  స‌న్ పిక్చ‌ర్స్ ప‌తాకంపై క‌ళానిధి మార‌న్ నిర్మించారు. ప్రస్తుతం ధనుష్ 'కెప్టెన్ మిల్లర్' అనే సినిమాలో నటిస్తున్నాడు. 

Also Read: Sankranti Movies 2024: సంక్రాంతి వార్..మహేష్ బాబు 'గుంటూరు కారం' పోటీ తప్పదా..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News