Sankranti Movies 2024: సంక్రాంతి వార్..మహేష్ బాబు 'గుంటూరు కారం' పోటీ తప్పదా..?

పండగలకు సినిమా విడుదల చేసి డబ్బులు దండుకోవాలని ప్రతి సినిమా నిర్మాత అనుకోవడం కామనే.. కానీ ఈ సారి సంక్రాంతికి పెద్ద హీరోల సినిమాలు వరుసలో ఉన్నాయి. వీరిలో  త్రివిక్రమ్ డైరెక్షన్ లో వస్తున్న గుంటూరు కారం సినిమా పై చేయి సాధిస్తుందని చిత్ర యూనిట్ అభిప్రాయం పడుతుంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 6, 2023, 08:05 PM IST
Sankranti Movies 2024: సంక్రాంతి వార్..మహేష్ బాబు 'గుంటూరు కారం' పోటీ తప్పదా..?

Sankranti Movies 2024: సంక్రాంతి, దసరా, దీపావళి వంటి పెద్ద పండగల నాడు థియేటర్లలో సినిమాలను విడుదల చేసేందుకు నిర్మాతలు ఉత్సాహం చూపిస్తుంటారు. అయితే ప్రతి ఏడాది ఈ కథ మామూలే. ఇలాంటి టైమ్ లో సినిమా రిలీజ్ చేసి క్యాష్ చేసుకోవాలని అనుకోవడం కామన్ పాయింటే. ఈ పండగ సీజన్ లో రిలీజ్ చేసిన సినిమాలు అటు ఇటుగా ఉన్నా.. హిట్ టాక్ తెచ్చుకున్నట్టే. అందుకే ఎక్కువ సెలవులు ఉన్న పండుగల కోసం నిర్మాతలు, డైరెక్టర్లు, హీరోలు తెగ ఎదురుచూస్తుంటారు. 

అయితే మన టాలీవుడ్ లో సంక్రాంతి సీజన్ కు డిమాండ్ ఎక్కువ. అప్పుడు విడుదలయ్యే హీరోల సినిమాలు మళ్లీ వచ్చే సీజన్ లో కనిపించకపోవచ్చు. అయితే ఎప్పటిలాగే 2024 సంక్రాంతి సీజన్ కోసం ఇప్పటికే కొన్ని సినిమాలు థియేటర్లపై కర్చీఫ్ వేసేశాయి. స్టార్ హీరోల సినిమాలు బాక్సాఫీస్ బరిలో ఉన్న విషయం తెలిసిందే. తేజ సజ్జా హీరోగా నటించిన 'హనుమాన్', మాస్ మహారాజ్ రవితేజ 'ఈగల్', కింగ్ నాగార్జున 'నా సామీ రంగ', విక్టరీ వెంకటేష్ 'సైంధవ్', 'లాల్ సలామ్', విజయ్ దేవరకొండ కొత్త సినిమాలు రాబోయే సంక్రాంతికి సిద్ధమయ్యాయి. అయితే ఇదే రేసులో అందరి కంటే ముందు మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న 'గుంటూరు కారం' సంక్రాంతి బరిలో పోటీ పడతామని ప్రకటించింది. 

ఇప్పటికే 'గుంటూరు కారం' సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్ ప్రేక్షకులలో అంచనాలను పెంచేశాయి. అటు క్లాస్ తో పాటు మాస్ కు ఫుల్ మీల్స్ అందించేందుకు డైరెక్టర్ త్రివిక్రమ్ ప్లాన్ చేసినట్లు సమాచారం. దీంతో ఈ మూవీ పట్ల తెలుగు ప్రేక్షకులు అందరూ ఎంతో ఆసక్తిగా ఉన్నారని తెలిసిపోతుంది. ఇప్పుడీ సినిమా నిర్మాత నాగవంశీ తాజాగా ఈ మూవీపై అప్డేట్ ఇచ్చాడు. 

Also Read: Kishan Reddy: దారుసలం వెళ్లి వంగి వంగి దండాలు పెడుతున్నారు.. ఎందుకంటే..?: కిషన్ రెడ్డి  

"సూపర్ స్టార్ మహేష్ బాబు గతంలో ఎప్పుడూ కనిపించనంత మాస్ గా తెరపై కనిపిస్తాడు. గుంటూరు కారం మాస్ సాంగ్ పూనకాలు తెప్పించడం ఖాయం. ఎస్ ఎస్ రాజమౌళి సినిమా రేంజ్‌లో కలెక్షన్స్ వస్తాయి" అని నిర్మాత నాగవంశీ అన్నారు. దీంతో మహేష్ బాబు ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. టీజర్, ట్రైలర్ కూడా విడుదలైతే ఈ సినిమాపై మరింత హైప్ పెరిగే అవకాశం ఉంది. 

'గుంటూరు కారం' సినిమాను వచ్చే ఏడాది అంటే 2024 జనవరి 12న విడుదల చేయనున్నారు. అయితే జనవరి 11 నుంచి అమెరికాలో ప్రివ్యూలు ప్రారంభమవుతాయని నిర్మాత నాగవంశీ ఇటీవలే స్పష్టం చేశారు.

సంక్రాంతి పండగ నేపథ్యంలో ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లోని సగానికి పైగా థియేటర్లను ఆక్రమించడం ఖాయమని సినీ విశ్లేషకులు అంటున్నారు. మిగిలిన సినిమాల విడుదల సంగతి ఎలా ఉన్నా.. 'గుంటూరు కారం' మూవీ అనుకున్న తేదీన రిలీజ్ అవ్వడం పక్కా అని నిర్మాత కుండబద్దలు కొట్టారు. అయితే మిగిలిన సినిమాల్లో ఏవి రిలీజ్ అవుతాయో.. ఏ మూవీస్ వెనక్కి తగ్గుతాయో చూడాలి.

Also Read: Android 14 Features: ఆండ్రాయిడ్‌ 14 కొత్త వెర్షన్‌ లాంచ్‌..ఫీచర్స్‌ అన్ని వివరాలు ఇవే!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News