Simhadri 4K: సింహాద్రి రీ రిలీజ్.. రంగంలోకి దిల్ రాజు.. మామూలు మాస్ కాదుగా ఇది!

Dil Raju distributing Simhadri 4: సినిమా నిర్మాతగా , డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరిస్తూ వస్తున్న దిల్ రాజు సింహాద్రి సినిమా రీ రిలీజ్ చేస్తూ డిస్ట్రిబ్యూట్ చేయడం ఆసక్తికరంగా మారింది.  

Written by - Chaganti Bhargav | Last Updated : May 2, 2023, 09:35 PM IST
Simhadri 4K: సింహాద్రి రీ రిలీజ్.. రంగంలోకి దిల్ రాజు.. మామూలు మాస్ కాదుగా ఇది!

Dil Raju distributing Simhadri 4K in Re Release: ఈ మధ్యకాలంలో తెలుగు సినిమాలను రీ రిలీజ్ చేస్తున్న ట్రెండ్ ఎక్కువ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మే 20వ తేదీన ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయన కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సింహాద్రి సినిమాని గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే సినిమా రిలీజ్ చేస్తున్న వారి నుంచి అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. నిజానికి ఈ సినిమా 175 రోజుల పాటు 55 సెంటర్లలో ఆడి అప్పట్లోనే బ్లాక్ బస్టర్ విజయం సాధించింది 2003 జూలై 9వ తేదీన 20 ఏళ్ల వయసులో ఉన్న ఎన్టీఆర్ రాజమౌళి కాంబినేషన్ లో రిలీజ్ అయిన ఈ సినిమా ఒక కొత్త ఊపు తీసుకొచ్చింది. విజయ మారుతి క్రియేషన్స్ బ్యానర్ మీద దొరస్వామి రాజు నిర్మించిన ఈ సినిమా అప్పటి వరకు ఉన్న అన్ని సినిమా రికార్డులు బద్దలు కొట్టి ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

Also Read: Cinema Theatres: ఏఏ రాష్ట్రంలో ఎన్ని సినిమా థియేటర్స్ ఉన్నాయో తెలుసా? స్టేట్ వైడ్ కౌంట్ ఇదే!

స్టూడెంట్ నెంబర్ వన్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్, రాజమౌళి కలయికలో వచ్చిన రెండో సినిమా నందమూరి అభిమానులందరికీ చాలా స్పెషల్ గా నిలిచింది. ఈ నేపద్యంలో రీ రిలీజ్ కూడా మరింత స్పెషల్ గా ఉండేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇప్పటివరకు సినిమా నిర్మాతగా , డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరిస్తూ వస్తున్న దిల్ రాజు ఈ సినిమా రీ రిలీజ్ చేస్తూ డిస్ట్రిబ్యూట్ చేయడం ఆసక్తికరంగా మారింది. డిస్ట్రిబ్యూటర్ గా కెరియర్ ప్రారంభించిన దిల్ రాజు దిల్ సినిమాతో నిర్మాతగా మారారు. అయినా సరే ఒక పక్క డిస్ట్రిబ్యూషన్ చేస్తూనే మరోపక్క సినిమాల నిర్మాణం కూడా చేస్తూ ఉంటారు.

ఇప్పటివరకు కేవలం కొత్తగా రిలీజ్ అవుతున్న సినిమాలను మాత్రమే డిస్ట్రిబ్యూట్ చేస్తూ వస్తున్న ఆయన ఇప్పుడు సింహాద్రి రియల్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం ఆసక్తికరంగా మారింది. ఖచ్చితంగా సింహాద్రి రీ రిలీజ్ లో లాభాలు వస్తాయని అర్థం చేసుకున్న ఆయన నైజాం ప్రాంతంతో పాటు వైజాగ్ ప్రాంతంలో సినిమాని రీ రిలీజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా హాట్ టాపిక్ గా మారింది. దిల్ రాజు అడుగు పెడుతున్నాడు అంటే ఏదో ఉండే ఉంటుందని టాలీవుడ్ వర్గాల్లో కూడా చర్చ జరుగుతుందని ప్రచారం జరుగుతుంది. చూడాలి మరి భవిష్యత్తులో ఏం జరగబోతోంది అనేది.

Also Read: Chaithra Rai in NTR 30: కొరటాల మాస్టర్ స్కెచ్.. బాలీవుడ్ విలన్ కి భార్యగా తెలుగు టీవీ హీరోయిన్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News