Dil Raju: కొడుక్కి ఆసక్తికరమైన పేరు పెట్టిన దిల్ రాజు.. ఇద్దరి భార్యల పేర్లు కలిసేలా ఏమి పెట్టారంటే

Dil Raju Named his Son: సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం మేరకు దిల్ రాజు తన కుమారుడికి పేరు కూడా ఫిక్స్ చేశారు. తన మొదటి భార్య పేరులోని మొదటి రెండు అక్షరాలు రెండో భార్య పేరులోని మొదటి రెండు అక్షరాలు కలిపి పేరు పెట్టారని అంటున్నారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 13, 2022, 06:53 PM IST
  • పండంటి బిడ్డకు జన్మనిచ్చిన దిల్ రాజు రెండో భార్య
  • పేరు కూడా పెట్టేసిన దిల్ రాజు
  • ఇద్దరి భార్యల పేర్లు కలిసి వచ్చేలా పేరు
Dil Raju: కొడుక్కి ఆసక్తికరమైన పేరు పెట్టిన దిల్ రాజు.. ఇద్దరి భార్యల పేర్లు కలిసేలా ఏమి పెట్టారంటే

Dil Raju Named his Son as Anvy Reddy: టాలీవుడ్ లో తిరుగులేని నిర్మాతగా పేరు తెచ్చుకున్న దిల్ రాజు ఈ మధ్యకాలంలో రెండోసారి తండ్రి అయ్యారు. గతంలోనే ఆయనకు మొదటి అనితతో హర్షిత రెడ్డి అనే కుమార్తె జన్మించగా ఆమెకు కూడా వివాహం జరిగి కుమారుడు జన్మించారు. అయితే అనిత అనుకోని పరిస్థితుల్లో మరణించడంతో కొన్నాళ్ల పాటు ఒంటరి జీవితం గడిపిన దిల్ రాజు కుమార్తె సహా శ్రేయోభిలాషుల సలహా మేరకు తేజస్విని అనే ఒక అమ్మాయిని వివాహం చేసుకున్నారు. వివాహం చేసుకున్న వెంటనే ఆమెకు వైఘా రెడ్డి అనే పేరు కూడా పెట్టారు. 

ఈ మధ్యనే ఆమె తల్లయ్యారు. ఆమె ఒక పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ బుడతడి ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి ఇక తాజాగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం మేరకు దిల్ రాజు తన కుమారుడికి పేరు కూడా ఫిక్స్ చేశారు. తన మొదటి భార్య పేరులోని మొదటి రెండు అక్షరాలు రెండో భార్య పేరులోని మొదటి రెండు అక్షరాలు కలిపి బుడతడికి అన్వీ(anvy) రెడ్డి అనే పేరు ఫిక్స్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజానిజాలు ఏ మేరకు ఉన్నాయి అనేది దిల్ రాజు అధికారికంగా ప్రకటిస్తే గాని క్లారిటీ రాదు.  

అయితే ప్రస్తుతానికి దిల్ రాజు వరుస సినిమాలతో సందడి చేస్తున్నారు. ఆయన నిర్మించిన థాంక్యూ సినిమా జూలై 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సర్వం సిద్ధమైంది.  మరో రెండు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను ఆయన నిర్మిస్తున్నారు. అందులో ఒకటి రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్లో మూవీ కాగా మరొకటి వంశీ పైడిపల్లి విజయ్ హీరోగా రూపొందుతోంది. 

Also Read: Brahmastra: బ్రహ్మాస్త్ర కథ బయట పెట్టేసిన డైరెక్టర్.. స్పెషల్ వీడియో రిలీజ్!

Also Read: Koratala siva: ఆచార్య దెబ్బ.. కొరటాల ఆఫీస్ ముందు ఎగ్జిబిటర్ల భైఠాయింపు!

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News