అజ్ఞాతవాసి సినిమా ఫలితానికి ఆ సినిమా దర్శకుడు త్రివిక్రమ్ కారణం అని, పవన్ కల్యాణ్ ఇమేజ్‌కి తగిన స్థాయిలో ఆ సినిమాను తెరకెక్కించలేదని.. సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతున్న కొన్ని పోస్టులపై ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ తనదైన స్టైల్లో స్పందించినట్టు తెలుస్తోంది.
ది హన్స్ ఇండియా ప్రచురించిన ఓ కథనం ప్రకారం.. "అజ్ఞాతవాసి ఫలితానికి డైరెక్టర్ త్రివిక్రమ్‌ని నిందించడం కరెక్ట్ కాదు. ఎందుకంటే పీకే లాంటి ఆకాశం మీద దుప్పటి కప్పడం స్టీవెన్ స్పిల్‌బర్గ్, జేమ్స్ కేమరాన్ తరం కూడా కాదు. మదర్ ప్రామిస్‌గా చెబుతున్నా.. జేమ్స్ కేమరూన్, స్టీవెన్ స్పిల్‌బర్గ్, క్రిస్టోఫర్ నొలన్, చనిపోయిన హిచ్‌కాక్ లాంటి డైరెక్టర్లు ఫ్రాన్సిస్ కొప్పొలా, అకిర కురొసవ లాంటి వాళ్లని అసిస్టెంట్ డైరెక్టర్లుగా పెట్టుకుని సినిమా తీసినా పీకేకి వున్న పవర్ ఇమేజ్‌కి న్యాయం చేయడం కష్టం. అటువంటప్పుడు కేవలం త్రివిక్రమ్‌ని నిందించడం ఏమాత్రం సరికాదు" అని రాంగోపాల్ వర్మ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టి డిలీట్ చేసినట్టు సమాచారం.
'అజ్ఞాతవాసి' ఫలితంపై వర్మ హాట్ కామెంట్ ?