Drinker Sai: డ్రింకర్ సాయిగా సినీ అభిమానులను ఫిదా చేస్తున్న హీరో ధర్మ.. కాంతారా రేంజ్ లో ఇంట్రవెల్

Drinker Sai Review: విన్నతమైన కథలతో సినీ ప్రేక్షకుల ముందుకు వస్తే.. ఆ సినిమాలు తప్పకుండా విజయం సాధిస్తాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ క్రమంలో ఇలాంటి కథతోనే వచ్చి.. ట్రైలర్ నుంచే తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొల్పిన చిత్రం డ్రింకర్ సాయి. ముఖ్యంగా ఈ సినిమాలో హీరో ధర్మ యాక్టింగ్ చాలా బాగుంది అంటూ ప్రశంసలు అందుతున్నాయి.

Written by - Vishnupriya | Last Updated : Dec 29, 2024, 02:43 PM IST
Drinker Sai: డ్రింకర్ సాయిగా సినీ అభిమానులను ఫిదా చేస్తున్న హీరో ధర్మ.. కాంతారా రేంజ్ లో ఇంట్రవెల్

Drinker Sai : కిరణ్ తిరుమలశెట్టి దర్శకత్వంలో రూపొందించిన డ్రింకర్ సాయి చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి, మంచి స్పందనను పొందుతోంది. "బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్" అనే ట్యాగ్ లైన్‌తో రూపొందిన ఈ చిత్రంలో హీరో ధర్మ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. తాగుబోతు పాత్రకు తగిన లుక్, నటనతో అతను అందరి హృదయాలను గెలుచుకున్నాడు అని ఎంతోమంది సినీ ప్రేక్షకులు సోషల్ మీడియాలో అభినందిస్తున్నారు.  

Add Zee News as a Preferred Source

ఇక ఈ సినిమా రివ్యూ విషయానికి వస్తే.. సరికొత్త కథతో వచ్చిన ఈ చిత్రంలో హీరో పాత్ర అందరిని ఆకట్టుకుంటుంది. యానిమల్, అర్జున్ రెడ్డి రేంజ్ లో ఈ హీరో పాత్రాన్ని తీర్చిదిద్దడం గమనర్హం. ధర్మ తన పాత్రకు అనుగుణంగా ఫిజిక్, లుక్స్‌ను బాగా మెయింటైన్ చేయడంతో పాటు, అతని రియలిస్టిక్ యాక్టింగ్ ప్రేక్షకులకు మంచి ఇంటెన్స్ అనుభూతి కలిగించింది. ప్రేమ, భావోద్వేగాలు, డాన్స్, ఫైట్స్ వంటి అన్ని అంశాల్లోనూ ధర్మ తనదైన శైలిని ప్రదర్శించాడు.  

మాస్ ప్రేక్షకుల‌కు కనెక్ట్ అయిన ఇంట్రడక్షన్  

సినిమాలో ధర్మ ఇంట్రడక్షన్ సీన్ మాస్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. పాటలలో అతని డాన్స్ పర్ఫార్మెన్స్ ప్రత్యేకంగా నిలిచింది. అద్భుతమైన విజువల్స్‌తో పాటలు ప్రేక్షకులపై అమితమైన ప్రభావాన్ని చూపించాయి. ఈ సినిమాతో ధర్మ యువ హీరోలలో బెస్ట్ డాన్సర్ అనిపించుకున్నాడు.  

ప్రీ ఇంటర్వెల్‌లో అతని ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్, "కాంతారా" క్లైమాక్స్ సీన్స్‌ను గుర్తు చేసేలా ఉండి, ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకుంది.  

నవ్వులు పండించిన క్యారెక్టర్లు  

సెకండాఫ్‌లో భద్రం క్యారెక్టర్ పిల్లోడుగా ప్రేక్షకుల్ని నవ్వులు పండించాడు. అలాగే పుష్ప ట్రాక్ అత్యంత ఆకర్షణీయంగా నిలిచింది. ఇది సినిమాలో అత్యుత్తమ సన్నివేశాల్లో ఒకటిగా నిలుస్తుంది. ఈ ట్రాక్ కథను క్లైమాక్స్‌కు అద్భుతంగా కనెక్ట్ చేసింది.  

ఎమోషనల్ సీన్స్ ఆకట్టుకున్నాయి  

సెకండాఫ్‌లో వచ్చే అనాథాశ్రమంలో ఎమోషనల్ సాంగ్స్, మోంటే షార్ట్ సీన్స్ ప్రేక్షకుల హృదయాలను తాకాయి. విజయవాడ విజువల్స్ అద్భుతంగా ఉండటంతో ప్రేక్షకులు విశేషంగా ఆనందించారు. ముఖ్యంగా క్లైమాక్స్‌లో ఫ్యామిలీ ఆడియన్స్, మహిళలను ఆకట్టుకునే సన్నివేశాలు అందరి హృదయాలను కదిలించాయి.  

ఇది ధర్మ తొలి చిత్రం అయినప్పటికీ, 10 సినిమాల అనుభవం ఉన్న నటుడిలా నటించాడు. యాక్టింగ్, డాన్స్, ఫైట్స్, కామెడీ, ఎమోషనల్ సీన్స్ వంటి విభాగాలన్నింటిలోను ధర్మ తనదైన ముద్ర వేశాడు.  

క్లైమాక్స్‌లో ధర్మ నటన ప్రేక్షకుల కంటతడిని తెప్పించింది. ఈ చిత్రంలో అతని ప్రతిభ చూసిన తర్వాత టాలీవుడ్‌లో మరిన్ని గొప్ప సినిమాలు చేయగలడనే ఆశ ప్రేక్షకుల్లో కలిగింది. మొత్తం పైన డ్రింకర్ సాయి సినిమా ధర్మకు మైలురాయిగా నిలిచింది.

Also Read: Financial Planning: ఎందుకు గురు టెన్షన్.. ఇలా బడ్జెట్‌ ప్లాన్‌తో ఎంచక్కా డబ్బులు సేవింగ్ చేసుకోండి

Also Read: Heavy Snowfall:  మంచు దుప్పటి కప్పుకున్న కాశ్మీరం..ప్రకృతి అందాలను ఎంజాయ్ చేస్తోన్న పర్యాటకులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook 

About the Author

Vishnupriya

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.

...Read More

Trending News