బుట్టబొమ్మ పాటకు కెవిన్ పీటర్సన్ డాన్స్..!!

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, హీరోయిన్ పూజా హెగ్డే, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం 'అల వైకుంఠపురములో..'. సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రంలోని పాటలు ఎన్నో సిత్రాలు చేస్తున్నాయి. 

Last Updated : May 13, 2020, 03:45 PM IST
బుట్టబొమ్మ పాటకు కెవిన్ పీటర్సన్ డాన్స్..!!

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, హీరోయిన్ పూజా హెగ్డే, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం 'అల వైకుంఠపురములో..'. సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రంలోని పాటలు ఎన్నో సిత్రాలు చేస్తున్నాయి. 

ఈ సినిమాలో పాటలు ఎంత హిట్టయ్యాయో అందరికీ తెలుసు. ఐతే సినిమా విడుదలై..బ్లాక్ బస్టర్ గా నిలిచిన తర్వాత కూడా సినిమాలోని సాంగ్స్ క్రేజ్ సంపాదించుకుంటున్నాయి. మొన్నటికి మొన్న ఈ  సినిమాలోని బుట్టబొమ్మ పాటకు బాలీవుడ్ ముద్దుగుమ్మ శిల్పా శెట్టి డాన్స్ చేశారు. నిన్నటికి నిన్న ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ దంపతులు బుట్ట బొమ్మ పాటకు డాన్స్ చేసి అలరించారు. వారిద్దరి వీడియో వైరల్ గా మారింది.

మరోవైపు ఇప్పుడు బుట్టబొమ్మ పాట ఇంగ్లండ్ మాజీ క్రికెటర్, కెప్టెన్ కెవిన్ పీటర్సన్ ను కూడా ఆకట్టుకుంది. దీంతో ఆయన బుట్టబొమ్మ పాటకు తనదైన రీతిలో స్టెప్పులేశారు.

జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News