F3 Movie Release Date: 'ఎఫ్​ 3' సినిమా రిలీజ్​ డేట్​ ఫిక్స్​..

F3 Movie Release Date: విక్టరీ వెంకటేశ్, వరుణ్ తేజ్ మల్టీస్టారర్​గా తెరకెక్కుతోన్న 'ఎఫ్ 2' సీక్వెల్ 'ఎఫ్ 3' సినిమాపై (F3 Movie Update) ప్రేక్షకులలో అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. ఈ సినిమా రిలీజ్​ డేట్​ను చిత్రబృందం ఆదివారం ఓ పోస్టర్​ ద్వారా వెల్లడించింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 24, 2021, 01:05 PM IST
    • 'ఎఫ్​ 3' సినిమా రిలీజ్​పై చిత్రబృందం క్లారిటీ
    • వచ్చే ఏడాది ఫిబ్రవరి 25న సినిమాను రిలీజ్​ చేయనున్నట్లు ప్రకటన
    • ప్రధానపాత్రల్లో నటిస్తున్న వెంకటేష్​, వరుణ్​ తేజ్​
F3 Movie Release Date: 'ఎఫ్​ 3' సినిమా రిలీజ్​ డేట్​ ఫిక్స్​..

F3 Movie Release Date: విక్టరీ వెంకటేష్​, మెగా ప్రిన్స్​ వరుణ్​ తేజ్​ ప్రధానపాత్రల్లో నటించిన చిత్రం 'ఎఫ్​ 2' (ఫన్​ అండ్​ ఫస్ట్రేషన్​). 2019లో సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద ఘన విజయం సాధించింది. ఇప్పుడా సినిమాకు సీక్వెల్​గా 'ఎఫ్ 3' సినిమాను (F2 Movie Sequel) రూపొందిస్తున్నారు డైరెక్టర్​ అనిల్​ రావిపూడి (F3 Movie Director). ఈ సినిమా చిత్రీకరణ తుదిదశకు చేరుకుంది. ఈ క్రమంలో 'ఎఫ్​ 3' రిలీజ్​ డేట్​ను చిత్రబృందం ప్రకటించింది. వచ్చే ఏడాది అంటే 2022 ఫిబ్రవరి 25న సినిమాను థియేటర్లలో రిలీజ్​ (F3 Movie Release Date) చేయనున్నట్లు నిర్మాతలు వెల్లడించారు. ​  

'బొమ్మ ఎప్పుడు పడితే..అప్పుడే మనకు నవ్వుల పండగ' అనే క్యాప్షన్​తో ఆదివారం ఓ పోస్టర్​ను (F3 Telugu Movie Poster) విడుదల చేసింది చిత్రబృందం. ఈ సినిమా చూస్తే నవ్వులు గ్యారెంటీ అంటూ ట్యాగ్​తో రిలీజ్​ డేట్​ను ప్రకటించింది.  

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'ఎఫ్​ 3' సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా మొత్తం ఫన్ అండ్ ఫ్రస్టేషన్ కాంబినేషన్‌గా ఉంటుంది. ఇందులో వెంకటేష్​ (F3 Venkatesh Movie), వరుణ్ తేజ్ (Varun Tej News) సరసన తమన్నా, మెహ్రీన్ పిర్జాదా హీరోయిన్లుగా నటిస్తున్నారు.  

Also Read: Prabhas Spirit Movie Story: స్పోర్ట్స్​ డ్రామా నేపథ్యంలో తెరకెక్కనున్న ప్రభాస్​ 'స్పిరిట్​'?

Also Read: Grama Ward Sachivalayam Salary: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు షాక్​.. అక్టోబరు జీతాల్లో కోత!   

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News