Rajendra Prasad Passed Away: టాలీవుడ్లో విషాదం.. డైరెక్టర్ ఆకస్మిక మృతి!

Film Maker Rajendra Prasad Passed Away: తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. తెలుగు సినీ దర్శకుడు ఒకరు కన్నుమూశారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 19, 2022, 07:28 PM IST
Rajendra Prasad Passed Away: టాలీవుడ్లో విషాదం.. డైరెక్టర్ ఆకస్మిక మృతి!

Film Maker Rajendra Prasad Passed Away: తెలుగు సినీ పరిశ్రమ నుంచి మరో విషాదకర వార్త బయటకు వచ్చింది. ఇప్పటికే ఈ ఏడాది పలువురు సినీ నటులను, టెక్నీషియన్లను కోల్పోయిన తెలుగు సినీ పరిశ్రమ మరో ప్రతిభావంతమైన సినిమాటోగ్రాఫర్ కం దర్శకుడిని కోల్పోయింది. దర్శకుడిగా, సినిమాటోగ్రాఫర్గా, నిర్మాతగా పలు సినిమాలు తెరకెక్కించిన రాజేంద్రప్రసాద్ శుక్రవారం నాడు కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన అనారోగ్యం కారణంగానే మరణించారని తెలుస్తోంది.

ఆ నలుగురు సహా తెలుగులో అనేక ప్రయోగాత్మక సినిమాలు తెరకెక్కించిన  దర్శకుడు చంద్ర సిద్ధార్థకు ఆయన వరుసకు సోదరుడు అవుతారు. తెలుగులో రూపొందిన నిరంతరం అనే సినిమాకు రాజేంద్ర ప్రసాద్ దర్శకత్వం వహించడమే గాక నిర్మించారు. ఇక ఈ సినిమా మలేషియాలోని కైరో చలనచిరోత్సవాలకు కూడా ఆ రోజుల్లోనే ఎంపికై పలువురి ప్రశంసలు అందుకుంది. ఇక హాలీవుడ్ లో కూడా రాజేంద్రప్రసాద్ పలు సినిమాలు తెరకెక్కించారు.

హాలీవుడ్‌లో రాజేంద్రప్రసాద్   'మన్ విమన్ అండ్ ది మౌస్', 'రెస్డ్యూ - వేర్ ది ట్రూత్ లైస్' 'ఆల్ లైట్స్, నో స్టార్స్' వంటి సినిమాలకు దర్శకత్వం వహించారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆయన దర్శకత్వం వహించిన అన్ని సినిమాలకు ఆయన స్వయంగా కథ రాసుకోవడమే గాక సినిమాటోగ్రఫీ బాధ్యతలు కూడా నిర్వర్తించారు.

ఇక తెలుగులో రాజేంద్రప్రసాద్ సినిమాటోగ్రాఫర్ గా మేఘం, హీరో సహా మరిన్ని సినిమాలకు సినిమాటోగ్రాఫర్గా సేవలు అందించారు. ఆయన హిందీలో కూడా పలు సినిమాలు చేశారు. అలా బాలీవుడ్ లో సినిమాలు చేస్తున్న సమయంలో ఆయన ముంబైలో స్థిరపడ్డారు. రాజేంద్రప్రసాద్ మృతి చెందారు అన్న విషయం తెలుసుకుని పలువురు తెలుగు సినీ ప్రముఖులు, బాలీవుడ్ సినీ ప్రముఖులు తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Nayanathara Vignesh Shivan Honeymoon: సెకండ్ హనీమూన్ ఎంజాయ్ చేస్తున్న కొత్త జంట.. ఫోటోలు చూశారా?

Also Read: Raashi Khanna Hot Photos: మునుపెన్నడూ లేనివిధంగా రెచ్చిపోయిన రాశి ఖన్నా.. నెవర్ బిఫోర్ అంతే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News