Filmfare Awards: 69వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్.. సత్తా చాటిన సందీప్ రెడ్డి వంగా 'యానిమల్'..

69th Film Fare Awards : సినీ ఇండస్ట్రీలో జాతీయ అవార్డుల తర్వాత అత్యంత ప్రాధాన్యత ఉన్న అవార్డులుగా ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్‌కు ఉంది. తాజాగా 69వ ఫిల్మ్‌ఫేర్ అవార్డులను ప్రకటించారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Jan 29, 2024, 09:36 AM IST
Filmfare Awards: 69వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్.. సత్తా చాటిన సందీప్ రెడ్డి వంగా 'యానిమల్'..

69th Filmfare Awards: 69వ ఫిల్మ్ ఫేర్ అవార్డుల ప్రధానోత్సవం గుజరాత్‌ రాజధాని గాంధీ నగర్‌లో అట్టహాసంగా జరిగింది. ఈ అవార్డుల్లో తెలుగు వాడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన 'యానిమిల్' మూవీ ఉత్తమ నటుడు సహా ఎక్కువ అవార్డులను కైవసం చేసుకొని సత్తా చాటింది.ఇక 'యానిమల్‌' చిత్రంలోని నటనకు రణబీర్ కపూర్ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. అటు 'రాణీ ఔర్ రాఖీకీ ప్రేమ్ కహాని' మూవీలోని నటనకు ఆలియా భట్ ఎంపికైయింది. అటు ఉత్తమ చిత్రంగా 12th Fail మూవీ ఎంపికైయింది. ఈ చిత్ర దర్శకుడు విధు వినోద్ చోప్రా.. బెస్ట్ డైరెక్టర్‌గా ఎంపికయ్యారు. ఇందులోని నటించి విక్రాంత్ మెస్సే బెస్ట్ యాక్టర్ క్రిటిక్స్ అవార్డు అందుకున్నారు.  అటు సందీప్ రెడ్డి వంగా .. యానిమల్ మూవీ ఫిల్మ్‌ఫేర్ అవార్డుల్లో సత్తా చాటింది.

69వ ఫిల్మ్‌ఫేర్ అవార్డుల లిస్టు..

బెస్ట్ మూవీ: 12th ఫెయిల్
బెస్ట్ మూవీ (క్రిటిక్స్) : జొరామ్
బెస్ట్ డైరెక్టర్ : విధు వినోద్ చోప్రా (12th ఫెయిల్)
బెస్ట్ యాక్టర్ : రణబీర్ కపూర్ (యానిమల్)
బెస్ట్ యాక్ట్రస్ : ఆలియా భట్‌ (రాఖీ ఔర్ రాణికి ప్రేమ్ కహాని)
బెస్ట్ యాక్టర్ క్రిటిక్స్ : విక్రాంత్ మెస్సే (12th ఫెయిల్)
బెస్ట్ యాక్ట్రెస్ క్రిటిక్స్ : రాణీ ముఖర్జీ (మిస్సెస్ ఛటర్జీ Vs నార్వే), షఫాలీ షా (త్రీ ఆఫ్ అజ్)
బెస్ట్ క్యారెక్టర్ యాక్టర్ : విక్కీ కౌశల్ (డంకీ)
బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ : షబానా అజ్మీ (రాఖీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహాని)
బెస్ట్ మ్యూజిక్ ఆల్బమ్ : యానిమల్
బెస్ట్ లిరికల్ రైటర్ : అమితాబ్ భట్టాచార్య (తెరె వాస్తే.. జరా హఠ్కే జరా బచ్కే)
బెస్ట్ సింగర్ : భూపిందర్ బాబల్ (అర్జన్ వెయిలీ - యానిమల్)
బెస్ట్ లేడీ సింగర్ : శిల్పా రావు (జవాన్ -చెలియా)
బెస్ట్ స్టోరీ: అమిత్ రాయ్ (Oh My God 2)
బెస్ట్ స్క్రీన్‌ప్లే : విధు వినోద్ చోప్రా (12th ఫెయిల్)
బెస్ట్ డైలాగ్ రైటర్ : ఇషితా మెయిత్రా (రాఖీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహాని)

ఇదీ చదవండి: మీపేరు ఈ 2 అక్షరాలతో మొదలవుతుందా? అయితే, మీలవ్ బ్రేకప్..

ఇదీ చదవండి:  ఇంట్లో ఈ దిక్కున అద్దం పెడితే అదృష్టం.. ఆ ఇంట్లోవారికి ప్రతి పనిలో విజయం..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News