Fire at Bigg Boss 15 set: బిగ్​బాస్​ సెట్​లో​ అగ్నిప్రమాదం, ముంబైలోని గోరెగావ్​​లో ఘటన

Fire on Bigg Boss 15 sets: ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ సెట్​లో మంటలు చెలరేగాయి. ఈ ఘటన ముంబైలోని గోరెగావ్​​లో ఉన్న బిగ్​బాస్​ సెట్​లో జరిగింది.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 13, 2022, 07:35 PM IST
Fire at Bigg Boss 15 set: బిగ్​బాస్​ సెట్​లో​ అగ్నిప్రమాదం, ముంబైలోని గోరెగావ్​​లో ఘటన

Fire on Bigg Boss 15 sets: బిగ్​బాస్​ సెట్​లో అగ్నిప్రమాదం (fire at bigg boss set) జరిగింది. ఈ ఘటన ముంబైలోని గోరేగావ్‌లో (Goregaon) చోటుచేసుకుంది. ఆదివారం మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది.  ప్రస్తుతం నాలుగు నాలుగు ఫైర్ ఇంజన్లు మంటలను అదుపుచేస్తున్నాయి. ఈ ప్రమాదాన్ని లెవల్ 1 అగ్నిప్రమాదంగా పేర్కొన్నారు. 

సెట్‌లోని ఏ భాగంలో మంటలు చెలరేగాయో ఇంకా తెలియరాలేదు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. గతంలో ఇక్కడ 'ఆదిపురుష్' సినిమా షూటింగ్​ సమయంలోనూ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. 

సల్మాన్ (Salman Khan) హోస్ట్ చేసిన బిగ్ బాస్ 15 (Bigg Boss 15) ఇటీవల ముగిసింది. నాలుగు నెలల పాటు ప్రేక్షకులను అలరించిన ఈ షో.. జనవరి 30న విజేతను ప్రకటించడంతో ముగిసింది.  BB 15 విజేతగా తేజస్వి ప్రకాష్ (tejasswi prakash) నిలిచింది. ట్రోఫీతోపాటు రూ. 40లక్షల ప్రైజ్ మనీ గెలుచుకుంది. ప్రతీక్ సెహజ్‌పాల్ రన్నరప్‌గా నిలిచారు. ప్రస్తుతం తేజస్వీ 'నాగిని 6' సీరియల్ లో నటిస్తోంది. 

Also Read: Mohan Babu: ఇకపై ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్ బై : మోహన్‌బాబు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News