Game On: గేమ్ మొదలైంది.. ఇక మీరే మమ్మల్ని గెలిపించాలి అంటున్న గీతానంద్

Geethanand: జీవితంలో ఏమీ సాధించలేని వ్యక్తిగా, లూజ‌ర్ కింద మిగిలిపోతున్న ఓ అబ్బాయి జీవితంలో అనుకొని ఒక విచిత్రమైన పరిస్థితి ఎదురవుతుంది. అదేమిటో తెలియాలి అంతే గీతానంద్ సినిమా చూడాలి..

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 20, 2024, 05:25 PM IST
Game On: గేమ్ మొదలైంది.. ఇక మీరే మమ్మల్ని గెలిపించాలి అంటున్న గీతానంద్

Game On: గీతానంద్, నేహా సోలంకి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం  ‘గేమ్ ఆన్‌’. ఈ సినిమాలో సీనియర్ నటులు శుభలేఖ సుధాకర్, మధుబాల, ఆదిత్య మీనన్ కీలక పాత్రలు పోషించారు. క‌స్తూరి క్రియేష‌న్స్ అండ్  గోల్డెన్ వింగ్ ప్రొడ‌క్ష‌న్స్‌ బ్యాన‌ర్స్‌పై వస్తున్న ఈ చిత్రానికి ద‌యానంద్  దర్శకత్వం వహిస్తుండగా ర‌వి క‌స్తూరి ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్ర‌వ‌రి 2న గ్రాండ్ గా విడుద‌ల‌కు సిద్ద‌మ‌వుతోంది. ఈ నేపథ్యంలో శనివారం హైదరాబాదులోని ప్రసాద్ లాబ్స్ లో ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను నిర్వహించారు.  

ఈ ట్రైలర్ ప్రస్తుతం అందరిని ఆకట్టుకుంటుంది.
 ఈ సంద‌ర్భంగా నిర్మాత ర‌వి క‌స్తూరి  మాట్లాడుతూ..." ఇది నా ఫస్ట్ సినిమా‌. నేను ఉండేది ఆస్ట్రేలియాలో.  గీతానంద్ నా క్లాస్మేట్.  తనతో ఏదో ఒక రోజు సినిమా తీద్దామని అనుకున్నాం. తను వచ్చే కథ చెప్పగానే నాకు బాగా నచ్చి ఈ సినిమా స్టార్ట్ చేసాం.   ఎక్కడ  కాంప్రమైజ్ కాకుండా దీన్ని రూపొందించాం.  ప్రతి విషయంలో క్వాలిటీ ఉండేలా చూసుకున్నాం. ప్రేక్షకులను ఎంగేజ్ చేసేలా సినిమా ఉంటుంది. నవాబ్ గ్యాంగ్స్ అద్భుతమైన పాటలు ఇచ్చారు అవి అందర్నీ ఆకట్టుకునేలా ఉంటాయి. ఇలాంటి కథ ఇప్పటివరకు తెలుగు తెరపై రాలేదు". అని తెలియజేశారు. 

ఆదిత్య మీనన్ మాట్లాడుతూ... ,”కొత్తవారిని ప్రేక్షకులు సపోర్ట్ చేస్తే ఇలాంటి కొత్త కథలు వస్తూనే ఉంటాయి ఈ సినిమా చాలా డిఫరెంట్ కథలో వస్తోంది" అని చెప్పారు.

దర్శకుడు దయానంద్‌ మాట్లాడుతూ ‘‘ కమర్షియల్ స్క్రిప్ట్ ని రా అండ్ రస్టిక్ గా ఈ సినిమాలో చూపించడానికి ప్రయత్నించాను. పూరి జగన్నాథ్ ఫ్యాన్ గా ఈ సినిమాను నేను దర్శకత్వం వహించాను. ఈ చిత్రంలో పాత్రలన్నీ గ్రే షేడ్‌లో ఉంటాయి. ప్రతి పాత్రకు ప్రాధాన్యం ఉంటుంది. తన జీవితాన్ని చాలించాలనుకునే ఓ వ్యక్తి ,రియల్‌ టైమ్ సైక‌లాజిక‌ల్ గేమ్‌లోకి ఎలా ప్రవేశించాడు? గేమ్‌లోని టాస్క్‌ను ఎలా స్వీకరించాడు? అసలు ఆ గేమ్‌ ఎంచుకోబడడానికి ముఖ్యమైన కారణం ఏమిటి అనే దానిపై ‘గేమ్ ఆన్’ సినిమా తెరకెక్కింది. యాక్ష‌న్‌, రొమాన్స్,  ఎమోష‌న్స్ ఆక‌ట్టుకుంటాయి. ప్రేక్షకులకు ఈ సినిమా కొత్త అనుభూతిని ఇస్తుంది. ఈ జర్నీలో చాలా ఛాలెంజెస్ ఫేస్ చేసాం.  గీతానంద్ ఇంటెన్స్ క్యారెక్టర్ చేశాడు. మధు బాల గారు చాలా ఇంపార్టెంట్ రోల్ చేశారు.  ఈ చిత్రం రెగ్యులర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కాకపోయినా ఫ్యామిలీ డార్క్ ఎమోషన్స్ ఉంటాయి" అని చెప్పుకొచ్చారు  

నేహా సోలంకి మాట్లాడుతూ..  " ఇలాంటి పాత్రను గతంలో నేనెప్పుడూ చేయలేదు.  అందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా" అని అన్నారు. 

గీతానంద్ మాట్లాడుతూ.. " మీరు ట్రైలర్ లో చూసింది 10% మాత్రమే. ఇదొక హై ఆక్టేన్ యాక్షన్ డ్రామా. ఈ సినిమా కోసం చాలా రీసెర్చ్ చేశాం.  మంచి కాన్సెప్ట్ రాసుకుని దానికి కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించాం.  ఈ సినిమాలో ఎన్నో అంశాలను ఆసక్తికరంగా చూపించాం. మధుబాల గారు ఆదిత్య మీనన్ గారు ఇందులో ఉండడం ఈ సినిమా  నెక్స్ట్ లెవెల్ కు వెళ్లింది. గేమ్ స్టార్ట్ చేసాం . మా గేమ్ ను ప్రేక్షకులే గెలిపించాలి. నేను కూడా నటుడుగా పేరు తెచ్చుకోవాలని ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాను" అని తెలియజేశారు.  

గీతానంద్‌, నేహా సోలంకి, వాసంతి, కిరిటీ, ఆదిత్య మీన‌న్, మ‌ధుబాల‌,శుభ‌లేఖ‌ సుధాక‌ర్‌ త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రానికి  అభిషేక్ ఏ ఆర్ మ్యూజిక్ అందించారు.

Also Read: Lord Sri Ram Idol: అయోధ్య విగ్రహం.. రామయ్య నీరూపం చూడడానికి రెండు కళ్లు చాలవయ్యా

Also Read: Ram Mandir: అయోధ్యకు ప్రభాస్ 50 కోట్ల విరాళం…క్లారిటీ ఇచ్చిన టీమ్

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News