Extra Jabardasth Promo : అందరూ భజన అని అంటారు కానీ.. చిరు భక్తిని చాటుకున్న గెటప్ శ్రీను

Getup Srinu Emotional Comments on Chiranjeevi గెటప్ శ్రీను తాజాగా చిరంజీవి మీద తన భక్తిని చాటుకున్నాడు. గాడ్ ఫాదర్ గెటప్పులో కనిపించిన శ్రీను అందరినీ మెప్పించాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 26, 2022, 02:36 PM IST
  • మెగా అభిమానిగా గెటప్ శ్రీనుకు క్రేజ్
  • గాడ్ ఫాదర్ సినిమాలో జబర్దస్త్ శ్రీను
  • జబర్దస్త్ షోలో గెటప్ శ్రీను స్కిట్
Extra Jabardasth Promo : అందరూ భజన అని అంటారు కానీ.. చిరు భక్తిని చాటుకున్న గెటప్ శ్రీను

Getup Srinu Emotional Comments on Chiranjeevi : జబర్దస్త్ షోతో ఫేమస్ అయిన గెటప్ శ్రీను.. ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నాడు. స్వతహాగానే మెగా అభిమాని అయిన గెటప్ శ్రీను.. సందర్భం వచ్చినప్పుడల్లా చిరంజీవి గురించి గొప్పగా చెబుతుంటాడు. గెటప్ శ్రీను మెగా అభిమాని అని అందరికీ తెలిసిందే. చిరంజీవి పక్కన ఖైదీ నెంబర్ 150 సినిమాలో నటించాడు. మళ్లీ ఇప్పుడు గాడ్ ఫాదర్ సినిమాలో నటించాడు. గాడ్ ఫాదర్ సినిమా ప్రమోషన్స్‌లోనూ గెటప్ శ్రీను ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యాడు.

అంతే కాకుండా చిరంజీవితో పాటుగా స్పెషల్ ఫ్లైట్‌లో ఆయన పక్కనే కూర్చుని ప్రయాణించాడు గెటప్ శ్రీను. అనంతపురం ఈవెంట్, ముంబైలోని ఈవెంట్‌ కోసం చిరంజీవితో కలిసి గెటప్ శ్రీను వెళ్లాడు. అయితే గాడ్ ఫాదర్ స్పూప్‌ను గెటప్ శ్రీను చేసేందుకు ప్రయత్నించాడు. ఎక్స్ ట్రా జబర్దస్త్ ప్రోమోలో గెటప్ శ్రీను కాస్తా.. గాడ్‌ ఫాదర్‌లా కనిపించాడు. అచ్చం చిరంజీవిలానే గెటప్ శ్రీను మేకప్ వేసుకుని వచ్చాడు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News