GOAT: ఆ సినిమాని కాపీ కొట్టిన దళపతి విజయ్ GOAT..అదొక్కటే తేడా..!

GOAT review: దళపతి విజయ్ ఆఖరి సినిమాగా.. ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం GOAT.. ఈ మధ్యనే విడుదల అయింది. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ సినిమా ఒకవైపు మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంటూ ఉండగా.. మరొకవైపు సినిమాలోని క్లైమాక్స్ సీన్.. ఒక ఇంగ్లీష్ సినిమా నుంచి కాపీ చేశారు అంటూ.. సోషల్ మీడియాలో కొందరు సినిమాని ట్రోల్ చేస్తున్నారు. 

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Sep 9, 2024, 10:44 PM IST
GOAT: ఆ సినిమాని కాపీ కొట్టిన దళపతి విజయ్ GOAT..అదొక్కటే తేడా..!

GOAT climax scene: కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ హీరోగా.. వెంకట్ ప్రభు దర్శకత్వంలో ప్రేక్షకుల మందికి వచ్చిన సినిమా ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం GOAT. ఈ సినిమా తర్వాత విజయ్ రాజకీయాల్లో.. బిజీ కాబోతున్నారు. కాబట్టి విజయ్ కెరియర్ లో.. ఇది ఆఖరి సినిమా అని ఇప్పటికే ప్రకటించేశారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

అయితే సినిమా విడుదలైన మొదటి రోజు నుంచి.. మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంటోంది. విజయ్ ఫ్యాన్స్ కి సినిమా బాగానే అనిపించినప్పటికీ.. అనుకున్నంత రేంజ్ లో అయితే పాజిటివ్ టాక్ సినిమాకి.. రావడం లేదు. అయితే సినిమాలో ప్రేక్షకులకి నచ్చని కొన్ని పాయింట్లలో సినిమా క్లైమాక్స్ కూడా ఒకటి. సినిమా విడుదలైనప్పటి నుంచి సినిమా క్లైమాక్స్ సీన్ ఒక ఇంగ్లీష్ సినిమా నుంచి కాపీ చేసినట్లు ఉంది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.

2018 లో విడుదలైన ఫైనల్ స్కోర్ అనే..ఒక ఇంగ్లీష్ సినిమా లోని ఒక సన్నివేశం లాగా.. GOAT క్లైమాక్స్ సీన్ ఉంది అని టాక్ నడుస్తోంది. అయితే ఇంగ్లీష్ సినిమాలో బాస్కెట్ బాల్ స్టేడియం అయితే.. ఇక్కడ క్రికెట్ స్టేడియం గా మార్చారు. అంతేకాకుండా ఇక్కడ ఇండియన్ క్రికెట్ టీం మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ప్రస్తావన తీసుకువచ్చారు అని.. అవి తప్ప పెద్ద తేడా ఏమీ లేదు అని నెటిజన్లు తీవ్ర స్థాయిలో సినిమాని ట్రోల్ చేస్తున్నారు. 

ఇప్పటికే ఈ పోలికలకు సంబంధించిన వీడియోలు.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.  విజయ్ ఫ్యాన్స్ ఈ విషయంలో డైరెక్టర్ పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. మరి డైరెక్టర్ వెంకట్ ప్రభు ఈ విమర్శలపై ఎలా స్పందిస్తారో చూడాలి. ఈ క్లైమాక్స్ వివాదం సినిమా రిజల్ట్ మీద కూడా ప్రభావం చూపిస్తుంది అనే ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు.

మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో.. స్నేహ, ప్రభుదేవా, జయరామ్, ప్రసాద్, లైలా, మోహన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించిన.. ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు.

Also Read: Actor Vinayakan: వినాయక చవితి రోజే 'జైలర్‌' నటుడు వినాయకన్‌ అరెస్ట్‌..

Also Read: AP Floods Damage: ఆంధ్రప్రదేశ్‌కు కోలుకోలేని దెబ్బ.. వరదలతో రూ.6,880 కోట్ల నష్టం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News