God Father Movie: గాడ్ ఫాదర్ సెట్స్‌లో చిరంజీవి, స‌ల్మాన్ ఖాన్‌ను క‌లిసిన చిత్ర నిర్మాత‌లు ఆర్.బి. చౌదరి, ఎన్.వి. ప్రసాద్

Chiranjeevi, Salman Khan in God Father Movie sets: మెగాస్టార్ చిరంజీవి 153వ చిత్రం గాడ్ ఫాదర్. మోహన్ రాజా దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలింస్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ప్రస్తుతం ముంబైలో చిత్రీకరణ జరుపుకుంటోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 22, 2022, 08:53 PM IST
  • గాడ్ ఫాదర్ మూవీలో అతిధి పాత్రలో సల్మాన్ ఖాన్
  • చిరంజీవి, స‌ల్మాన్ ఖాన్‌పై తెర‌కెక్కిస్తున్న స‌న్నివేశాలు
  • పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న గాడ్ ఫాదర్ మూవీ
God Father Movie: గాడ్ ఫాదర్ సెట్స్‌లో చిరంజీవి, స‌ల్మాన్ ఖాన్‌ను క‌లిసిన చిత్ర నిర్మాత‌లు ఆర్.బి. చౌదరి, ఎన్.వి. ప్రసాద్

Chiranjeevi, Salman Khan in God Father Movie sets: మెగాస్టార్ చిరంజీవి 153వ చిత్రం గాడ్ ఫాదర్. మోహన్ రాజా దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలింస్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ప్రస్తుతం ముంబైలో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇటీవ‌లే బాలీవుడ్ సూప‌ర్‌ స్టార్ స‌ల్మాన్ ఖాన్ షూటింగ్‌లో జాయిన్ అయ్యారు. 'గాడ్ ఫాదర్ మూవీలో మీ ప్రజెన్స్ అనేది ప్రేక్షకులకు అద్భుతమైన కిక్‌ని ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు' అని చిరంజీవి ఈ సంద‌ర్భంగా పోస్ట్‌ చేశారు.

గాడ్ ఫాదర్ మూవీలో స‌ల్మాన్ ప‌వ‌ర్‌‌ఫుల్ పాత్ర‌ను పోషిస్తున్నారు. చిరంజీవి, స‌ల్మాన్ ఖాన్‌పై తెర‌కెక్కిస్తున్న స‌న్నివేశాలు చిత్రానికి హైలైట్‌గా నిలుస్తాయ‌ని చిత్ర‌యూనిట్ చెబుతోంది. తెలుగులో స‌ల్మాన్‌ఖాన్ న‌టించ‌డం ప్ర‌త్యేక‌త సంత‌రించుకుంది. ఇలా మెగాస్టార్ చిరంజీవి, స‌ల్మాన్ ఖాన్‌లు ఇద్ద‌రూ ఒకేచోట కనిపించ‌డం అభిమానుల‌కు పండుగే. సోమ‌వారంతో `గాడ్ ఫాదర్` ముంబై షెడ్యూల్ పూర్త‌యింది. త‌దుప‌రి షెడ్యూల్ త్వ‌ర‌లో తెలియ‌జేయ‌నున్నారు.

ఈ సంద‌ర్భంగా చిత్ర నిర్మాత‌లు ఆర్బీ చౌదరి, ఎన్.వి. ప్రసాద్ ముంబై సెట్లో మ‌ర్యాద‌పూర్వ‌కంగా చిరంజీవి, స‌ల్మాన్ ఖాన్‌ని క‌లిశారు. ఇందులో ద‌ర్శ‌కుడు మోహన్ రాజా కూడా వున్నారు. ఈ ఫొటోను చిత్ర యూనిట్ ఈరోజు విడుద‌ల చేసింది. పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరంజీవి పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో నయనతార కీలక పాత్ర పోషిస్తోంది. కొణిదెల సురేఖ సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని ఆర్‌బి చౌదరి, ఎన్‌వి ప్రసాద్‌లు సంయుక్తంగా నిర్మిస్తుండగా.. మోహన్ రాజా స్క్రీన్‌ప్లే, దర్శకత్వం వహిస్తున్నారు. చిరంజీవి సతీమణి కొణిదెల సురేఖ గాడ్ ఫాదర్ చిత్రాన్ని (God Father Movie) ప్రజెంట్ చేస్తున్నారు. ఫేమస్ మ్యూజిక్ కంపోజర్ ఎస్ఎస్. థమన్ మ్యూజిక్ అందిస్తుండగా.. నీరవ్ షా డివోపీ హ్యాండిల్ చేస్తున్నారు.

Also read:  Chiranjeevi-Venki kudumula Combo: పవర్‌పుల్ పాత్రలో మెగా స్టార్.. మళ్లీ ఠాగూర్ లాంటి రోల్

Also read : Nagababu on Niharika: నిహారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను డిలీట్ చేసింది నేనే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News