Godzilla X Kong The New Empire: మనుషుల రక్షణకు కలిసి వస్తున్న గాడ్జిల్లా, కాంగ్‌.. ట్రైలర్‌తో 'కొత్త సామ్రాజ్య'మే

Godzilla X Kong The New Empire Trailer Out: ఫాంటసీ సినిమాలను అభిమానించే భారతీయ సినీ ప్రియుల ముందుకు మరో సినిమా రాబోతున్నది. మానవజాతి సంరక్షణ కోసం యుద్ధం చేస్తున్న గాడ్జిల్లా, కాంగ్‌ ఈసారి కలిసి రానున్నాయి. ట్రైలర్‌ చూస్తే గూస్‌బంప్సే

Written by - Ravi Kumar Sargam | Last Updated : Feb 15, 2024, 07:17 PM IST
Godzilla X Kong The New Empire: మనుషుల రక్షణకు కలిసి వస్తున్న గాడ్జిల్లా, కాంగ్‌.. ట్రైలర్‌తో 'కొత్త సామ్రాజ్య'మే

Godzilla X Kong The New Empire Movie: భారతీయులు సినిమా ప్రియులు. కథ బాగుంటే చాలు.. భాష తెలియకుంటే చాలు చూసేస్తారు. అలాంటి భారతీయులకు హలీవుడ్‌ సినిమాలంటే పడి చస్తారు. ముఖ్యంగా సిరీస్‌లుగా వచ్చే సినిమాలను వదలకుండా చూస్తారు. అలాంటి కోవలకే చెందిన సినిమాలు 'గాడ్జిల్లా' సిరీస్‌. ఈ సినిమాల సిరీస్‌లో మరోటి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. తాజాగా 'గాడ్జిల్లా వర్సెస్‌ కాంగ్‌: ది న్యూ ఎంపైర్‌' అనే సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా ట్రైలర్‌ విడుదల కావడంతో మరింత ఆసక్తి రేపుతోంది.

Also Read: Amitabh Jaya Bachchan Assets: బాలీవుడ్‌ మెగాస్టార్‌ ఆస్తుల్లోనూ నంబర్‌వన్‌? ఆస్తులు, కార్లు, ఇతర వివరాలు ఇవిగో..

గాడ్జిల్లా వర్సెస్‌ కాంగ్‌ మొదటి సినిమాల 2021లో రాగా.. అందులో ఈ రెండు జీవులు పరస్పరం భీకరంగా తలపడ్డాయి. ఒకదానిపై ఒకటి పైచేయి సాధించడానికి పోరాడాయి. గాడ్జిల్లా నుంచి మానవ జాతిని రక్షించడంలో కాంగ్‌ తుదికి విజయం సాధించింది. ఇప్పుడు తాజాగా ది న్యూ అంపైర్‌లో గాడ్జిల్లా, కాంగ్‌ కలిసి వేరే జీవులతో పోరాడుతున్నట్లు ట్రైలర్‌లో కనిపిస్తోంది. బయటి జీవుల నుంచి పొంచి ఉన్న ముప్పును తప్పించడానికి ఈ రెండూ జీవులు కలిసి పోరాటం చేస్తున్నట్లు ట్రైలర్‌ ద్వారా తెలుస్తోంది.

Also Read: Tillu Square Trailer: టిల్లు అనే వాడు కారణజన్ముడు.. ఈసారి గట్టిగానే దెబ్బ తగిలేటట్టున్నది?

మానవాళిని రక్షించడానికి ప్రపంచమంతా మరోసారి గాడ్జిల్లా, కాంగ్‌ పోరాడేందుకు సిద్ధమయ్యాయి. కింగ్‌ కాంగ్‌ తన జాతికి చెందిన మరికొన్ని జీవులతో పోరాడాల్సిన అవసరం రావడంతో దానికి గాడ్జిల్లా సహాయం అందిస్తుంది. ప్రేక్షకులను అలరించేందుకు గాడ్జిల్లా వర్సెస్‌ కాంగ్‌ ది న్యూస్‌ అంపైర్‌ సిద్ధమవుతోంది. ఈ ట్రైలర్‌ను చూస్తుంటే మానవాళి రక్షణ కోసం గాడ్జిల్లా, కింగ్‌ కాంగ్‌ మరో భీకర యుద్ధం చేయనున్నాయి. మార్చి 29వ తేదీన థియేటర్‌లలో ఈ సినిమా సందడి చేయనుంది. 

ఆడమ్‌ విన్‌ గార్డ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాను లెజండరీ పిక్చర్స్‌, వార్నర్‌ బ్రదర్స్‌ పిక్చర్స్‌ నిర్మితమైంది. రెబెక్కా హాల్‌, బ్రియాన్‌ టైరీ హెన్నీ, డాన్‌ స్టీవెన్స్‌, కైలీ హాట్ల్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని ప్రధాన భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. ఇంగ్లీష్‌, మన దేశంలో హిందీ, తెలుగు, తమిళ్‌ తదితర భాషల్లో రూపొందుతోంది. ఈ సినిమాకు నేపథ్య సంగీతం గూస్‌బంప్స్‌ తెప్పిస్తోంది.
 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News