Gopichand - Bhimaa: గోపీచంద్ 'భీమా'గా వచ్చేది అపుడే.. రిలీజ్ డేట్ అఫీషియల్ ప్రకటన..

Gopichand - Bhima: మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'భీమా'. మరోసారి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తోన్న ఈ మూవీ రిలీజ్ డేట్‌ను తాజాగా ప్రకటించారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Jan 29, 2024, 06:09 PM IST
Gopichand - Bhimaa: గోపీచంద్ 'భీమా'గా వచ్చేది అపుడే.. రిలీజ్ డేట్ అఫీషియల్ ప్రకటన..

Gopichand - Bhima Release Date: గోపీచంద్ కెరీర్.. మూడడుగులు ముందుకు.. ఆరడుగులు వెనక్కి అన్నట్టు సాగుతోంది. ఒక హిట్టు వచ్చిందని సంతోషించే లోపు మూడు ఫ్లాపులతో రేసులో వెనకబడుతున్నాడు. వరుస ఫ్లాపులున్న తన కున్న మాస్ యాక్షన్ ఇమేజ్ కారణంగా టాలీవుడ్‌లో హీరోగా సత్తా చాటుతూనే ఉన్నారు. సీటీమార్ తర్వాత ఎన్నో అంచనాల మధ్య విడుదలైన మారుతి 'పక్కా కమర్షియల్‌' మూవీ పెద్దగా అలరించలేకపోయింది. ఆ తర్వాత చేసిన 'రామబాణం' కూడా పెద్దగా ఆడలేదు. దీంతో ఇపుడు కొత్త దర్శకుడు హర్ష  డైరెక్షన్‌లో 'భీమా' సినిమా చేస్తున్నారు.

ఈ మూవీలో గోపీచంద్ మరోసారి పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. మరోవైపు 'భీమా' టైటిల్‌తోనే ఈ మూవీపై మాస్ వైబ్రేట్స్ క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. మరోవైపు ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా ఓ రేంజ్‌లో మాస్‌ను మెప్పించే విధంగా ఉంది. ఈ మూవీతో మరోసారి గోపీచంద్ బ్యాక్ బౌన్స్ అవుతాడా అనేది చూడాలి.

ఈ సంగతి పక్కన పెడితే.. గోపీచంద్ నటిస్తోన్న ఈ మూవీని మార్చి 8న మహా శివరాత్రి కానుకగా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ మూవీ శ్రీసత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. ఈ మూవీలో నాగ చైతన్య 'ధూత' ఫేమ్ ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటిస్తోంది. అంతేకాదు మాళవిక శర్మ, నిహారిక కొణిదెల కూడా నటిస్తున్నారు. ఈ చిత్రానికి కేజీఎఫ్, సలార్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందిస్తారు. ముఖ్యంగా పరీక్షల సీజన్‌లో విడుదల కాబోతన్న ఈ మూవీ గోపీచంద్‌కు మరో పవర్ఫుల్ కమ్ బ్యాక్ మూవీగా నిలుస్తుందా లేదా అనేది చూడాలి.

Also Read: India Vs Eng: ఉప్పల్‌లో భారత జట్టుకు తీవ్ర నిరాశ.. టామ్ హార్ట్‌లేకు హార్ట్‌ లేదబ్బా

Also Read: Bottole Thrash: 'బాటిల్‌' కోసం చెప్పుతో కొట్టిన ప్రముఖ గాయకుడు.. నెట్టింట్లో తీవ్ర దుమారం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News