Parakramam: గల్లీ క్రికెట్ నేపథ్యం లో పరాక్రమం… సమ్మర్ లో విడుదలకు సిద్ధం

Gully Cricket: క్రికెట్ నేపథ్యంలో వచ్చే సినిమాలు దాదాపు తెలుగు ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకుంటూ ఉంటాయి. ప్రస్తుతం గల్లీ క్రికెట్ నేపథ్యంలో పరాక్రమం అనే సినిమా త్వరలోనే తెలుగు ప్రేక్షకుల ముందుకి వచ్చి అలరిచ్చనుంది

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 14, 2024, 03:47 PM IST
Parakramam: గల్లీ క్రికెట్ నేపథ్యం లో పరాక్రమం… సమ్మర్ లో విడుదలకు సిద్ధం

Parakramam: క్రికెట్ నేపథ్యంలో వచ్చే సినిమాలు ఇష్టపడే ప్రేక్షకులకు మరో చిత్రం త్వరలోనే వచ్చి మెప్పించనుంది. గల్లీ క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కుతున్న 'పరాక్రమం' అనే సినిమా ఈ సంవత్సరం 2024 సమ్మర్ లో విడుదలకు సిద్ధం అవుతోంది.

గతం లో డిజిటల్ ప్లాట్ ఫామ్స్ లో విడుదల అయిన 'మాంగల్యం' చిత్రం బండి సరోజ్ కుమార్ కి మంచి పేరు సంపాదించి పెట్టింది. ఇప్పుడు ఆయన చిత్రం పరాక్రమం  గల్లీ క్రికెట్ నేపథ్యంలో వచ్చి అలరించబోతోంది.
బండి సరోజ్ కుమార్ పరాక్రమం చిత్రంలో హీరో గా నటించడమే కాకుండా దర్శకత్వం, సంగీతం, ఎడిటింగ్, రచన, పాటలు.. అలానే నిర్మాతగా కూడా వ్యవహరించారు. ఈ చిత్రం లో శాస్త్రీయ నృత్య కళాకారిణి శృతి సమన్వి తో పాటు..నాగ లక్ష్మి హీరోయిన్లుగా నటిస్తున్నారు.

గతంలో తన మూడు సినిమాలు డిజిటల్ లో ‘వాచ్ అండ్ పే’ (డబ్బు కట్టి సినిమా చూసే పద్ధతి) ద్వారా విడుదల చేసి, మంచి సక్సెస్ సాధించారు, ఇప్పుడు ఈ పరాక్రమం చిత్రాన్ని థియేటర్ లో తన సొంత బ్యానర్ బి ఎస్ కె మెయిన్ స్ట్రీమ్ ద్వారా విడుదల చేయబోతున్నారు.  ఈ సినిమా గురించి మరో చెప్పుకోదగిన విషయం ఏమిటి అంటే 50 మంది నూతన నటి నటులు పరిచయం కాబోతున్నారు. 

పౌర్ణమి, 100% లవ్ లాంటి చిత్రాలకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన వెంకట్ ఆర్ ప్రసాద్ పరాక్రమం చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తుందా కాళీ ఎస్ ఆర్ అశోక్ సౌండ్ డిజైన్ చేస్తున్నారు. ఈ షూటింగ్ అంత పూర్తి అయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీ గా ఉంది. త్వరలో ఈ సినిమా టీజర్ విడుదల చేసి ఈ సంవత్సరం సమ్మర్ లో ఈ సినిమాని విడుదల చేయడానికి ప్రయత్నిస్తున్నారు.

ఈ చిత్రంలో బండి సరోజ్ కుమార్, శృతి సమన్వి, నాగ లక్ష్మి, మోహన్ సేనాపతి, అనిల్ కుమార్,వంశీ రాజ్ నెక్కంటి, నిఖిల్, కృష్ణ వేణి, కిరీటి, శశాంక్ వెన్నెలకంటి, వసుంధర, అలీషా కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

Also Read: Chalo Nalgonda: రెచ్చిపోయిన కాంగ్రెస్‌ కార్యకర్తలు.. కేటీఆర్‌, హరీశ్ రావు బస్సుపై కోడిగుడ్లతో దాడి

Also Read: KTR Viral Tweet: శభాష్‌ బావ.. అసెంబ్లీలో దుమ్ము దులిపిన హరీశ్ రావుకు కేటీఆర్‌ ప్రశంసలు

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News