Nagarjuna N Convention Worth: 10 ఏళ్లలో నాగార్జున ఎన్-కన్వెన్షన్ మీద అందుకున్న ఆదాయం ఏంటంటే..!

N Convention Demolition: మాదాపూర్ లో నాగార్జున కి చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేత గురించి ఇండస్ట్రీలో ఇప్పటికీ చర్చ నడుస్తూనే ఉంది. కానీ కూల్చివేయకముందు వరకు.. నాగార్జున ఈ ప్రాపర్టీ మీద ఎన్ని కోట్లు సంపాదించారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. దీనికి సంబంధించిన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక్క ప్రాపర్టీ తో నాగ్ ఇంత సంపాదించారా.. అని అందరూ షాక్ అవుతున్నారు.

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Aug 26, 2024, 12:13 PM IST
Nagarjuna N Convention Worth: 10 ఏళ్లలో నాగార్జున ఎన్-కన్వెన్షన్ మీద అందుకున్న ఆదాయం ఏంటంటే..!

Nagarjuna N Convention Center worth: హైదరాబాద్ మాదాపూర్ లో తుమ్మిడి కుంట చెరువు వద్ద టాలివుడ్ కింద నాగార్జున కి ఒక ప్రాపర్టీ ఉన్న సంగతి తెలిసిందే. ఎన్ కన్వెన్షన్ సెంటర్ నాగార్జున పేరు మీదే ఉంది. 2011, 2012 ఆ సమయంలో ఎన్ కన్వెన్షన్ మొదలైంది. మొదటి నుండే భారీ ఫంక్షన్ లకి కేర్ ఆఫ్ అడ్రెస్స్ గా ఉండే ఎన్ కన్వెన్షన్ మీద నాగార్జున ఎంత సంపాదించారు అనేది ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది.

వివరాల్లోకి వెళితే తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి ఈమధ్యనే హైడ్రా బృందం ఏర్పాటు చేసి.. వారితో హైదరాబాద్ మొత్తం మీద ఆక్రమించిన భూములను తిరిగి వెనక్కి తీసుకుంటున్నారు. ఆల్రెడీ నిర్మిత భవనాలు ఉంటే.. ఆ భవనాలను కూల్చివేసి మరీ కబ్జా భూమిని స్వాధీనం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే హైడ్రా బృందం ఎన్ కన్వెన్షన్ ను కూల్చేసింది. తుమ్మిడికుంట చెరువుని ఆక్రమించి అక్కడ దీన్ని నిర్మించారు అని టాక్.

అయితే నాగార్జున ఇది పట్టా భూమి అని.. ఇంకా కోర్టులో ఉంది అని ఎన్ని చెబుతున్నా కూడా.. జరగాల్సిన నష్టం అయితే జరిగిపోయింది. అయితే 2012 నుండి ఇప్పటిదాకా అంటే గడిచిన 12 ఏళ్లలో నాగార్జున ఈ భూమి మీద ఎంత సంపాదించారో తెలుసా? అక్షరాలా మూడు వేల కోట్లు అని సమాచారం.
గత కొద్ది రోజులుగా ఈ వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా నడుస్తోంది.

హైదరాబాద్ లో ఉన్న పెద్ద ఫంక్షన్ హాల్స్ లో ఒకటి అయిన ఎన్ కన్వెన్షన్ లో బర్త్డే పార్టీలు, నుండి పెద్దపెద్ద పెళ్లిళ్ల దాకా ఇక్కడ చాలా ఈవెంట్లు జరిగాయి. ఇలా ఒక్కో ఈవెంట్ కి మినిమం లక్ష రూపాయల నుంచి 15 లక్షల వరకు వస్తూనే ఉంటుంది. ఇలా ఈ 10, 12 ఏళ్లలో నాగార్జున ఎన్ కన్వెన్షన్ ద్వారా అక్షరాల 3000 కోట్ల దాకా సంపాదించారని టాక్. ఈ వార్త ఇప్పుడు అందరినీ షాక్ కి గురి చేసింది.

Also Read:  చిరంజీవిని మెగాస్టార్ ను చేసిన టాప్ మూవీస్ ఇవే..

Also Read: ‘భోళా శంకర్’సహా చిరు కెరీర్ లో రాడ్ రంబోలా మూవీస్ ఇవే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

Trending News