ప్రముఖ బాలీవుడ్ మ్యూజిక్ కంపోజర్, సింగర్ హిమేష్ రేషమ్మియా తన గాళ్‌ఫ్రెండ్ సోనియా కపూర్‌ని పెళ్లి చేసుకోనున్నాడు. శుక్రవారం ముంబైలోని సొంత నివాసంలో అత్యంత సమీప బంధువులు, సన్నిహితమిత్రుల మధ్య ఈ వివాహ వేడుక జరగనుంది. అనంతరం రాత్రి రిసెప్షన్ ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. గత కాలంగా డేటింగ్లో వున్న ఈ జంట ఇప్పుడు వివాహబంధం ద్వారా ఒక్కటవబోతోంది. హిమేష్ రేషమ్మియాకు 24 ఏళ్ల క్రితమే మొదటిసారి పెళ్లి జరగ్గా రెండేళ్ల క్రితం ఇరువురూ పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. మొదటి భార్య కోమల్ ద్వారా హిమేష్ రేషమ్మియాకు ఓ కొడుకు కూడా వున్నాడు. ఇప్పుడు హిమేష్ రేషమ్మియా పెళ్లి వేడుకలోనూ అతడి కొడుకు సందడే ప్రత్యేకం అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు.
ప్రముఖ బాలీవుడ్ సినీ విశ్లేషకులు తరణ్ ఆదర్శ్ సైతం హిమేష్ రేషమ్మియా పెళ్లి గురించి ఓ ట్వీట్ చేశాడు.
ఈ మే నెల బాలీవుడ్ జంటల పెళ్లిళ్లకు బాగా కలిసొచ్చినట్టుంది. మొన్నటికిమొన్న 8వ తేదీన సోనమ్ కపూర్-ఆనంద్ అహుజ పెళ్లి జరిగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత నిన్న మే 10వ తేదీన బాలీవుడ్ నటి నేహా దూపియా తన బాయ్ ఫ్రెండ్ అంగడ్ బేడీని పెళ్లి చేసుకోగా తాజాగా మే 11న హిమేష్ రేషమ్మియా కూడా తన గాళ్‌ఫ్రెండ్ సోనియా కపూర్‌తో పెళ్లికి రెడీ అయ్యాడు.