Hrithik Roshan Fighter: ఫైటర్ 3 డేస్ బాక్సాఫీస్ కలెక్షన్స్.. మొత్తంగా వచ్చింది ఎంతంటే..?

Fighter Collections: సిద్ధార్ధ్ ఆనంద్ దర్శకత్వంలో  హృతికో రోషన్, దీపికా పదుకొణే హీరోయిన్‌గా నటించిన మూవీ 'ఫైటర్'. దేశ భక్తి ప్రధాన ఇతివృత్తంతో తెరకెక్కిన ఈ మూవీ రిపబ్లిక్ డే కానుకగా విడుదలై మంచి టాక్‌తో దూసుకుపోతుంది.  

Written by - TA Kiran Kumar | Last Updated : Jan 28, 2024, 08:04 PM IST
Hrithik Roshan Fighter: ఫైటర్ 3 డేస్ బాక్సాఫీస్ కలెక్షన్స్.. మొత్తంగా వచ్చింది ఎంతంటే..?

Fighter Collections: ప్రస్తుతం బాలీవుడ్‌లో దేశ భక్తి నేపథ్య చిత్రాలు వరుసగా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చిన వచ్చిన మరో దేశభక్తి చిత్రం 'ఫైటర్'. సిద్దార్ధ్ ఆనంద్ దర్శకత్వకలో తరకెక్కిన ఈ మూవీ తొలి రోజు అనుకున్నంత రేంజ్‌లో మెప్పించలేకపోయింది. కానీ రెండో రోజు నుంచి ఈ మూవీ మంచి వసూళ్లనే రాబట్టింది. అది మూడో రోజు కూడా కంటిన్యూ అయింది. హృతిక్ రోషణ్, సిద్ధార్ధ్ ఆనంద్ కలయికలో గతంలో వచ్చిన 'బ్యాంగ్ బ్యంగ్', 'వార్' చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలవడంతో 'ఫైటర్' మూవీపై భారీ అంచనాలతో విడుదలయ్యాయి. ఈ మూవీలో హృతిక్ రోషన్ సరసన దీపికా పదుకొణే నటించడం విశేషం. అనిల్ కపూర్ మరో ముఖ్యపాత్రలో నటించారు. ఈ చిత్రాన్ని వయాకామ్ 18 నిర్మించింది.

గణతంత్ర దినోత్సవ కానుకగా ఈ నెల 25న ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా భారీ ఎత్తున రిలీజైంది. ఈ సినిమాలో హృతిక్ రోషన్ భారత్ ఎయిర్ ఫోర్స్ అధికారి పాత్రలో నటించారు. అంతేకాదు ఈ సినిమా మన దేశంలో తొలి ఏరియల్ యాక్షన్ ఫిల్మ్‌గా తెరకెక్కింది. గాల్లో ఫైట్స్ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగించాయి. ఈ మూవీని పుల్వామాలో మన దేశ సైనికులపై దాడి చేసిన పాకిస్థాన్ ముష్కర మూకలను పీచ మణచడానికి మన సైనికులు పాక్ భూభాగంలోకి వెళ్లి చేసిన సర్జికల్ స్ట్రైక్ ఆధారంగా తెరకెక్కించారు. పాకిస్థాన్ పై చేసిన రెండో సర్జికల్ స్ట్రైక్. మొదటిసారి పఠాన్ కోట్ దాడి తర్వాత.. రెండోసారి మన సైనికలు వాళ్ల భూభాగంలోకి వెళ్లి చేసిన మెరుపు దాడి. ఈ రెండింటి కంటే మ్యాన్‌మార్‌లో చేసిన సర్జికల్ స్ట్రైక్ కూడా దేశ చరిత్రలో నిలిచిపోయింది.

ఈ మూవీ గురువారం .. రూ. 24.60 కోట్ల నెట్ వసూళ్లు.. శుక్రవారం.. రూ. 41.20 కోట్లు.. రూ. శనివారం రూ. 27.60 కోట్లు.. ఓవరాల్‌గా మూడు రోజుల్లో ఈ మూవీ రూ. 93.40 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టింది. నాల్గో రోజు ఆదివారం కూడా మంచి వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది. ఓవరాల్‌గా వీకెండ్ పూర్తయ్యే సరికి ఈ మూవీ రూ. 130 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టే అవకాశాలున్నాయి.

ఓవరాల్‌గా ఈ మూవీ ఏ మేరకు బాక్సాఫీస్ దగ్గర పర్ఫామ్ చేస్తుందో చూడాలి. ఈ మూవీని వయాకామ్ 18 సంస్థ మార్‌ఫ్లిక్స్ సంస్థ‌తో పాటు సిద్ధార్ధ్ ఆనంద్ ఈ సినిమాకు సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం మన దేశంలో తొలి ఏరియల్ ఫ్రాంఛైజీ మూవీగా రానుంది. ఈ చిత్రాన్ని అత్యాధునిక టెక్నాలజీతో ఎంతో ఉన్నతంగా తెరకెక్కించారు. ఈ మూవీలో గ్రాఫిక్స్ కీ రోల్ ప్లే చేసాయనే చెప్పాలి.

ఈ చిత్రాన్ని కేవలం హిందీలో మాత్రమే విడుదల చేస్తున్నారు. ఆ సంగతి పక్కన పెడితే.. ఈ చిత్రాన్ని మన దేశంతో పాటు విదేశాల్లో విడుదల చేస్తున్నారు. దేశ భక్తి నేపథ్యంలో దాయాది దేశం పాకిస్థాన్ పై చేసిన సర్జికల్ దాడుల నేపథ్యంలో తెరకెక్కడంతో ఈ మూవీని కొన్ని మిడిల్ ఈస్ట్  ఇస్లామిక్ దేశాలైన పాకిస్థాన్‌లో పాటు ఇరాన్, సిరియా, సౌదీ అరేబియా దేశాలు ఈ మూవీ రిలీజ్ పై బ్యాన్ విధించాయి. ఒక్క యునైడెట్ అరబ్ ఎమిరేట్స్‌లో మాత్రమే ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. మరి ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి మాయ చేస్తుందో చూడాలి. ఇక హృతిక్ రోషన్.. మరోవైపు ఎన్టీఆర్‌తో కలిసి 'వార్ 2' మూవీ చేస్తున్నారు. యశ్ రాష్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ బ్యానర్ పై వస్తోన్న ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకుడు. ఇంకైవైపు హృతిక్ తన తండ్రి రాకేష్ రోషన్ దర్శకత్వంలో ‘క్రిష్ 4’ మూవీ చేయనున్నారు. 

ఇదీ చదవండి: మీపేరు ఈ 2 అక్షరాలతో మొదలవుతుందా? అయితే, మీలవ్ బ్రేకప్..

ఇదీ చదవండి:  ఇంట్లో ఈ దిక్కున అద్దం పెడితే అదృష్టం.. ఆ ఇంట్లోవారికి ప్రతి పనిలో విజయం..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News