Hrithik Roshan - Fighter: గత కొన్నేళ్లుగా బాలీవుడ్లో దేశ భక్తి నేపథ్యంలో చాలా చిత్రాలు వస్తున్నాయి. ఈ రూట్లోనే వచ్చిన సినిమానే ఫైటర్. సిద్ధార్ధ్ ఆనంద్ దర్శకత్వంలో హృతిక్ రోషన్, దీపికా పదుకొణే హీరోయిన్గా నటించారు. అనిల్ కపూర్ మరో ప్రధాన పాత్రలో నటించారు. దేశ భక్తి ప్రధాన ఇతివృత్తంతో తెరకెక్కిన ఈ మూవీ రిపబ్లిక్ డే కానుకగా విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది. అయితే టాక్‌కు తగ్గట్టు ఈ సినిమా మంచి వసూళ్లను సాధించలేకపోయింది.
కానీ సెకండ్ వీకెండ్ వచ్చే వరకు ఈ సినిమా వసూళ్లతో గ్రోత్ కనిపిస్తోంది. తాజాగా ఈ శుక్రవారం భారతీయ బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా రూ.6 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టింది. ఇక నిన్న శనివారం రూ. 11 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టి ట్రేడ్ వర్గాలను ఆశ్యర్యపరిచింది. ఈ రోజు ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మరిన్ని వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది. ఓవరాల్‌గా రూ. 15 కోట్ల వరకు నెట్ వసూళ్లను రాబట్టే అవకాశాలున్నాయి.
ఫైటర్ మూవీ విషయానికొస్తే.. ఈ మూవీ ఫస్ట్ డే అనుకున్నంత రేంజ్లో వసూళ్లను రాబట్టలేకపోయింది. కానీ రెండో రోజు మంచి కలెక్షన్స్ రాబట్టింది. అది మూడో రోజు కూడా కంటిన్యూ అయింది. హృతిక్ రోషణ్, సిద్ధార్ధ్ ఆనంద్ కలయికలో గతంలో వచ్చిన 'బ్యాంగ్ బ్యంగ్', 'వార్' చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలవడంతో 'ఫైటర్' మూవీపై భారీ అంచనాలతో విడుదలైంది. ఈ మూవీలో హృతిక్ రోషన్ సరసన తొలిసారి దీపికా పదుకొణే నటించింది. అనిల్ కపూర్ మరో ముఖ్యపాత్రలో నటించారు. ఈ చిత్రాన్ని వయాకామ్ 18 నిర్మించింది.
గణతంత్ర దినోత్సవ కానుకగా ఈ నెల 25న ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా భారీ ఎత్తున రిలీజైంది. ఈ సినిమాలో హృతిక్ రోషన్ భారత్ ఎయిర్ ఫోర్స్ అధికారి పాత్రలో మెప్పించారు. అంతేకాదు ఈ సినిమా మన దేశంలో తొలి ఏరియల్ యాక్షన్ ఫిల్మ్‌గా తెరకెక్కింది. గాల్లో ఫైట్స్ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగించాయి. ఈ మూవీని పుల్వామాలో మన దేశ సైనికులపై దాడి చేసిన పాకిస్థాన్ ముష్కర మూకలను పీచమణచడానికి మన సైనికులు పాక్ భూభాగంలోకి వెళ్లి చేసిన సర్జికల్ స్ట్రైక్ ఆధారంగా తెరకెక్కించారు. పాకిస్థాన్ పై చేసిన రెండో సర్జికల్ స్ట్రైక్. మొదటిసారి పఠాన్ కోట్ దాడి తర్వాత.. రెండోసారి మన సైనికలు వాళ్ల భూభాగంలోకి వెళ్లి చేసిన మెరుపు దాడి. ఈ రెండింటి కంటే మ్యాన్మార్లో చేసిన సర్జికల్ స్ట్రైక్ కూడా దేశ చరిత్రలో నిలిచిపోయింది.
ఫస్ట్ వీక్ ఓ మోస్తరు వసూళ్లను రాబట్టిన ఈ సినిమా .. రెండో వీకెండ్లో మంచి వసూళ్లనే రాబడుతోంది. ఓవర్సీస్లో ఇప్పటికే $5 మిలియన్ యూఎస్ డాలర్స్‌ను కలెక్ట్ చేసి ఔరా అనిపించింది. మొత్తంగా ఈ సినిమా భారతీయ బాక్సాఫీస్ దగ్గర రూ. 180 కోట్ల నెట్ వసూళ్లు.. వరల్డ్ వైడ్‌గా రూ. 350 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్టు సమాచారం. విదేశీ ప్రేఓకులు ఈ సినిమాను చూసి ప్రశంసలు కురిపిస్తున్నారు. అక్కడ మరో రెండు మిలియన్ డాలర్స్ వరకు కలెక్ట్ చేసే అవకాశాలున్నాయి. ఓవరాల్‌గా భారతీయ ప్రేక్షకులను అంతగా చూడని ఈ సినిమా ఓవర్సీస్ ఆడియన్స్‌ను మాత్రం తెగ ఆదరిస్తన్నారు.
మొత్తంగా ఈ మూవీ ఏ మేరకు బాక్సాఫీస్ దగ్గర పర్ఫామ్ చేస్తుందో చూడాలి. ఈ మూవీని వయాకామ్ 18 సంస్థ మార్ఫ్లిక్స్ సంస్థ నిర్మించింది. సిద్ధార్ధ్ ఆనంద్ ఈ సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రం మన దేశంలో తొలి ఏరియల్ ఫ్రాంఛైజీ మూవీగా వచ్చింది. ఈ చిత్రాన్ని అత్యాధునిక టెక్నాలజీతో ఎంతో ఉన్నతంగా తెరకెక్కించారు. ఈ మూవీలో గ్రాఫిక్స్ కీ రోల్ ప్లే చేసాయి.
ఈ చిత్రాన్ని కేవలం హిందీలో మాత్రమే విడుదల చేసారు. ఆ సంగతి పక్కన పెడితే.. ఈ చిత్రాన్ని మన దేశంతో పాటు విదేశాల్లో విడుదల చేస్తున్నారు. దేశ భక్తి నేపథ్యంలో దాయాది దేశం పాకిస్థాన్ పై చేసిన సర్జికల్ దాడుల నేపథ్యంలో తెరకెక్కడంతో ఈ మూవీని కొన్ని మిడిల్ ఈస్ట్ ఇస్లామిక్ దేశాలైన పాకిస్థాన్‌లో పాటు ఇరాన్, సిరియా, సౌదీ అరేబియా దేశాలు ఈ మూవీ రిలీజ్ పై బ్యాన్ విధించాయి. ఒక్క యునైడెట్ అరబ్ ఎమిరేట్స్‌లో మాత్రమే ఈ మూవీ రిలీజ్ అయింది. ఇక హృతిక్ రోషన్ సినిమాల విషయానికొస్తే.. ఈయన ఎన్టీఆర్‌తో కలిసి 'వార్ 2' మూవీ చేస్తున్నారు. యశ్ రాష్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ బ్యానర్ పై వస్తోన్న ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకుడు. మార్చిలో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ పాల్గొనే సీన్స్ షూట్ చేయనున్నారు. మరో వైపు హృతిక్ తన తండ్రి రాకేష్ రోషన్ దర్శకత్వంలో ‘క్రిష్ 4’ మూవీ చేయనున్నారు.
ఇదీ చదవండి: Bharata Ratna: భారతరత్న ప్రదానం చేయడానికి ప్రమాణాలు ఏమిటి? అవార్డు గ్రహీతలు ఎలాంటి సౌకర్యాలు పొందుతారు?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook