Payal Rajput: ఇతర మహిళలకు లేనిది నేను చూపించినా.. హాట్ వీడియోపై ఫైర్ అయిన పాయల్‌ రాజ్‌పుత్‌!!

సోషల్ మీడియాలో పాయల్‌ రాజ్‌పుత్‌ ఎద అందాలపై నెటిజన్లు దారుణంగా కామెంట్లు చేశారు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తనకు ఎదురైన చేదు అనుభ‌వం గురించి మాట్లాడింది. ఈ సంఘటన తనను తీవ్ర ఆవేదనకు గురిచేసిందని, ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాను తెరవడానికి కూడా భయపడ్డానని తెలిపింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 6, 2021, 11:19 AM IST
  • పాయల్‌ రాజ్‌పుత్‌ ఎద అందాలపై కామెంట్లు

  • ఇతర మహిళలకు లేనిది నేను చూపించినా
  • హాట్ వీడియోపై ఫైర్ అయిన పాయల్‌ రాజ్‌పుత్‌
Payal Rajput: ఇతర మహిళలకు లేనిది నేను చూపించినా.. హాట్ వీడియోపై ఫైర్ అయిన పాయల్‌ రాజ్‌పుత్‌!!

Payal Rajput slams netizens over her hot video goes viral: 'RX 100' సినిమాతో టాలీవుడ్‌కు పరిచమైన భామ పాయల్‌ రాజ్‌పుత్‌ (Payal Rajput). తొలి సినిమాలోనే లిప్ లాక్, అందాల ఆరబోతతో కుర్రాళ్ల గుండెల్లో రైళ్లు పరుగెత్తించింది. ఆ తర్వాత డిస్కో రాజా, వెంకీ మామ, ఆర్డీఎక్స్ 100, అనగనగా ఓ అతిథి లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. సినిమాల్లోనే కాదు సోషల్ మీడియాలో కూడా పాయల్‌ హాట్ హాట్ ఫొటోలతో రచ్చచేస్తోంది. క్రమంలో తాజాగా ఓ ఫొటో షూట్ (Photoshoot) చేస‌స్తున్న స‌మ‌యంలో ఆమెకు ఓ చేదు అనుభ‌వం ఎదురైంది. ఆ షూట్‌లో పాయల్ బ్రా వేసుకోకుండా.. కేవలం కోటుతో రచ్చచేసింది. వీడియో తీసిన స‌మ‌యంలో కోటు ప‌క్క‌కు త‌ప్పుకోవ‌డం ఆమె ఎద అందాలు కాస్త బయటపడ్డాయి. ఆ వీడియో నెట్టింట తెగ వైర‌ల్ అయింది. 

సోషల్ మీడియాలో పాయల్‌ రాజ్‌పుత్‌ (Payal Rajput) ఎద అందాలపై నెటిజన్లు దారుణంగా కామెంట్లు చేశారు. అంతేకాదు మీమ్స్ కూడా చేశారు. శృతిమించిన అందాల ప్రదర్శన అంటూ సోషల్‌ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్‌ జరిగింది. దాంతో పాయల్‌ ఆ వీడియోను డిలీట్ చేసింది. అయితే అప్పటికే కొందరు ఆ వీడియోను డౌన్ లోడ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. ఇంకేముంది గత 3-4 రోజులుగా ఎవరిని కదిలించినా ఆ వీడియోపైనే మాట్లాడుకున్నారు. ఆదివారం (డిసెంబ‌ర్ 5) పాయ‌ల్ పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తనకు ఎదురైన చేదు అనుభ‌వం గురించి మాట్లాడింది. ఈ సంఘటన తనను తీవ్ర ఆవేదనకు గురిచేసిందని, ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాను తెరవడానికి కూడా భయపడ్డానని తెలిపింది. 

Also Read: India Russia Summit 2021: నేడు భారత్-రష్యా వార్షిక ద్వైపాక్షిక సదస్సు-కీలక ఒప్పందాలకు ఛాన్స్

'నేను గత 4-5 రోజులుగా నా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను ఓపెన్ చేయ‌డానికి భ‌య‌ప‌డ్డాను. చాలామంది వీడియోపై చెత్త కామెంట్స్ చేశారు. నాది సున్నిత మనస్తత్వం. చెడుగా మాట్ల‌డే ప్ర‌తి మాట నాకు ఇబ్బందిగా ఉంటుంది. నాకు సంబంధించిన ఫొటోలు గ్రూప్స్‌లో వైర‌ల్ కావ‌డం చూసి క‌ల‌త చెందాను. ఇలాంటి వ్యతిరేక ప్రచారం నా కుటుంబంపై ప్రభావం చూపిస్తుంది. సోషల్‌ మీడియాలో ట్రోల్స్‌ చూసిన నా పేరెంట్స్‌ అన్నీ వదిలేసి ఇంటికి తిరిగొచ్చేయ్‌ అని అన్నారు. ముఖ్యంగా మా అమ్మ చాలా బాధపడింది. ఈ దుష్ప్రచారం నా కెరీర్‌ను ఏమీ చేయలేదని వాళ్లకు దైర్యం చెప్పా' అని పాయల్‌ రాజ్‌పుత్‌ తెలిపింది. 

Also Read: Telangana:నేడు బీజేపీ గూటికి తెలంగాణ ఉద్యమ నేత విఠల్-రేపు తీన్మార్ మల్లన్న?

'నేను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన ఒరిజినల్‌ వీడియోలో ఎలాంటి అసభ్యత కనిపించలేదు. ఎవరో ఎడిట్‌ చేయని వీడియోను సోషల్‌ మీడియాలో వైరల్‌ చేశారు. వ్యక్తులు ఇంతలా దిగజారి పోతారని అసలు ఊహించలేదు. కోటు ప‌క్క‌కు జ‌ర‌గ‌డం వ‌ల్ల ఎద అందాలు క‌నిపించాయి. అదేదో కావాల‌నే చేసిన నేరంలాగా చూస్తున్నారు. అందరూ తమ జీవితంలో ఎద అందాల‌ను ఇదివ‌ర‌కు ఎప్పుడూ చూడ‌న‌ట్లుగా మాట్లాడుకుంటున్నారు. ఇత‌ర స్త్రీల‌లో లేనిది నా ద‌గ్గ‌ర ఏముందా?, ఇతర మహిళలకు లేనిది నేను చూపించినా?' అని పాయల్‌ రాజ్‌పుత్‌ (Payal Rajput) ఆవేదన వ్యక్తం చేసింది. ఇలాంటి కిష్ట పరిస్థితులు ఎన్ని ఎదురైనా కెరీర్‌లో రాణించడంపైనే దృష్టిపెడుతుతా అని పాయల్ ధీమా వ్యక్తం చేసింది. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
 

Trending News