IBomma Warning Latter: ఐబొమ్మ (IBomma) గురించి మూవీ లవర్స్‌కు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. థియేటర్, ఓటీటీలోకి వచ్చిన మూవీ క్షణాల్లో ఈ సైట్‌లో ప్రత్యక్షం అవుతుంది. ఈ సైట్‌లో ఎవరు అప్‌లోడ్ చేస్తున్నారో.. ఎక్కడి నుంచి అప్‌లోడ్ చేస్తున్నారో తెలియదు గానీ.. విడుదలైన ప్రతి సినిమా కొన్ని గంటల వ్యవధిలోనే ఐబొమ్మలో ఉంటుంది. ఓటీటీలో రిలీజ్ అయిన సినిమాలు ఐబొమ్మలో చూడొచ్చు. ఈ వెబ్‌సైట్‌ను ఎన్నిసార్లు బ్లాక్ చేసినా.. కొత్త డోమైన్లతో నిర్వాహకులు రన్ చేస్తునే ఉన్నారు. నిర్మాతలకు కోట్లలో నష్టం వస్తుండడంతో టాలీవుడ్ ఐబొమ్మపై ఫోకస్ పెట్టింది. దీంతో ఐబొమ్మ పేరుతో వార్నింగ్ లెటర్ వైరల్ అవుతోంది. తమ జోలికి వస్తే సీరియస్ రియాక్షన్ ఉంటుందని టాలీవుడ్ ఇండస్ట్రీని లేఖలో హెచ్చరించారు.
తమ వెబ్‌సైట్ ఐబొమ్మపై దృష్టి పెట్టడం ఆపాలని.. మీరు మా మీద ఫోకస్ చేస్తే.. మాకు మీపై ఎక్కడ ఫోకస్ చేయాలో తెలుసని వార్నింగ్ ఇచ్చారు. డిస్ట్రిబ్యూటర్స్‌కు ప్రింట్ అమ్మిన తరువాత.. కెమెరా ప్రింట్స్ తీసిన వాళ్లను వదిలేసి.. ఓటీటీ రెవెన్యూ కోసం ఆలోచిస్తూ తమపై ఫోకస్ పెట్టారని అన్నారు. ఈ సందర్భంగా హీరోల రెమ్యూనరేషన్ గురించి లేఖలో ప్రశ్నించారు. పరోక్షంగా అల్లు అరవింద్ పేరును తీసుకువచ్చారు.
హీరోలకు అంత రెమ్యూనరేషన్ అవసరమా..? అని.. అది కొడుకు అయినా.. ఎవరు అయినా అని అడిగారు. ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారని వాళ్లు ఏమైపోతారని కబుర్లు చెప్పకండి అని అన్నారు. సినిమాలో ఎక్కువ శాతం రెమ్యూనరేషన్స్, విదేశాలలో షూటింగ్స్, ట్రిప్స్‌కు ఖర్చుపెడుతున్నారు. మరి ప్రొడక్షన్ బాయ్స్ నుంచి లైట్ బాయ్స్ వరకు ఎంత ఖర్చుపెడుతున్నారు..? మన దేశంలో షూటింగ్ చేస్తే ఖర్చు తగ్గుతుంది కదా..? ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని కదా అని ప్రశ్నించారు.
iBOMMA warning to Telugu Film industry 😲🤯 pic.twitter.com/1utGXhlwPt
— 𝙐𝙨𝙩𝙝𝙖𝙖𝙙🔥ᵖˢᵖᵏ𝙘𝙪𝙡𝙩🦅 (@USTHAAD_PK_CULT) September 6, 2023
"అనవసరంగా ఖర్చు పెట్టి.. ఎక్కువ ధరలకు అమ్ముకుంటున్నారు.. డిస్టిబ్యూటర్స్, థియేటర్ యజమాన్యాలు ఆ డబ్బులు రాబట్టుకునేందుకు టికెట్ రేట్లు పెంచుతుయి. చివరికి మధ్య తరగతి వాళ్లు బాధపడుతున్నారు. మా వెబ్‌సైట్ మీద ఫోకస్ చేయడం ఆపండి. లేదంటే నేను మీ మీద ఫోకస్ చేయాల్సి వస్తుంది. ముందు వేరే కెమెరా ప్రింట్ రిలీజ్ చేస్తున్న వెబ్‌సైట్ల మీద దృష్టిపెట్టండి. మీ యాక్షన్‌కు నా రియాక్షన్ ఉంటుంది. ఈ మధ్యలో ఏ హీరో కూడా టార్గెట్ అవ్వడం ఇష్టం లేదు. మేం స్వతహా మా వెబ్‌సైట్ నుంచి తొలగిస్తున్నాం. బురదలో రాయి వేయకండి అని.. అది కూడా పెంట మీద అస్సలు వేయకండి. చావుకు భయపడని వాడు.. దేనికి భయపడడు.." అంటూ ఐబొమ్మ పేరుతో సోషల్ మీడియాలో లేఖ వైరల్ అవుతోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి